Home » Entertainment » Hyper Aadi Satires On Varsha And Emmanuel In Pushpa Spoof
Entertainment

Hyper Aadi : ఆ డైలాగ్‌తో పుష్పం అయిపోయావ్.. వర్ష ఇమాన్యుయేల్‌ పరువుతీసిన హైపర్ ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 4, 2022 5:05 pm
Advertisement

Hyper Aadi : వర్ష ఇమాన్యుయేల్ జోడి మీద హైపర్ ఆది వేసే కౌంటర్లు, సెటైర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్ష ఇమాన్యుయేల్ జోడి చేసే ఎక్స్ ట్రాల మీద ఆది దారుణమైన కామెంట్లు వేస్తాడు. వర్ష తన స్కిట్ కోసం స్క్రిప్ట్ ప్రకారం ఇమాన్యుయేల్ మీద ప్రేమను కురిపిస్తుంది. ఇక దాంతో పాటు ఆమె చేసే ఎక్స్ ట్రాలు కూడా ఓవర్‌గానే ఉంటాయి. స్టేజ్ మీద వర్ష ఇమాన్యుయేల్ చేసే రొమాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, లవ్ ట్రాకులు బాగానే ఉంటాయి. ఒక్కోసారి అవి హద్దులు దాటుతుంటాయి. అలాంటి సమయంలో ఆదినే పంచులు వేస్తుంటాడు. అర్దరాత్రి ఫోన్ చేశాడు.. గోడదూకాడు.. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు..

Advertisement

ఎప్పుడూ ఏమీ అనడం.. ఆయనంటే నాకు ఇష్టం.. ఇలాంటి డైలాగ్స్ అన్నీ స్టేజ్ మీద చెబుతుంది. ఆయన ఎవరితోనైనా ఉంటే చాలా కష్టం.. చాలా కష్టం అంటూ వర్ష ఏడ్చుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిన ఎపిసోడ్స్ ఎంతగా ట్రోలింగ్‌కు గురయ్యాయో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా అలాంటి ఓ డైలాగ్ కొట్టేసింది వర్ష. అత్తకు చెప్పు నీ కోడలు వస్తోందంటూ ఇమాన్యుయేల్‌ను ఉద్దేశించి వర్ష డైలాగ్ చెబుతుంది. అది కూడా ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే డైలాగ్‌ను ఆది మళ్లీ వాడేశాడు. ఆదివారం ప్రసారం అయిన శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది ఓ స్పూప్ వేశాడు.

Hyper Aadi Satires on varsha And Emmanuel in Pushpa Spoof

Advertisement

పుష్ప సినిమా స్పూప్‌లో భాగంగా ఆది, రాం ప్రసాద్, ఇమాన్యుయేల్, పొట్టి నరేష్ ఇలా అందరూ పుష్ప గెటప్‌లో వచ్చారు. ఇందులో భాగంగా శ్రీవల్లిగా అన్నపూర్ణమ్మ నటించింది. ఆమె స్నేహితురాలిగా వర్ష కనిపించింది. అన్నపూర్ణమ్మ మీద ఆది, రాం ప్రసాద్‌లు దారుణంగా సెటైర్లు వేశారు. అది పక్కన పెడితే.. పుష్పగా ఇమాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో దుమ్ములేపేశాడు ఆది. షెకావత్‌కు జుట్టు వచ్చిందా? పుష్పకు జుట్టు పోయిందా? ఎవడ్రా నువ్ అని ఆది అడుగుతాడు. మొన్నటి డైలాగ్‌తో పుష్ప అయ్యాను.. అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వర్ష చెప్పిన ఆ అత్త డైలాగ్‌ను వేశారు. ఆ డైలాగ్‌తో నువ్ పుష్ప కాదు.. పుష్పం అయ్యావ్ అంటూ ఆ జోడి పరువుతీస్తాడు ఆది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి