Home » Entertainment » Hyper Aadi Sudigali Sudheer Rashmi Gautam Getup Srinu Assets
Entertainment

Hyper Aadi : రష్మీ, సుధీర్, గెటప్ శ్రీనుకు అన్ని ఆస్తులున్నాయా?.. హైపర్ ఆది అన్ని ఎకరాలు కొనేశాడా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 12, 2022, 12:31 pm
Advertisement

Hyper Aadi : జబర్దస్త్, మల్లెమాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. అలాంటి వాటి మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు నెట్టింట్లో వివాదానికి దారి తీశాయి. మల్లెమాల, శ్యాం ప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ షోను దారుణంగా కించపరుస్తూ ఆరోపణలు చేశాడు కిరాక్ ఆర్పీ. అన్నం కూడా పెట్టేవారు కాదని, అందరినీ అవమానించేవారని, అక్కడ బానిస బతుకు బతకాల్సి వచ్చిందంటూ ఇలా నానా చెత్త మాటలు మాట్లాడేశాడు. కానీ అదే ఆర్పీ గతంలో ఓ షో తనకు అమ్మ లాంటిదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కిరాక్ ఆర్పీ చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలు ఖండించేందుకు, అవన్నీ తప్పు అని చెప్పేందుకు ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రంగంలోకి దిగారు.

Advertisement

జబర్దస్త్, మల్లెమాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. వారు చేసిన సహాయ కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చాడు. ఇక జబర్దస్త్ వల్ల ఎంత సంపాదించామో మరిచిపోయారా? అంటూ ఆది నిలదీశాడు. తాను ఉన్న మూడు ఎకరాలను అమ్మేసుకున్నాను.. అయితే జబర్దస్త్ వల్ల మళ్లీ అదే ఊర్లో పదహారు ఎకరాలు కొనేశాను అని ఆది అన్నాడు. ఇక గెటప్ శ్రీను, రష్మీ, సుధీర్‌ల గురించి, వారి ఆస్తిపాస్తుల గురించి కూడా చెప్పేశాడు. సుధీర్ ఆల్రెడీ ఓ ఇళ్లు కట్టుకున్నాడు.. ఇంకో విల్లా కూడా కొనేశాడు.. అని చెప్పేశాడు ఆది. రష్మీ ఇళ్లు కొనుక్కుంటాను అంటే మల్లెమాల వాళ్లే ష్యూరిటీ పెట్టి లోన్ ఇప్పించారు..

Hyper aadi Sudigali Sudheer Rashmi Gautam Getup Srinu Assets

Advertisement

గెటప్ శ్రీను కూడా ఓ ఇళ్లు కట్టుకున్నాడు.. అని ఇలా ఆది వరుసగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. ఇక రాం ప్రసాద్ కూడా తన స్టేటస్‌ను చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ దయ వల్లే.. తాను వైజాగ్‌లో ఇళ్లు కట్టుకున్నాను.. ఇక్కడ కూడా ఓ ఇళ్లు కొనుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి జబర్దస్త్ వల్ల, మల్లెమాల వల్ల, శ్యాం ప్రసాద్ రెడ్డి వల్ల అందరం ఇంత బాగు పడితే.. ఇంత సంపాదించుకుంటే.. ఇలాంటి మాటలు మాట్లాడతాడా? మరి కిరాక్ ఆర్పీ ఇళ్లు కట్టుకోలేనంత మాత్రాన ఇలా అంటాడా? ఆయన ఎందుకు కట్టుకోలేదో అని ఆది, రాం ప్రసాద్ కౌంటర్లు వేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి