Home » Entertainment » Hyper Aadi Troll Manchu Vishnu Dialogues
Entertainment

Hyper aadi : మంచు విష్ణు పరువుపాయే.. దారుణంగా కించపరిచిన హైపర్ ఆది

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 30, 2021, 9:40 pm
Advertisement

Hyper aadi  వేదిక ఏదైనా హైపర్ ఆది పండించే కామెడీ మాములుగా ఉండదు. తనదైన పంచ్ డైలాగ్‌లతో జనాలను అలరిస్తాడు. తన స్కిట్‌లో ఉండే వ్యక్తులపై భారీగా పంచ్ డైలాగ్‌లు వదులుతుంటాడు. స్కిట్‌లోకి గెస్ట్‌లుగా వచ్చేవారిని కూడా వదలడు. ముఖ్యంగా ట్రెండింగ్ టాపిక్స్ మీద ఆది చేసే స్కిట్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. యూట్యూబ్‌లో కూడా హైపర్‌ ఆది మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అయితే తాజాగా మంచు విష్ణును ఉద్దేశించి ఆది చేసిన స్కిట్‌ వైరల్ అవుతోంది.

Advertisement

hyper aadi troll manchu vishnu dialogues

ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికల వేశ హీరో మంచు విష్ణు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్‌పై విమర్శలు చేశాడు. అయితే ఓ ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు రాజశేఖర్ గురించి ఏదో చెప్పబోతుండగా.. నరేష్ అడ్డుకుంటాడు. అప్పుడు విష్ణు.. లేట్ దేమ్ నో అని అంటాడు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ప్రకాశం పంతులు పేరు చెప్పడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో కొందరు మంచు విష్ణును దారుణంగా ట్రోల్ చేశారు.

Advertisement

Hyper aadi  మంచు విష్ణుపై ఆది సెటైర్లు

అయితే ఇప్పుడు వీటిని బెస్ చేసుకుని మంచు విష్ణును దారుణంగా ట్రోల్ చేశాడు. లేట్ దేమ్ నో అంకుల్ అని ఆది చెప్పగానే అక్కడున్న రోజా, ఇంద్రజాలతో సహా ఉన్నవారంతా ఫుల్‌గా నవేశారు. ఆ తర్వాత గుడివాడ.. అని ఏదో తడబడినట్టుగా మరో డైలాగ్ వదిలాడు. దీంతో వేదిక మొత్తం నవ్వులతో దద్దరిలింది. దీనిని చూసిన ఆది ఏమిటి అంతా ధైర్యం చేశాడు అని కామెంట్స్ చేశాడు. అయితే ప్రోమోలోనే ఇలా ఉంటే స్కిట్ మొత్తం ఇంకేలా ఉంటుందో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి