Home » Entertainment » If He Comes To Nithin Check Movie Pre Release Event Then It Will Be Highlighted
Entertainment

Nithin : నితిన్ చెక్ సినిమా ప్రీ రిలీజ్ కి ఆయన వస్తున్నాడంటే ‘ఆర్ఆర్ఆర్’ సౌండ్ అదిరిపోద్ది..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: March 8, 2021, 1:33 pm
Advertisement

Nithin : నితిన్ త్వరలో చెక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21 ‘భీష్మ’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ స్టార్ హీరో నితిన్ వరసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. రంగ్ దే, చెక్, బాలీవుడ్ అంధాదున్ తెలుగు రీమేక్ తో పాటు పవర్ పేట అన్న సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రంగ్ దే సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని మార్చ్ 26 న రిలీజ్ కి రెడీ అవుతోంది.

Advertisement

if-he-comes-to-nithin-check-movie-pre-release-event-then-it-will-be-highlighted

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ సినిమా తెలుగు రీమేక్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే పవర్ పేట సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది. కాగా ఈ నెల 26 న చెక్ సినిమా రిలీజ్ కాబోతోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్ తో పాటు లిరికల్ వీడియో సాంగ్స్ కూడా సినిమా మీద భారీగా అంచనాలు పెరిగేలా చేశాయి.

Advertisement

Nithin : నితిన్ చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి..!

కాగా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కాగా ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాబోతున్నారు. దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటికి – రాజమౌళి కి మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగా పిలవగానే కాదనకుండా వస్తానని మాటిచ్చారట. అయితే ఈ ఈవెంట్ లో అటు మెగా అభిమానులు – ఇటు నందమూరి అభిమానులు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి.. ట్రైలర్ గురించి .. సాంగ్స్ గురించి అడిగి సందడి చేస్తారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆ రోజూ రీసౌండ్ అదిరిపోతుందని అంటున్నారు…

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి