Home » Entertainment » If They Had Told Shalini Pandey To Do So Vijay Would Have Surpassed Devarakonda
Entertainment

శాలినీ పాండే కి వాళ్ళు గనక అలా చేయమని చెప్పి ఉంటే విజయ్ దేవరకొండనే మించిపోయేది ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: January 4, 2021, 1:46 pm
Advertisement

శాలినీ పాండే విజయ్ దేవర కొండ తో నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం తో శాలినీ పాండే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అంతగా క్రేజ్ సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి లాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ లో బోల్డ్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ చేసి యూత్ ని బాగా ఆకట్టుకుంది. చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాని శాలినీ పాండే కోసం ఇప్పటికీ చూసే కుర్రాళ్ళు ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే. ఈ సినిమాతో శాలినీ పాండే సంపాదించుకున్న క్రేజ్ తో టాలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుందనుకుంటే అవకాశాల కోసం ఆవురావురంటోంది.

Advertisement

ఇంత హాట్ బ్యూటీకి అసలు టాలీవుడ్ లో అవకాశాలు ఎందుకు రావడం లేదో కూడా కొంతమందికి అర్థం కావడం లేదంటున్నారు. వాస్తవంగా అర్జున్ రెడ్డి తర్వాత శాలీనీ పాండే మహానటి, 118 సినిమాలు చేసే అవకశాలు వచ్చాయి. కాని కీర్తి సురేష్, సమంత ల ముందు శాలినీ పాండే ఎవరికీ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత 118 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దాంతో కళ్యాణ్ రాం లాంటి హీరోతో నటించి హిట్ అందుకుంది కాబట్టి ఇక కెరీర్ కి ఏమాత్రం ఢోకా లేదనుకున్నారు.

Advertisement

కాని ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేసిన ఇద్దరిలోకం ఒక్కటే సినిమా భారీ డిజాస్టర్ కావడం తో శాలినీ పాండే ఆశలన్ని గల్లంతయ్యాయి. ఇక అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమాలో నటించింది. కాని ఈ సినిమాలో శాలినీ పాండే ఉన్న విషయం కూడా ఎవరికీ అంతగా గుర్తుండటం లేదు. అయితే టాలీవుడ్ లో తనకి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకనే శాలినీ పాండే వెనకబడిందని చెప్పుకుంటున్నారు. త్రివిక్రం లాంటి డైరెక్టర్స్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా శాలినీ పాండే తన సత్త ఏంటో చూపిస్తుందని అంటున్నారు. కాగా బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీ ఒకే నిర్మాణ సంస్థలో 3 సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ మీద సైన్ చేసింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి