Home » Entertainment » Ileana Love Marriage Very Soon
Entertainment

Ileana : ఇలియానా కొత్త ప్రేమ ప్ర‌యాణం.. హీరోయిన్ సోద‌రుడితో డేటింగ్ నిజం..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 14, 2022, 1:00 pm
Advertisement

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందంతో పాటు స‌న్నని న‌డుముతో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ఆఫర్స్ లేక ఖాళీగా ఉంది. గతంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేయడంపై బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆ ల‌వ్ వ‌ల‌న డిప్రెష‌న్ కి వెళ్లింది. దాని నుంచి బయటపడ్డాక ఎట్టకేలకు ఇప్పుడు ఇలియానాకు మళ్లీ ప్రేమ దొరికింది. కత్రిన సోదరుడితో జత కుదిరింది.

Advertisement

కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా సాన్నిహిత్యం గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూలై 16న జరిగిన కత్రిన పుట్టినరోజు వేడుకలో కత్రినా తన భర్త.. నటుడు విక్కీ కౌశల్.. ఇలియానా బృందం మాల్దీవుల్లో సెబాస్టియన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అటుపై కత్రినా సోదరుడు.. మోడల్ సెబాస్టియన్ తో ఇలియానా సన్నిహితంగా మెలుగుతోందని దీనివల్లనే ఇద్దరు నటీమణులు దగ్గరై అది స్నేహానికి దారితీసిందని ముంబై మీడియా కథనాలు రాసింది. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. దాదాపు ఆరు నెలలుగా రిలేషన్ షిప్ ని కొనసాగిస్తున్న ఈ జంట మీడియా కంటికి చిక్కకుండా దాక్కుంటోంది.

Ileana love marriage very soon

Advertisement

Ileana : కొత్త ప్రేమాయ‌ణం..

ఇలియానా- సెబాస్టియన్ కత్రినా బాంద్రా ఇంట్లో (పాత ఇల్లు) లేదా ఇలియానా నివాసంలో ఒకరితో ఒకరు తమ విలువైన సమయాన్ని గడుపుతున్నారని కూడా కథనాలొచ్చాయి. ముంబై మీడియా కథనాలు నిజమే అయితే.. ఈ జంట త్వరలో ఓ ఇంటివాళ్లయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాఫీ విత్ కరణ్ 7 సీజన్ లో తారల రహస్యాలను లీక్ చేస్తున్న కరణ్.. ఇలియానా- సెబాస్టియన్ జంట రహస్యాన్ని కూడా లీక్ చేసారు. సెబాస్టియన్ లవ్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఇలియానా కొత్త లవ్ కన్ఫామ్ అయ్యింది. ఇలియానా చివరిసారిగా దర్శకుడు కూకీ గులాటీ – ది బిగ్ బుల్ లో అభిషేక్ బచ్చన్ సరసన కనిపించింది. తదుపరి ఓ రెండు చిత్రాల్లో నటించనుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి