Home » Entertainment » In Dead Pixel Pre Release Event Niharika Dress Video Viral In Social Media
Entertainment

Niharika konidela : డెడ్ పిక్సెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో… వెరైటీ డ్రెస్ లో నిహారిక వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 19, 2023, 8:00 am
Advertisement

Niharika konidela  : మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత “డెడ్ పిక్సెల్” అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బ్రిటన్ వెబ్ సిరీస్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నీ డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి నిర్మాతగా మరియు… వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్ర కూడా పోషించడం జరిగింది. గాయత్రి పాత్రలో నిహారిక కనిపించగా ఇతర ముఖ్యమైన పాత్రలలో… అక్షయ్, భావన, వైవా హర్ష కనిపించబోతున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన టీజర్ ఒక్కసారి అంచనాలు పనిచేయడం జరిగింది. వీడియో గేమ్స్ చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. తరచూ యువతీ యువకులు వీడియో గేమ్ లో పడిపోవడంతో… తమ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఏం పట్టించుకోవటం లేదు. ఈ సందర్భంగా డెడ్ పిక్సెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది ఎంతో నాకు ప్రాముఖ్యం. గాయత్రి పాత్రలో నన్ను నేను అసలు ఊహించుకోలేను. అటువంటిది మా డైరెక్టర్ ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు.

Advertisement

దర్శకుడు నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. ఫాహద్ నన్ను చాలా అద్భుతంగా చూపించారు చాలా థాంక్స్ అని నిహారిక మిగతా నటినట్లు గురించి మాట్లాడి స్పీచ్ ఇచ్చారు. అయితే ఈ వేడుకకు నిహారిక ఫుల్ షర్ట్ లో వచ్చారు. చాలా వెరైటీగా ఉంది. నిహారిక అందరిలో కల్లా చాలా విభిన్నంగా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి