Jabardasth : జబర్దస్త్ షోలో కనిపించని రోజా.. ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth : జబర్దస్త్ షోలో కనిపించని రోజా.. ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించిందా?

 Authored By prabhas | The Telugu News | Updated on :29 March 2022,8:00 pm

Jabardasth : జబర్దస్త్ షో అంటే ప్రస్తుతం మొత్తం రోజానే. రోజానే అక్కడ ఏకఛత్రాదిపత్యం నడుస్తోంది. రోజా చెప్పినట్టుగానే నడుస్తుంది. కమెడియన్లు సైతం రోజా చెప్పినట్టుగానే చేస్తారు. స్కిట్లో కూడా రోజా భజనే నడుస్తుంటుంది. రోజాను పొగుడుతూనే స్కిట్లు, డైలాగ్స్ వేస్తుంటారు. ఇక రోజాకు ఆల్టర్నేటివ్ కనిపించడం లేదు. ఒకప్పుడు నాగబాబు హవా నడిచేది.

ఇప్పుడు రోజాదే హవా నడుస్తోంది. నాగబాబు ప్లేస్‌ను అంతో ఇంతో మనో భర్తీ చేసేస్తున్నాడు. అయితే ఈ మధ్య మనో కూడా కనిపించడం లేదు. మనో స్థానంలో ఆమని, ఇంద్రజ, లైలా వంటి వారు వస్తున్నారు. జబర్దస్త్ జడ్జ్‌లుగా అంతా మహిళలే కనిపిస్తున్నారు. అయితే రోజాదే అక్కడ పెత్తనం. ఆమని, లైలా వంటి వారున్నా కూడా వారిని ఎక్కువగా హైలెట్ చేయలేరు.

Indraja Will Replaces Roja In Jabardasth

Indraja Will Replaces Roja In Jabardasth

Jabardasth : రోజాకు బదులు ఇంద్రజ..

అయితే ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ బాగానే చేస్తోంది. ఇంద్రజ సోలో జడ్జ్‌గానూ మెప్పిస్తోంది. దీంతో రోజాకు ప్రత్యామ్నాయంగా ఇంద్రజను తీసుకుంటున్నట్టున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో రోజా కనిపించలేదు. ఆమె స్థానంలో ఇంద్రజ కనిపించింది. అయితే ఆ మధ్య రోజా వద్దు.. ఇంద్రజ ముద్దు అనే స్లోగన్ ఎక్కువగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

YouTube video

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి