Intinti Gruhalakshmi 27 Dec Today Episode : తులసి ఇంట్లో శృతి ప్రెగ్నెంట్ సెలబ్రేషన్స్.. ఇంతలో కాలు జారి కింద పడ్డ శృతి.. తన గర్భం పోతుందా?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 27 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 826 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని ఇంట్లోకి రానివ్వకుండా.. అసలు నువ్వెవరు ఇక్కడ సెలబ్రేషన్స్ చేయడానికి అని తను తీసుకొచ్చిన కవర్ ను విసిరి పారేస్తుంది లాస్య. ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపో అంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. అంకిత, శృతి ఇద్దరూ చాలా బాధపడతారు. స్కూటీ మీద ఇంటికి వెళ్తూ చాలా బాధపడుతుంది. మరోవైపు తులసి ఎక్కడికి వెళ్లింది అని టెన్షన్ పడతాడు సామ్రాట్. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటాడు. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. తనను చూసి తన కన్నీళ్లను దిగమింగుకుంటుంది. ఇంతలో తులసిని చూస్తాడు సామ్రాట్.

Advertisement

intinti gruhalakshi 27 december 2022 full episode

తులసిని చూసి షాక్ అవుతాడు సామ్రాట్. ఏమైపోయారండి. కలిసి ఆఫీసుకు వెళ్దాం అన్నారు. వస్తే ఇంట్లో లేరు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటాడు. దీంతో అనుకోకుండా లేట్ అయిపోయింది సారీ. మీరు వెళ్లండి సార్.. నేను ఒక గంటలో వస్తాను అని చెప్పి తన దు:ఖాన్ని దిగమింగుకొని ఇంట్లోకి వెళ్లిపోతుంది తులసి. దీంతో సామ్రాట్ కు అసలు ఏం అర్థం కాదు. ఇంట్లోకి వెళ్లి వెక్కి వెక్క ఏడుస్తుంది తులసి. లోపలికి వచ్చిన సామ్రాట్.. తను ఏడవడం చూస్తాడు. సామ్రాట్ రావడం చూసి షాక్ అవుతుంది తులసి. నాకు తెలిసి తులసి గారు ఏడవరు. ఏడవకూడదు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని నిలబడుతుంది అని అంటాడు సామ్రాట్. దీంతో దేవుడు పెట్టే కష్టాన్ని తట్టుకుంటున్నాను కానీ.. మనుషులు పెట్టే కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు సామ్రాట్ గారు. నా భర్తను తనకు వదిలిపెట్టాను. నా ఇంటిని తనకు రాసిచ్చాను. ఇష్టం లేకపోయినా మా అత్తయ్య, మామయ్య, నా పిల్లలు అందరినీ అక్కడే ఉండనిచ్చాను. ఇంతకంటే ఇంకేం చేయను. ఇంతకంటే ఇంకేం వదులుకోను. ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిలేదు. నా ప్రాణం తప్ప. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది అంటుంది తులసి.

Advertisement

దీంతో తన దగ్గర కూర్చొన్న సామ్రాట్.. అది పిరికివాళ్లు చేసే పని. తులసి గారు చేసే పని కాదు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు పట్టించుకోను అంటూ ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు. ఏడవడం అంటే ఓడిపోవడమే. తులసి గారు ఓడిపోవడం అంటే నీ ఫ్రెండ్ సామ్రాట్ ఓడిపోవడమే. నీకు అది ఇష్టమేనా అంటాడు సామ్రాట్.

దీంతో లేదు సామ్రాట్ గారు. నేను ఓడిపోయాను. నా పిల్లలకు దూరం అవడం అంటే నేను ఓడిపోవడమే అంటుంది తులసి. నా కోడలుకు నేను సారె తీసుకెళ్లడం నేను కుదరలేదు అంటే అది ఓడిపోవడమే అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 27 Dec Today Episode : తులసిపై నందు, లాస్య సీరియస్

దీంతో మీ కాళ్లను మీరే కట్టేసుకుంటున్నారు. సంకెళ్లు వేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు అంటాడు సామ్రాట్. మీరు ఏనాటికీ ఆత్మస్థైర్యం కోల్పోకండి. రండి వెళ్దాం. నేను మీతో పాటే ఉంటాను అంటాడు సామ్రాట్.

ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా నా కోసం వస్తూ పోతూ ఉండాలని ఆరోజు నీ ముందే తులసిని బతిమిలాడుకున్నాను అంటుంది అనసూయ. ఆ విషయంలో నీకు అభ్యంతరం ఉంటే ఆరోజే నా ముఖం ముందు చెప్పాల్సి ఉండేది అంటుంది అనసూయ.

ఈ ఇంటికి వచ్చిన తులసిని ఇందాకా ఇంటి గుమ్మం నుంచే వెళ్లగొట్టింది నీ పెళ్లాం. ఘోరంగా అవమానించింది అని అంటుంది అనసూయ. ఇంత జరిగినా నువ్వు నోరెత్తవా అంటుంది అనసూయ. మీ అబ్బాయి మాజీ పెళ్లానికి ఏదో అవమానం జరిగిందని అంత కుతకుతలాడుతున్నారా అంటుంది లాస్య.

మరి నాకు జరిగింది ఏంటి అని అంటుంది లాస్య. ఈ ఇంటి మనిషిని అయి ఉండి.. ఈ ఇంట్లో విషయాలు బయటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది నేను అంటుంది లాస్య. కరెక్టే కదా అంటాడు నందు. తులసికి అడ్డుపడినప్పుడు అయినా నా వల్ల తప్పు జరిగింది ఆంటి అని కనీసం శృతి కూడా చెప్పలేదు అంటుంది లాస్య.

ఇంతలో సామ్రాట్, తులసి ఇద్దరూ అక్కడికి వస్తారు. మీ బంధాలు ఉంటే మీ ఇంట్లో, ఆఫీసులో చూసుకోండి ఇక్కడ కాదు అంటుంది లాస్య. నువ్వెందుకు వచ్చావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని సామ్రాట్ ను అంటుంది లాస్య.

నందు కూడా అదే అంటాడు. ఆయన ఇక్కడ ఉండాలంటే కుదరదు. లేదంటే ఇద్దరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు నందు. దీంతో నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అంటుంది. అయినా కూడా నందు, లాస్య వినరు.

దీంతో అందరూ కలిసి తులసి ఇంటికి వెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో బెలూన్ పగిలి శృతి కిందపడుతుంది. దీంతో తన కడుపుకు గాయం అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…

44 mins ago

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

2 hours ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

3 hours ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

4 hours ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

13 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

15 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

16 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

17 hours ago

This website uses cookies.