
intinti gruhalakshmi 01 october 2022 full episode
Intinti Gruhalakshmi 01 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు అక్టోబర్ 01, 2022 శనివారం ఎపిసోడ్ 752 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడని తెలుసి సంతోషపడతాడు. కానీ.. ఇంతలో ప్రేమ్ ను ఓ వ్యక్తి అడ్డుకుంటాడు. ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు అంటే రికమండేషన్ల మీద వచ్చి సెలెక్ట్ అవడం గొప్ప అనిపించుకోదు అంటాడు అతడు. నేను రికమెండేషన్ కేవలం ఇక్కడికి రావడానికే తీసుకున్నా. కానీ.. ఇక్కడికి వచ్చాక నా టాలెంట్ తో సెలెక్ట్ అయ్యా అంటాడు ప్రేమ్. కానీ.. అతడు ఊరుకోడు. ప్రేమ్ ను రెచ్చగొడతాడు. నువ్వు సెలెక్ట్ అవడానికి కారణం మీ అమ్మ. అక్కడ సామ్రాట్ గారిని ముగ్గులోకి లాగి ఇప్పుడు ఏం తెలియనట్టు మీ అమ్మ నటిస్తోంది. నాకు అంతా తెలుసు అంటూ అతడు మాట్లాడేసరికి ప్రేమ్ కోపంతో అతడిని కొడతాడు. దీంతో అక్కడి వారు పోలీసులకు కాల్ చేస్తారు.
intinti gruhalakshmi 01 october 2022 full episode
కట్ చేస్తే సామ్రాట్ మీటింగ్ లో ఉంటాడు. తులసి కూడా ఆ మీటింగ్ లో పాల్గొంటుంది. కానీ.. సామ్రాట్ తులసిని చూసి బాధపడుతూ ఉంటాడు. అనసూయ చెప్పిందే గుర్తొస్తుంటుంది సామ్రాట్ కు. ఓవైపు మీటింగ్ జరుగుతుంటే సామ్రాట్ అలా ఉన్నాడు ఏంటి.. అని అనుకుంటుంది తులసి. మీటింగ్ లో డిస్టర్బ్ గా ఉండటం చూసి ఏమైంది అని మెసేజ్ చేస్తుంది కానీ.. సామ్రాట్ పట్టించుకోడు. మరోవైపు ప్రేమ్, అతడు కొట్టిన వ్యక్తి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రేమ్ ఫోన్ ఇచ్చి నీ వాళ్లకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అంటాడు పోలీస్. దీంతో అమ్మకు చేస్తే కంగారు పడుతుందని ఫోన్ సామ్రాట్ కు చేస్తాడు. నేను ప్రాబ్లమ్ లో ఉన్నాను. అని మొత్తం చెబుతాడు. దీంతో మీటింగ్ మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్. నేను ఇప్పుడే వస్తున్నాను అని ప్రేమ్ కు చెబుతాడు.
మరోవైపు పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకోబోతారు ప్రేమ్, అతడు. దీంతో ఇద్దరినీ తీసుకొని బయటికి వస్తాడు ఎస్ఐ. ఇంతలో సామ్రాట్ వస్తాడు. ఎస్ఐ గారు ప్రేమ్ ను వదిలేయండి అంటాడు సామ్రాట్. దీంతో అతడు మీకేమౌతాడు అని అడుగుతాడు ఎస్ఐ.
అది ఎస్ఐ గారు కరెక్ట్ ప్రశ్న అడిగారు అంటాడు ఆ వ్యక్తి. తర్వాత ప్రేమ్ ను నా పూచీకత్తు మీద వదిలిపెట్టు అంటాడు సామ్రాట్. నేను ప్రేమ్ కు సర్దిచెప్పుకుంటాను అంటాడు సామ్రాట్. దీంతో ఇద్దరినీ వదిలేస్తాడు ఎస్ఐ.
బయటికొచ్చాక నీకు అసలు బుద్ధి ఉందా.. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. అందుకని వాడిని కొడతావా అంటాడు సామ్రాట్. మా అమ్మను ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను సార్. అందుకే మా నాన్నతో కూడా నేను సరిగ్గా మాట్లాడటం లేదు అంటాడు.
ఈ గొడవలు మా అమ్మకు తెలియనీయకండి సార్. ఇది మనమధ్యే ఉండాలి అని సామ్రాట్ ను కోరుతాడు ప్రేమ్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రేమ్ చెప్పిన మాటలే సామ్రాట్ కు గుర్తొస్తుంటాయి.
మరోవైపు సామ్రాట్ ఎక్కడికి వెళ్లాడో అని బాబాయి, తులసి టెన్షన్ పడుతుంటారు. తులసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సామ్రాట్ లిఫ్ట్ చేయడు. మళ్లీ ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది తులసి.
దీంతో ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని అంటాడు సామ్రాట్. దీంతో లంచ్ టైమ్ అయింది కదా అని అడుగుతుంది తులసి. టైమ్ నా దగ్గర ఉంది. నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోండి. నేను లంచ్ కు రావట్లేదు. బాబాయికి చెప్పండి. ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సామ్రాట్. కట్ చేస్తే సాయంత్రం అవుతుంది. తులసి ఇంటికి వస్తుంది. అనసూయ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సామ్రాట్ నేను చెప్పిన విషయాన్ని వినలేదా.. తులసి నార్మల్ గానే ఉంది ఏంటి అని అనుకుంటుంది అనసూయ.
ఆ తర్వాత ఫైల్ విషయంలో నాకు ఎందుకు అబద్ధం చెప్పావని ఝాన్సీని నిలదీస్తుంది తులసి. లాస్యనే ఈ పని చేయించిందని తులసికి చెబుతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.