Intinti Gruhalakshmi 02 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 02 జనవరి 2022, సోమవారం ఎపిసోడ్ 831 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి వల్లనే మనకు ఇదివరకు చాలా సమస్యలు వచ్చాయి. ఇదివరకు అంకితకు అబార్షన్ అవడానికి కూడా తులసే కారణం. ఇప్పుడు శృతికి ఇలా అవ్వడానికి కూడా తులసే కారణం అంటాడు నందు. దీంతో నాకు అబార్షన్ అవడానికి కారణం తులసి ఆంటి కాదు అంకుల్ అంటుంది అంకిత. మేము ఇక్కడ ఉండటానికి కారణమే అమ్మ. అమ్మ చెప్పింది కాబట్టే ఇక్కడ ఉన్నాం అంటాడు ప్రేమ్. మా కాళ్లకు సంకెళ్లు వేయడానికి ట్రై చేయకండి. మామ్ కావాలా.. డాడ్ కావాలా అని డిసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురాకండి అంటుంది దివ్య. దీంతో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ ఇంట్లో మళ్లీ రాకూడదు అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే రేపటి మీటింగ్ బాధ్యత సామ్రాట్.. తులసికి అప్పగిస్తాడు. దీంతో రిపోర్ట్స్ అన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయి. అవి తులసికి అర్థం కావు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. దివ్యకు కాల్ చేసి హెల్ప్ తీసుకుంటాను అని అనుకుంటుంది తులసి. వెంటనే దివ్యకు ఫోన్ చేస్తుంది. నాకో ప్రాబ్లమ్ వచ్చింది అని అడుగుతుంది తులసి. ప్రాజెక్టు రిపోర్ట్ ఒకటి అంతా ఇంగ్లీష్ లో ఉంది. చదవడం కష్టంగా ఉంది. అది తెలుగులో కావాలి. ఏం చేయాలి అంటే.. లాప్ టాప్ ఓపెన్ చేయ్. నేను చెప్పినట్టుగా చేయి.. అందులో ట్రాన్స్ లేటర్ ఓపెన్ చేయి అంటుంది. దీంతో దాన్ని ఓపెన్ చేసి ఇంగ్లీష్ లో ఉన్న రిపోర్ట్ ను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసి చదువుతుంది తులసి.
కట్ చేస్తే పరందామయ్యకు గుండెల్లో కాస్త నలతగా ఉంటుంది. చెమటలు పడుతున్నాయి అనసూయ అని పడుకున్న అనసూయను లేపుతాడు. షుగర్ ఏమైనా డౌన్ అయిందేమో అంటుంది అనసూయ. దీంతో వెళ్లి చెక్కర తీసుకురా అంటాడు. దీంతో నేను వెళ్లి షుగర్ తీసుకొస్తాను. మీరు లేవకండి అని అంటుంది.
కిచెన్ లోకి వెళ్తే అక్కడ అన్నింటికీ లాక్ వేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే లాస్య దగ్గరికి వెళ్తుంది. మామయ్య గారికి షుగర్ డౌన్ అయింది చెక్కర నీళ్లు కావాలి అంటుంది. దీంతో దానికి నన్ను ఎందుకు లేపావు అంటే.. కిచెన్ లో అన్నీ లాక్ వేసి ఉన్నాయి అంటే.. ఇప్పుడు ఆ లాక్ ఎక్కడుందో నాకు గుర్తు లేదు. తెల్లారి చూసుకుందాం అని తలుపు వేసుకుంటుంది.
ఇంతలో ఏం చేయాలో అనసూయకు అర్థం కాదు. అంకిత కనిపించడంతో అసలు విషయం చెబుతుంది. దీంతో శృతి దగ్గరికి వెళ్లి గ్లూకోజ్ బాటిల్ తెచ్చి తనకు తాగిస్తుంది. ఆ తర్వాత పరందామయ్య కుదుటపడతాడు. కట్ చేస్తే మీటింగ్ కు లేట్ అవుతోందని తులసి గారు వచ్చారా అని అడుగుతాడు సామ్రాట్.
తులసి గారు ఇంకా రాలేదు అని చెబుతాడు తన పీఏ. కానీ.. బెనర్జీ గారు వచ్చారు అంటాడు. దీంతో టైమ్ కు ఉండాలి కదా. ఇంకా ఎందుకు రాలేదు తులసి అని అనుకుంటాడు సామ్రాట్. బెనర్జీని లోపలకి రమ్మని చెబుతాడు. మరోవైపు రోడ్డు మీద ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది తులసి.
అర్జెంట్ గా మాట్లాడాలన్నారు అని చెప్పడంతో ఒక వ్యక్తి తనను కలవడానికి వస్తాడు. బెనర్జీ గురించి ఆయన్ను అడుగుతుంది. గవర్నమెంట్ లో స్కూల్ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసింది మీరే కదా అని అడుగుతుంది. దీంతో అవును అంటాడు. దీంతో బెనర్జీ గారి గురించి చెప్పండి అని అడుగుతుంది తులసి.
దీంతో బెనర్జీ గురించి.. బెనర్జీ హిస్టరీ గురించి చెబుతాడు. వాడు ఒక ఫ్రాడ్. అలాంటి వాడిని పొరపాటున కూడా మీ కంపెనీలోకి ఎంటర్ చేయొద్దు అని అంటుంది. దీంతో మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్పి తులసి అక్కడి నుంచి ఆఫీసుకు బయలుదేరుతుంది తులసి.
మరోవైపు లాస్యకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది అంకిత. కాఫీ పెట్టి ఇవ్వు అంటే.. అంకిత తనపై విరుచుకుపడుతుంది. అంకుల్ నీతో మాట్లాడనందుకే తల పగుల గొట్టుకున్నావు. తాతయ్యకు ఏమైనా అయితే అంకుల్ నీ తల పగులగొడతారు అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అంకిత.
మరోవైపు బెనర్జీ, సామ్రాట్ ఇద్దరూ తులసి కోసం వెయిట్ చేస్తుంటారు. నాకు మినిస్టర్ అపాయింట్ మెంట్ ఉంది. త్వరగా ప్రాజెక్ట్ డీల్ ఓకే అయితే వెళ్తా అంటాడు బెనర్జీ. ఒక్క నిమిషం సార్.. మా జనరల్ మేనేజర్ రావాలి అంటాడు సామ్రాట్. దీంతో మీరే సీఈవో. మీరే కదా నిర్ణయం తీసుకోవాల్సింది అంటాడు బెనర్జీ
మనం కలిసి ఇంకా చాలా ప్రాజెక్టులు చేయాలి అని అంటాడు బెనర్జీ. దీంతో సరే అని ప్రాజెక్టు ఫైల్ మీద సైన్ చేయబోతాడు సామ్రాట్. ఇంతలో అక్కడికి వచ్చిన తులసి.. ఒక్క నిమిషం అంటూ ఆపుతుంది. ఏంటి తులసి గారు ఇది.. మీటింగ్ ఉందని తెలుసు కదా. ఇంత లేట్ గా రావడం ఏంటి అంటాడు సామ్రాట్.
తనను చూసి ఈవిడేనా మీ జనరల్ మేనేజర్ అంటాడు బెనర్జీ. ఆఫీసు అన్నప్పుడు కాస్త టైమ్ కు రావాలి అంటాడు. బిజినెస్ అన్నప్పుడు కూడా కాస్త నిజాయితీ ఉండాలి అంటుంది తులసి. ప్రపోజల్ చదివాక.. అసలు అక్కడ స్కూల్ కట్టే ప్లేసే లేదు అని సామ్రాట్ కు చెబుతుంది తులసి.
తులసి అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్ అంటాడు సామ్రాట్. లక్షల మంది బిజినెస్ లు చేస్తున్నారు అందరికీ లైసెన్స్ లు ఉన్నాయా? ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో ఇవన్నీ కామన్ సార్. మీరు చూసీ చూడనట్టు వదిలేయాలి అంటాడు బెనర్జీ. దీంతో మీకు ఉంది కానీ.. మాకు లేదు.. మీరు ఇక బయలుదేరొచ్చు అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.