Home » Entertainment » Intinti Gruhalakshmi 05 August 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 05 August 2022 Episode : నందు ముందే తులసికి గులాబీ ఇచ్చిన సామ్రాట్.. తులసి గతం గురించి అడిగిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 5, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 05 August 2022 Episode : సామ్రాట్ నందు ఇద్దరు వన్ హ్యాండ్ లో కుస్తీ పడతారు.. సామ్రాట్ ను చూస్తూ తులసి ఒడిపోమని సైగ చేసింది.. సామ్రాట్ తులసిని అర్థం చేసుకుని కావాలని నందు చేతిలో ఓడిపోతాడు.. ఆతిథ్యం కోసం నందు నీ ఇంటికి పిలిచి తనని ఓడించడం నిజంగా అవమానం అవుతుంది.. పైకితలు నాతో అనకపోయినా ఖచ్చితంగా తను మనసులో ఫీలయ్యాడు.. ఇంత చిన్న విషయం నా మనసుకు ఎందుకు అర్థం కాలేదు అని తులసితో అంటాడు సామ్రాట్.. మీరు ఆట మీద మాత్రమే దృష్టి పెట్టారు అని తులసి ఉంటుంది.. అయినా మీరు ఆలోచించే తీరులోనే న్యాయం ఉంటుందండి.. ఎదుటి మనిషి బాధపడకూడదు అనే ఆరాటం ఉంటుంది అని సామ్రాట్ తులసిని పొగడ్తలతో ముంచేత్తుతాడు..మా ఇంట్లో వాళ్ళే ఇప్పటి దాకా ఈ పొగడ్తలు తో ముంచెత్తుతున్నరు.. ఇప్పుడు మీరు కూడానా అని తులసి అంటుంది.. అయితే ఈ గులాబీ పువ్వు వైపు ఒకసారి చూడండి అని సామ్రాట్ అంటాడు..

Advertisement

చాలా బాగుంది అని చెప్పగానే.. తులసికి ఆ గులాబీ పువ్వు ఇస్తాడు సామ్రాట్.. అది నందు చూస్తాడు కోపం కట్టలు తెంచుకొని వస్తుంది.. కానీ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు.. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను అని తులసితో అంటాడు.. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను అని తులసిని ఇంట్లోకి తీసుకువెళ్తాడు.. సామ్రాట్ తులసికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెబుతడు.. మా హనీని స్కూల్ కాంపిటిషన్ లో గెలవడానికి సహయపడనందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు.. సామ్రాట్ క్లప్స్ కొట్టగానే తులసి ఎదురుగా ఒక టేబుల్ పెట్టీ వెళతారు సర్వంట్స్.. అంకుల్ ఇదేం గిఫ్ట్ అని దివ్య అడుగుతుంది.. తులసి గారు ఆ గిఫ్ట్ ఏంటో రివిల్ చేయమని చెబుతాడు.. వీణ ఉంటుంది.. తులసి ఆ వీణ ను చూస్తూ థాంక్స్ అండి బహుమతి నచ్చింది అని చెబుతుంది.. మీరు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని నేను ఇచ్చిన ఈ వీణ తో మీ మొదటి పాట ఇక్కడే పాడాలి అని అడుగుతాడు..

Intinti Gruhalakshmi 05 August 2022 Full Episode

Advertisement

సామ్రాట్ చూపికి అర్థం ఏమిటవు అని లాస్య నందుతో అంటుంది.. యమునా నదిలో అంటూ తులసి అద్భుతంగా పాడుతుంది.. ఆ పాటకి మురిసిపోయి అందరూ క్లాప్స్ కొడతారు..సామ్రాట్ నందు నీ తులసి పాట ఎలా పాడారు అని అడుగుతాడు.. బాగా పాడారు అని అంటాడు నందు.. బాగా పాడారా.. చాలా బాగా పాడారా అని నందు అడుగుతాడు.. చాలా బాగా పాడారు అనగానే మరి ఎందుకు క్లాప్స్ కొట్టలేదు అని అడుగుతాడు ఆ పాటను ఆస్వాదిస్తూ మర్చిపోయినట్టు ఉన్నాడు అని లాస్య కవర్ చేస్తుంది.. ఆ అవును అదే అదే అంటూ నందు కూడా కవర్ చేసుకుంటాడు.. రేపటి ఎపిసోడ్ లో అమ్మ తులసి నీ భర్త నుంచి నువ్వు ఎందుకు విడిపోయావో చెప్పు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతారు లాస్య ఏవో లేనిపోని మాటలు చెబుతుండగా తులసి నువ్వు అయితేనే నిజం చెప్తావు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి