Intinti Gruhalakshmi 1 June Today Episode : అంకిత బర్త్ డే పార్టీలో తులసిని అవమానించిన గాయత్రి.. ఒక్క మాట అనని అభి.. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 1 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 647 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత బర్త్ డే వేడుకలు ప్రారంభం అవుతాయి. తన కోసం పట్టు చీరను తీసుకొస్తుంది లాస్య. అది చాలా ఖరీదైన చీర. నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతుంది లాస్య. కానీ.. అంకిత మాత్రం ఏం చెప్పదు. బేబీ.. నేను నీకోసం తీసుకున్న డ్రెస్ కంటే ఇది చాలా బాగుంది. ఫంక్షన్ కు ఈ చీర కట్టుకో అంటుంది గాయత్రి. దీంతో పర్లేదు మామ్.. ఈ డ్రెస్ బాగుంది అంటుంది అంకిత. కానీ.. అందరూ లాస్య తెచ్చిన డ్రెస్ కట్టుకో.. అదే బాగుంది అంటారు. దీంతో అంకితకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంతలో బర్త్ డే పార్టీకి తులసి, దివ్య, పరందామయ్య, అనసూయ వస్తారు.

Advertisement

intinti gruhalakshmi 1 june 2022 full episode

వాళ్లను చూసి గాయత్రి, లాస్య, నందుకు కోపం వస్తుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి కూడా వస్తారు. శృతి.. తులసిని పలకరిస్తుంది. తులసిని పిలవద్దు అనుకున్నాం కదా.. ఎందుకు పిలిచావు అని లాస్య నందును అడుగుతుంది. నేనెందుకు పిలిచాను అంటాడు నందు. అమ్మ మీద ప్రేమతో అభి పిలిచి ఉంటాడు అంటుంది లాస్య. ముందు వాళ్లను లోపలికి రాకుండా చూడు అని అంటుంది లాస్య. దీంతో గాయత్రి తన దగ్గరికి వెళ్లి ఎందుకొచ్చావు తులసి అని అడుగుతుంది గాయత్రి. దీంతో ఎందుకు రాకూడదు అని అడుగుతుంది తులసి. ఫంక్షన్ కు ఇన్వైట్ చేసినవాళ్లే రావాలి కానీ.. ఇలా పిలవని వాళ్లు రాకూడదు అని అంటుంది గాయత్రి. ఇంతలో అక్కడికి వచ్చిన అంకిత.. ఆంటిని నేనే పిలిచాను అని అంటుంది. వెళ్లి తనను హత్తుకుంటుంది అంకిత.

Advertisement

అంకితకు అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు. తర్వాత అంకితను గాయత్రి పక్కకు తీసుకెళ్లి.. వద్దు అనుకున్నవాళ్లను ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. ఎందుకు పిలవకూడదు అని అంటుంది అంకిత. ఈ పార్టీకి హైఫై ఉన్న వ్యక్తులను పిలిచాం అంటుంది గాయత్రి.

ఆ తర్వాత తులసి.. అంకిత కోసం తెచ్చిన చీరను తనకు ఇస్తుంది. ఆ చీర తనకు బాగా నచ్చుతుంది. కేక్ కట్ చేసే టైమ్ కు ఈ చీరనే కట్టుకుంటాను అంటుంది అంకిత. దీంతో లాస్య, గాయత్రికి కోపం వస్తుంది. అదేంటి లాస్య ఆంటి తెచ్చిన చీర కట్టుకుంటానని చెప్పావు కదా అది చాలా గ్రాండ్ గా ఉంటుంది అంటుంది గాయత్రి.

దీంతో నాకు ఇదే బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అంకిత. లాస్య, నందుకు చాలా చిరాకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఆ తులసిని ఎందుకు పిలిచారో ఏమో.. మన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది అని నందుతో అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 1 June Today Episode : తులసి రావడంతో లాస్య ప్లాన్ మొత్తం రివర్స్

ఇప్పుడు మన టార్గెట్ అభి కాదు.. అంకిత ఎలాగైనా తనను దారిలోకి తెచ్చుకోవాలి అంటుంది. ఇంతలో గాయత్రి వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. అంకిత చేస్తున్న చేష్టలు లాస్యకు నచ్చడం లేదు అంటాడు నందు. నువ్వేం టెన్షన్ పడకు లాస్య.

కేక్ కట్ చేసే టైమ్ లో నీ చీర కట్టుకునేలా చేస్తా.. అంటుంది గాయత్రి. మరోవైపు అభి.. ప్రేమ్ ను చూసి హత్తుకుంటాడు. ఒరేయ్ ప్రేమ్ అని ఇద్దరూ మాటల్లో మునిగిపోతారు. చూడటానికి ముచ్చగా ఉంది కదా అని తులసితో శృతి అంటుంది. ఒకరికొకరు ప్రాణంగా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారు అయిపోయారు. కలవడమే కష్టంగా అయిపోయింది. మీకు బాధగా అనిపించడం లేదా అంటుంది శృతి.

గాయత్రి ఆంటి.. అంకితలకు ఒకరి పద్ధతులు మరొకరికి నచ్చవు. అయినా సరే.. తన కూతురు తన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది గాయత్రి ఆంటి. మీకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు. అయినా కూడా మీకు  ఇష్టం లేని కొన్న విషయాలు చెప్పడానికి వచ్చాను.

మీరు ఏదైతే అనుకొని ప్రేమ్ ను బయటికి పంపించారో అది జరగడం లేదు అంటుంది శృతి. మీ ఆలోచనలకు దూరంగా ఉండాలని ప్రేమ్ ను దూరంగా ఉంచాను. కానీ.. అప్పటికంటే ఇప్పుడే ప్రేమ్ ఇంకా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నాడు అని చెబుతుంది శృతి.

ఈ పరిస్థితుల్లో ప్రేమ్ జాబ్ పోగొట్టుకున్నాడు. జాబ్ తో పాటు తన మీద ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో.. ప్రేమ్ కు ఎలా సర్దిచెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాను. లైఫ్ లో నేను ఓడిపోయాను ఆంటి. మీరే ఏదో ఒకటి చేయాలి అంటుంది శృతి.

జీవితం అంటే ఎదురు దెబ్బలు.. జీవితం అంటే ముళ్ల దారి. ప్రయాణం సాఫీగా సాగదు. కాలు జారిన ప్రతీసారి చేయి కోసం చూడకూడదు. నడక అమ్మ నేర్పిస్తుంది… జీవితంలోనూ అంతే. ఎవరూ ఎవరి వెంట రారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఓదార్చుతారు అంటుంది.

మగాడికి పెళ్లికాకముందు మాత్రమే అమ్మ. ఆ తర్వాత భార్యే అన్ని.. అర్థం అయింది అనుకుంటాను శృతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. అసలు నేను ఈ ఫంక్షన్ కు రాకూడదని అనుకున్నాను అంటాడు ప్రేమ్. నా అనే వాళ్ల పలకరింపునకు దూరం అయ్యాను అంటాడు ప్రేమ్.

అమ్మ.. ఈ ఫంక్షన్ కు వచ్చినా నాతో మాట్లాడదని తెలుసు అంటాడు ప్రేమ్. ఇంతలో అభిని పిలుస్తాడు నందు. నా పెద్ద కొడుకు అని ఎవరికో పరిచయం చేస్తాడు. అది చూసి ప్రేమ్ చిన్నబుచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Game Changer 1st day Collection : గేమ్ ఛేంజ‌ర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత‌.. తొలి రోజు ఎంత క‌లెక్ష‌న్స్ రావొచ్చు..!

Game Changer 1st day Collection : దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత Ram CHaran రామ్ చరణ్ ‘గేమ్…

24 minutes ago

Morning Workout : ఉదయాన్నే పరగడుపున వ్యాయామాలు చేయడం మంచిదేనా… దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా…?

Morning Workout : కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామాలు ఎక్సర్సైజులు చేసే అలవాటు ఉంటుంది. లేచిన వెంటనే వ్యాయామాలు చేయటం…

1 hour ago

Zodiac Signs : మాలవ్య రాజయోగం రాబోతుంది… ఈ రాశులకు ఎన్నడు చూడని ధనయోగం కలగబోతుంది…?

Zodiac Signs : మనకి తప్పు,ఒప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుటకు Zodiac Signs ఈ నవగ్రహాలు కీలక పాత్రను పోషిస్తాయి.…

2 hours ago

AIIMS : 220 కి పైగా జూనియర్ రెసిడెంట్ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

AIIMS : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, (AIIMS) జనవరి 2025 సెషన్ కోసం జూనియర్ రెసిడెంట్…

3 hours ago

Zodiac Signs : ఈ ఏడాది గురుదేవుడు ఈ రాశుల వారికి ఇంటి నిండా డబ్బే డబ్బు…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క కదలికలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే దేవ గురువైన…

4 hours ago

Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

Revanth Reddy : గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ Telangana రాజ‌కీయాలు  చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప‌దేళ్ల పాటు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా…

6 hours ago

Aishwarya Rajesh : సంక్రాతికి వస్తున్నాం హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడానా..!

Aishwarya Rajesh : తెలుగు మూలాలున్నా సరే తమిళ్  Aishwarya Rajesh లో సెటిల్ అయ్యి అక్కడ హీరోయిన్ గా…

9 hours ago

Niharika : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న విష‌యంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. తొలిసారి స్పందించిన నిహారిక‌

Niharika :  గ‌త కొద్ది రోజులుగా సంధ్య థియేటర్‌ Niharika ఘటన సినీ వ‌ర్గాల‌లో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా…

13 hours ago

This website uses cookies.