Intinti Gruhalakshmi 10 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 552 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, అభిని పిలిచి తమ శాలరీ డబ్బులు ఇవ్వాలని అడుగుతుంది తులసి. ప్రేమ్ ఇచ్చేస్తాడు. కానీ.. అభి ఇవ్వడు. అభి ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంది తులసి. దీంతో 5 మామ్ అంటాడు. మీకు జీతం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది తులసి. దీంతో ఫస్ట్ కే వస్తుంది మామ్ అంటాడు. మీ శాలరీ నా చేతికి ఇంకా రాలేదు అని అంటుంది. అంటే ఆరోజు నువ్వు ఏదో కోపంలో అన్నావనుకున్నా మామ్ అంటాడు అభి. సీరియస్ గానే అన్నాను. వెళ్లి నీ జీతం డబ్బులు తీసుకురా అంటుంది తులసి. దీంతో మామ్ నాకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. ఇప్పటికిప్పుడు డబ్బులను ఎలా తీసుకురావాలి. అన్నీ షేర్స్ లో పెట్టాను అని అనుకుంటాడు అభి.
వేరే అవసరాల కోసం డబ్బు మొత్తం ఖర్చు పెట్టాను అంటాడు అభి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంటిని ఎలా నడపాలి అంటుంది తులసి. ఇంతలో లాస్య, నందు వస్తారు. బాగుంది తులసి.. అభి చిన్నపిల్లగాడు కాదు కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. పాపం చెప్పుకోలేని అవసరం ఏదో వచ్చి ఉంటుంది. చూసి చూడనట్టు వదిలేయాలి కానీ.. ఇలా టార్చర్ చేస్తారా అని అంటుంది. నన్ను, నా కొడుకును మాట్లాడుకోనివ్వు.. నువ్వు మధ్యలో రాకు అంటుంది తులసి. అభి కూడా నాకు వరసకు కొడుకే అవుతాడు అంటుంది లాస్య. అయితే.. అభి బదులు నువ్వు ఇవ్వు డబ్బులు అంటుంది. దీంతో లాస్య నోర్మూసుకొని కూర్చుంటుంది. చెప్పు.. డబ్బులు ఏం చేశావు అని అడుగుతుంది తులసి.
నందు కూడా అభిపై సీరియస్ అవుతాడు. లాస్య మాత్రమే అభికి సపోర్ట్ చేస్తుంది. దీంతో పోనీ.. కనీసం లాస్య అయినా నాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటాడు అభి. సరే.. ముందు మీరు కూడా డబ్బులు ఇవ్వండి అని లాస్య, నందును అడుగుతుంది.
దీంతో మేము ఇద్దరం ఎందుకు ఇస్తాం. ఇద్దరిది ఒక్కరమే ఇస్తాం అంటుంది లాస్య. అలా ఎలా కుదురుతుంది.. ఇద్దరూ పని చేస్తున్నారు కదా అంటుంది అనసూయ. అలా అయితే.. ప్రేమ్ ఒక్కడే సంపాదిస్తున్నాడు. శృతి సంపాదించడం లేదు కదా. ఇంట్లోనే కూర్చొని తింటుంది కదా అంటుంది.
మరి.. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు అని మళ్లీ లాస్య, తులసి ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. అభికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మాకు బాధ్యత తెలియాలనే మామ్ ఆలోచిస్తోంది అని శృతితో అంటాడు ప్రేమ్.
అయితే.. అమ్మలో ఇంత మార్పు రావడం వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అని అంటాడు ప్రేమ్. అభిని కూడా ప్రేమతో మార్చుకోవచ్చు. ఇంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటాడు ప్రేమ్. అమ్మలో సర్జరీ ముందు కూడా ఇలాంటి ఆరాటమే కనిపించింది అని అంటాడు ప్రేమ్.
కుటుంబాన్ని ఒక దారికి తేవాలని అమ్మలో మళ్లీ ఇప్పుడు కనిపిస్తుంది అంటాడు ప్రేమ్. చూద్దాం.. నా ఆలోచన తప్పు అవ్వాలని కోరుకుందాం అని శృతితో అంటాడు ప్రేమ్. మరోవైపు తులసికి మా ఖర్చుల కోసం ఇదిగో అమ్మా డబ్బులు అని పరందామయ్య చెబుతాడు.
మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి మామయ్య అంటుంది తులసి. నిన్ను ఇబ్బందుల్లో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదమ్మా. రేపు ఎవరైనా మా గురించి అడిగితే సమస్య అవుతుంది అమ్మా.. అంటాడు పరందామయ్య. మీరు నాకు ఇల్లు రాసిచ్చారు. ఒకవేళ నాకు ఈ ఇల్లు లేకపోతే ఏంటి పరిస్థితి అంటుంది తులసి.
నేను అద్దెకు ఉండాల్సిందే కదా. నాకు ఇప్పుడు అద్దె లేదు కదా.. అదే మీరు ఇచ్చే డబ్బులు అనుకోండి అని చెబుతుంది తులసి. మీరు ఇలా డబ్బులు ఇస్తేనే నేను బాధపడుతాను అని అంటుంది తులసి. దీంతో పరందామయ్య డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. అభి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. షేర్స్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అడుగుతాడు అభి. దీంతో లక్ష పెట్టావు. పాతికవేలు లాభం వచ్చింది అంటాడు తన ఫ్రెండ్. అందులో నుంచి ఒక 20 వేలు తీసి ఇవ్వు.. అర్జెంట్ గా అవసరం ఉంది అంటాడు.
అలా తీయడం కుదరదు అంటాడు. అర్జెంట్ గా కావాలి అనే సరికి.. సరే.. విత్ డ్రా చేస్తా కానీ.. 48 గంటలు పడుతుంది అని చెబుతాడు తన ఫ్రెండ్. అంత సమయం పడుతుందా. అయితే.. ఆ డబ్బేదో నువ్వే సర్దు. అవి రాగానే నీకు ఇచ్చేస్తాను అంటాడు అభి. దీంతో తనకు 20 వేలు డబ్బులు పంపిస్తాడు.
ఆ డబ్బులు తీసుకెళ్లి అందరి ముందు తులసిని పిలిచి ఇస్తాడు అభి. ఈ డబ్బు ఎక్కడిది. ఉదయం లేవు అన్నావు కదా.. ఇప్పుడు నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది తులసి. ఇంతలో లాస్య వచ్చి అభికి మళ్లీ సపోర్ట్ చేస్తుంది.
ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అని నందు.. లాస్యపై సీరియస్ అవుతాడు. తులసి మాత్రం అభిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీంతో అభికి చిరాకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.