Intinti Gruhalakshmi 10 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 నవంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 473 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక నావల్ల కాదు.. ఈ టెన్షన్ ను నేను తట్టుకోలేను.. నెక్స్ట్ ఫ్లైట్ కే నేను బెంగళూరు వెళ్తాను అంటుంది లాస్య. అలా వెళ్తే నందు మీద నీకు నమ్మకం లేదా అని అనుకుంటుంది తులసి అని భాగ్య అనుకుంటుంది. ఇంతలోనే నందు లాస్యకు ఫోన్ చేస్తాడు. మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ అయింది. ఈరోజు మీటింగ్ లేదు.. అందుకే ఈరోజు రెస్ట్ తీసుకుంటాం అని చెబుతాడు నందు.
ఇద్దరూ వేర్వేరు రూమ్సే తీసుకున్నారట.. అని భాగ్యతో చెబుతుంది లాస్య. భలే నమ్మావు.. అసలు నందు అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా.. నువ్వు ఏది చెబితే అది నమ్ముతావా? అని మరో డౌట్ క్రియేట్ చేస్తుంది భాగ్య. మరోవైపు హోటల్ లోకి వెళ్తారు. రూమ్ కీ అడుగుతారు. ఇద్దరికీ ఒకే రూమ్ బుక్ చేస్తారు కంపెనీ వాళ్లు. దీంతో తులసితో రూమ్ షేర్ చేసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు నందు. వేరే రూమ్ కావాలన్నా.. ఫుల్ అయిపోయాయి అని చెబుతారు హోటల్ సిబ్బంది.
ఒక పని చేయ్ తులసి… నువ్వు ఈ రూమ్ లో ఉండు. నేను వేరే హోటల్ లో ఉంటాను.. ఓకేనా అంటాడు. ఏమండి.. అంటుంది. చూడు తులసి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను కాల్ చేసి.. మీటింగ్ టైమ్ కు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అంటాడు. మీ ఇష్టం అండి అంటుంది తులసి. ఇంతకుముందే కాదు.. ఇప్పుడు కూడా నిర్ణయాన్ని నా చేతుల్లోకి తీసుకోవడం లేదు.. అంటుంది తులసి. మన మధ్య బంధం దూరం అయింది కానీ.. నమ్మకం కాదు. ఇద్దరం ఒకే రూమ్ లో ఉండటం నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అంటుంది తులసి.
మరోవైపు అంకిత.. నెక్లెస్ చూసి మురిసిపోతుంది. దాన్ని మెడకు ధరిస్తుంది. అభి.. ఈ నెక్లెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. సూపర్ గా ఉంది.. ఎవరిది అంటుంది. నాదే.. మా మమ్మీ గిఫ్ట్ గా పంపించింది అంటుంది అంకిత. దీంతో అభి సీరియస్ అవుతాడు. వెంటనే దీన్ని తిరిగి పంపించేయ్ అంటాడు. మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లు అన్న మాటలను నేను ఏనాడూ మరిచిపోను.. అంటాడు అభి. దీంతో అంకిత బాధపడుతుంది. నెక్లెసే కాదు.. నన్ను కూడా ఇచ్చేయండి వాళ్లకు అంటుంది అంకిత. అలా మాట్లాడకు.. ఏదో కోపంలో అలా మాట్లాడాను.. సారీ అంటాడు. అయితే.. నన్ను ఇప్పుడు పబ్ కు తీసుకెళ్లు అంటుంది అంకిత.
ఇప్పుడు వద్దు.. ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అంటాడు కానీ.. అంకిత వినదు. ఇంతలో శృతి వచ్చి బావ గారు మీకు కోరియర్ వచ్చింది అంటుంది. అంకిత మెడలో ఉన్న నెక్లెస్ చూసి.. బాగుంది నెక్లెస్.. ఎక్కడిది అంటుంది. దీంతో మా అమ్మ కొనిచ్చింది అని అంటుంది అంకిత. నువ్వు అనాథవు కదా.. నీకు ఎవరూ కొనివ్వరు నెక్లెస్ అంటుంది అంకిత. నాకున్నంత అదృష్టం నీకు లేదు కదా.. అంటుంది అంకిత. దీంతో శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. నందు, తులసి రూమ్ కు వస్తారు. ఇద్దరూ కూర్చుంటారు. బిజినెస్ మీటింగ్స్ కోసం లాస్యతో కలిసి మీరు చాలా సార్లు వచ్చారు కదా. ఇద్దరూ ఇలాగే ఒకే రూమ్ లో ఉండేవారా అని అడుగుతుంది తులసి. దీంతో నందుకు ఏం చెప్పాలో అర్థం కాదు. పోనీ.. మనిద్దరం ఒకే రూమ్ లో ఉన్నామని లాస్యకు చెప్పారా? అంటే లేదు అంటాడు నందు. మరి అడిగితే.. అంటే ఇంకా ఏం అనుకోలేదు అంటాడు నందు. ఏదో ఒకటి అనుకొని నాకు చెప్పండి అంటుంది తులసి. ఎందుకు అంటే.. ఇద్దరం ఒకే మాట మీద ఉందామని అంటుంది తులసి.
కట్ చేస్తే.. తులసికి శృతి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా శృతి అంటుంది. ఆంటీ.. రీచ్ అవ్వగానే కాల్ చేస్తా అన్నారు. అప్పుడే మరిచిపోయారా? అంటుంది శృతి. అదేం లేదమ్మా.. అంటుంది. దివ్య ఫోన్ తీసుకొని బెంగళూరు అంతా తిరిగి రండి అంటుంది. సరే అని ఫోన్ కట్ చేస్తుంది తులసి. నేను ఫ్రెష్ అయి వస్తాను.. ఇద్దరం కలిసి సిటీ తిరిగి వద్దాం అంటాడు నందు. వద్దులేండి.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటుంది. సరే.. రెస్టారెంట్ కు వెళ్లి ఏదైనా తిందాం అంటాడు నందు. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.