Intinti Gruhalakshmi 11 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 708 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆటోలో ఎయిర్ పోర్ట్ కు పంపిస్తారు. మరోవైపు సామ్రాట్ కూడ కారులో బయలుదేరుతాడు. తన పక్కనే బాబాయి కూడా ఉంటాడు. ఏంటి హుషారుగా ఉన్నావు అని అడుగుతాడు బాబాయి. ఏం లేదు బాబాయి అంటాడు. మరోవైపు తులసి ఎప్పుడెప్పుడు విమానం ఎక్కాలా ని తెగ సంతోషపడుతూ ఉంటుంది. ఆటో డ్రైవర్ తులసి ప్రవర్తనను చూసి షాక్ అవుతాడు. మరోవైపు సామ్రాట్ కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఏమైంది అంటే తెలియదు సార్ అంటాడు. వెళ్లి చెక్ చేయ్ అంటాడు సామ్రాట్. దీంతో డ్రైవర్ వెళ్లి చెక్ చేస్తుంటాడు. కారు బ్రేక్ డౌన్ అయింది సార్. కారు స్టార్ట్ అవడం చాలా కష్టం అంటాడు కారు డ్రైవర్.
దీంతో ఎయిర్ పోర్ట్ కు ఎలా వెళ్లాలి అని టెన్షన్ పడతాడు సామ్రాట్. క్యాబ్ బుక్ చేసుకో అంటాడు బాబాయి. క్యాబ్స్ చెక్ చేస్తే అన్నీ 30 నిమిషాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ఎలా ఇప్పుడు అని టెన్షన్ పడుతుంటాడు సామ్రాట్. దీంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు సామ్రాట్. మరోవైపు ఆటోలో వెళ్తూ ఉంటుంది తులసి. సామ్రాట్ నడుస్తూ వెళ్తుంటాడు. తులసి ఈ పాటికి దారిలో ఉండి ఉంటుంది అని అనుకుంటాడు. నాకు లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పనా. ఏదోలా చేసి తులసి చేరే టైమ్ కు నేను చేరుకోవాలి అని అనుకుంటాడు సామ్రాట్. ఇంతలో అదే దారిలో ఒక కారు వెళ్తుంటే దాన్ని ఆపుతాడు కానీ.. కారు ఆగదు. ఎన్ని వాహనాలను ఆపినా ఆగవు. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తులసి ఉన్న ఆటో వస్తుంటుంది. దాన్ని చూసి ఆపుతాడు. ఆపమంటారా మేడమ్ అని అడుగుతాడు డ్రైవర్. దీంతో ఇదేమన్నా షేర్ ఆటో అనుకున్నావా.. డబ్బులు నేను ఇస్తున్నాను అంటుంది తులసి.
దీంతో ఆటో ఆపకుండా వెళ్తాడు. ఇంతలో మిర్రర్ లో సామ్రాట్ ను చూసి ఆటో ఆపమంటుంది. మీరేంటి సార్ అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అడుగుతుంది తులసి. దీంతో జాగింగ్ చేస్తూ వస్తున్నాను అంటాడు. తర్వాత ఇద్దరు ఆటోలో బయలుదేరి ఎయిర్ పోర్ట్ కు వెళ్తారు.
ఎయిర్ పోర్ట్ ను చూసి తులసి షాక్ అవుతుంది. బాబోయ్.. ఏంటి ఎయిర్ పోర్ట్ ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటుంది. తులసి గారు వెళ్దామా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. మరోవైపు తులసి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నట్టు ప్రేమ్ కు ఫోన్ చేసి చెబుతుంది.
ఇంతలో వాళ్ల ఇంటికి నందు, లాస్య ఇద్దరూ వస్తారు. చూస్తున్నావు కదా నందు అని అంటుంది లాస్య. తులసిని టూర్ కు పంపొద్దు అంటూ అమ్మకు కాల్ చేసి మరీ చెప్పాను అయినా వినలేదు కదా అంటాడు నందు. అమ్మకు, ఆయనకు ఏంటి సంబంధం. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు.. అంటాడు ప్రేమ్.
దీంతో తులసిని నువ్వు అమ్మ అని పిలుస్తావు, నందును నువ్వు నాన్న అని పిలుస్తావు. ఆ బంధం చాలదా.. తులసి గురించి మాట్లాడటానికి.. అంటుంది లాస్య. వాళ్ల అమ్మ గురించి అవమానకరంగా కామెంట్స్ చేస్తున్నారు అంటాడు ప్రేమ్. ఇంతలో అభి వచ్చి తప్పు చేస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంటాడు అభి.
మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. అందులో తన పేరును చూసి చాలా సంతోషిస్తుంది తులసి. రేపు మామ్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటే ఎలా అంటాడు అభిమ. మరోవైపు తన ఇంటి పక్క వాళ్లు వచ్చి తులసి ఎక్కడ అని అడుగుతారు.
దీంతో తను ఇంట్లో ఎక్కడ ఉంది. తన బాస్ తో కలిసి ఫ్లైట్ లో పక్క పక్కన కూర్చొని ఎగిరిపోయింది అని అంటుంది లాస్య. ఇంటి పట్టున ఉండక ఇదేం విడ్డూరం. పరాయి మగాడితో కలిసి వెళ్లడం ఏంటి అంటారు. వీళ్లే హారతి పట్టి పంపించారు అంటుంది లాస్య.
ఇలా పరాయి మగాళ్లతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే వాళ్లను మీరేమంటారు అని అడుగుతుంది లాస్య. దీంతో తిరుగుబోతు అంటారు.. ఇంకా బరితెగించింది అని కూడా అంటారు.. అని వాళ్లు అంటారు. ఆడవాళ్లు అయి ఉండి తోటి ఆడదాని మీద నిందలు వేస్తారా అంటాడు పరందామయ్య.
మరోవైపు సామ్రాట్.. నందుకు ఫోన్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వలేదు అంటాడు. దీంతో ఫైల్ తీసుకొని నేను ఎయిర్ పోర్ట్ కు రావాలా అంటాడు నందు. దీంతో కాదు.. ఫైల్ తీసుకొని నువ్వు కూడా ఎయిర్ పోర్ట్ కు వచ్చేయ్. నువ్వు కూడా మాతో పాటు వైజాగ్ వద్దువు అంటాడు సామ్రాట్.
దీంతో లాస్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతాడు నందు. ఎయిర్ పోర్ట్ లో నందును సామ్రాట్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.