Home » Entertainment » Intinti Gruhalakshmi 11 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : నందు తనను పెళ్లి చేసుకోడని ఆత్మహత్య చేసుకోబోయిన లాస్య.. విషం తాగి పడిపోవడంతో అందరూ షాక్

Authored By
Varun G
The Telugu News | Updated on: December 11, 2021 11:11 am
Advertisement

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 డిసెంబర్, 2021 శనివారం 500 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు కట్టిన ఈ తాళిని మీ మీద గౌరవంతో ఈ మెడలో ఉంచుకోలేదు. మన సంప్రదాయం మీద గౌరవంతో ఉంచుకున్నాను. నాకు మీ తోడు అవసరం లేదు.. సానుభూతి అస్సలు అవసరం లేదు. నా వాళ్లు నాతో ఉన్నారు.. అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. బంధాలు బాధనిస్తాయి.. సంతోషాన్నిస్తాయి. కానీ.. అవి మనసుకు సంబంధించి మాత్రమే. నాకు వచ్చిన ఈ జబ్బుకు కారణం నా తలరాత. దానికి మీరేం చేస్తారు. తప్పును మీ మీద ఎందుకు వేసుకుంటారు.. అంత అవసరం లేదు. నాకు తోడుగా ఉంటాను.. సాయం చేస్తానని ఇంకెప్పుడూ అనకండి. మన దారులు వేరు. అది మరిచిపోకండి.. అని వెళ్లబోతుంది తులసి. దీంతో ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు అంటాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 11 december 2021 full episode

నేను ఏ బంధం వెంట పరిగెడుతున్నా నాకు బాధ తప్ప ఇంకేం మిగలడం లేదు.. అంటుంది తులసి. మన దారులు వేరు కావచ్చు కానీ.. పాతికేళ్ల మన వైవాహిక జీవితం ఉంది కదా. నువ్వు సంతోషంగా ఉండటం చూడాలని ఉంది తులసి అంటాడు నందు. నేను సంతోషంగా ఉండటం చూడాలంటే మీరు ఒక పని చేయాలి అంటుంది తులసి. ఏం చేయాలో చెప్పు అంటాడు నందు. దీంతో మీరు వెంటనే లాస్యను పెళ్లి చేసుకోవాలి అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. ఏదో ఒక బంధం విషయంలో మీ బాధ్యతను చివరి వరకు నిలబెట్టుకోండి. నా జీవితం ముగిసే లోపు మీరు లాస్యను పెళ్లి చేసుకుంటే నేను చూస్తాను. ఇది నా చివరి కోరికగా అనుకుంటారో.. వేరేగా అనుకుంటారో మీ ఇష్టం అంటుంది తులసి. దీంతో నందుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు.

Advertisement

కట్ చేస్తే.. అద్వైత కృష్ణ.. లాస్యను ఒక చోటుకు తీసుకెళ్తాడు. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో టెక్నిక్స్ చెబుతాడు. కోపాన్ని ఎప్పుడైనా వెంటనే మన మనసులో నుంచి తీసేసుకోవాలి. కోపాన్ని అస్సలు మన మనసులో దాచుకోకూడదు. లేకపోతే మనసు భారంగా మారుతుంది.. అని చెబుతాడు అద్వైత కృష్ణ.

అందుకే.. ఈ బ్యాట్ తో మీలో ఉన్న కోపం మొత్తం బయటికి వచ్చేలా ఈ బాల్ ను కొట్టండి అని చెబుతాడు కృష్ణ. దీంతో కసితో ఆ బాల్ ను కొడుతుంది లాస్య. ఏంటి ఇంతేనా.. నీలో చాలా కోపం ఉందనుకున్నానే అంటాడు కృష్ణ. దీంతో మరోసారి అన్నీ గుర్తుకు తెచ్చుకొని బాల్ ను కొడుతుంది. తన కోపాన్ని తగ్గించుకుంటుంది.

Advertisement

మీరు చెప్పింది నిజమే క్రిష్. నాకు కోపం మొత్తం పోయింది. ఏదో తెలియని ఆనందం అంటుంది లాస్య. చెప్పాను కదా.. నా టెక్నిక్ బాగా వర్కవుట్ అవుతుంది అని అంటాడు. కానీ.. నందును తలుచుకుంటే చాలా బాధేస్తుంది అంటాడు. ఎందుకు అంటే రేపు బాల్ ప్లేస్ లో నందు ఉండబోతున్నాడు కదా అంటాడు క్రిష్.

Intinti Gruhalakshmi 11 Dec Today Episode : అద్వైత కృష్ణ, లాస్య కలిసి మాట్లాడటం చూసి నందు షాక్

ఇంతలో నందు వస్తాడు. నందుతో ఉన్న రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇప్పటికీ నాకు అర్థం అవడం లేదు అంటుంది లాస్య. దీంతో నందు సీరియస్ అవుతాడు. నీకు తులసి దగ్గర ఎటువంటి రూల్స్ ఉండవు కానీ… నా దగ్గరే నీకు రూల్స్ ఉంటాయా.. అంటుంది లాస్య.

రిలాక్స్ అవండి.. అంటాడు కృష్ణ. మీ చుట్టూ ఉన్న ఈ అందమైన ప్రకృతిని పాడు చేయకండి. నేను ఎవ్వరి పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ కాదల్చుకోలేదు కానీ.. మీరు ఇలా పబ్లిక్ లో మీ ప్రైవేటు లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి.. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటాడు కృష్ణ.

లాస్య.. మీరు మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. చాలా అంటే చాలా. లేదంటే అది మీ ఆరోగ్యానికే ప్రమాదం అంటాడు. అలాగే నందు.. మీరు ఇద్దరిలో ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీ వాళ్లందరికీ ప్రమాదమే అంటాడు కృష్ణ. మీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత బెటర్ అంటాడు కృష్ణ.

Advertisement

మరోవైపు తులసి.. జామ కాయలు తెంపుతూ కింద పడిపోతుంది. తులసి కింద పడిపోవడాన్ని చూసిన ప్రేమ్.. వెంటనే తనను వచ్చి లేపుతాడు. ఏమైంది అమ్మ అంటాడు. ఇంతలో తులసికి మెళకువ వస్తుంది. ఏమైంది తులసి అంటే.. జామకాయలు కోద్దామని చెట్టు ఎక్కాను. పట్టు తప్పి కింద పడ్డాను అంటుంది తులసి.

అసలు నీకు జామకాయలతో ఇప్పుడు ఏం అవసరం అంటాడు నందు. దీంతో మీరు ఏనాడైనా నాకు జామకాయ కోసి ఇచ్చారా? మన ఇంట్లో ఉన్న చెట్టు జామకాయలను ఏనాడైనా కోసి ఇచ్చారా.. అని అడుగుతుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. తర్వాత జామకాయలను తీసుకొచ్చి తులసి కడుగుతుంది. తనకు శృతి సాయం చేస్తుంది. ఆ తర్వాత నందు పట్టించుకోవడం లేదని లాస్య విషం తాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి