Intinti Gruhalakshmi 11 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 656 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా కన్నవాళ్లకే నా మీద నమ్మకం లేదు. ఇక వేరే వాళ్లు ఎలా నమ్ముతారు అని అనుకుంటాడు ప్రేమ్. డబ్బులు ఎవరిని అడగాలి అని టెన్షన్ పడుతుంటాడు ప్రేమ్. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమ్ కు శృతి ఫోన్ చేస్తుంది. వెళ్లిన పని ఏమైంది.. అల్బమ్స్ కోసం షూరిటీ ఇస్తా అన్నారా అని అడుగుతుంది. దీంతో ఇవ్వరన్నారని చెబుతాడు ప్రేమ్. మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది శృతి. దీంతో మా బాస్ దగ్గరికి వెళ్తున్న.. ఆయన్నే కాళ్లు పట్టుకొని డబ్బులు అడుగుతా అంటాడు. దీంతో తను అడిగిన విషయం కూడా ఎక్కడ తెలుస్తుందో అని అనుకుంటుంది శృతి. ఆ విషయం తెలిస్తే.. నేను ఇక్కడే పని చేస్తున్నా అనే విషయం ప్రేమ్ కు తెలుస్తుంది. ఎలా అని టెన్షన్ పడుతుంది శృతి.
అయినా నేను ఇప్పుడు అతడి ఇంటికి వస్తున్న. లిరిక్స్ రాసిన పేపర్ ఇవ్వాలి అని అంటాడు ప్రేమ్. దీంతో శృతికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ తనను చూస్తే ఇంకేమైనా ఉందా.. ఏం చేయాలి అని భయపడుతుంది శృతి. మరోవైపు అంకిత.. తులసిని రోడ్డు మీద కలుస్తుంది. తను స్కూటీ మీద వెళ్తుండగా ఆపుతుంది. క్షమించండి.. ఆంటి ఇలా రోడ్డు మీద ఆపాను. మిమ్మల్ని వదిలేస్తే మా అంత దురదృష్టవంతులు ఉండరు. ఇష్టమైన వాళ్లను ఎవ్వరూ కావాలని దూరం పెట్టరు. ఎందుకంటే.. దానంత కష్టం ఇంకొకటి ఉండదు. మీరు మనసును చంపుకొని అలా చేస్తున్నారంటే.. మీ వాళ్ల మంచి కోసమే మీరు చెడ్డ అనిపించుకుంటున్నారని తెలుసు. అత్తింటి గడప తొక్కొద్దంటూ మీరు అన్నప్పుడు నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ.. నేను ఎంత పొరపాటుగా ఆలోచించానో తర్వాత తెలుసుకున్నాను ఆంటి. కన్నీళ్లతో కాళ్లు కడుగుదామనిపించింది అంటుంది అంకిత.
మగవాళ్ల కంటే ఆడవాళ్లకు దేవుడు ఒకింత ఓర్పు ఎక్కువ ఇచ్చింది ఇలాంటి భారం మోయడానికే అమ్మ. ఇక చాలు.. నా వల్ల కాదు అని ఆడవాళ్లు అనుకుంటే దేవుడి సృష్టికే అర్థం ఉండదు. గుడిలో దేవుడు భక్తుల కష్టాలను ఓపికగా వినాల్సిందే. అలాగే.. ఇంట్లో ఆడవాళ్లు కూడా ఇంట్లో కష్టాలను ఓపికతో భరించాల్సిందే.. అంటుంది తులసి.
నా మీద కోపం పెట్టుకోకుండా.. నన్ను చూడటానికి వచ్చినందుకు థాంక్స్ అంటుంది తులసి. ఆంటి.. నేను మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను అంటుంది. ఆస్తిని అభి పేరు మీద కాకుండా.. నా పేరు మీదికి చేసేలా చేశారు అందుకు థాంక్స్ అంటుంది అంకిత.
రేపు అభి ఇంత కంటే ఎక్కువ క్షోభ అనుభవించాల్సి వస్తుంది.. అంటుంది తులసి. దీంతో అవును ఆంటి.. ఒక విధంగా అభిని సేవ్ చేశారు. నాకు, అభికి మధ్య గొడవలు రాకుండా చేసి నా కాపురాన్ని నిలబెట్టారు అంటుంది అంకిత. నువ్వు తెలివైన దానివి కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు కానీ.. నా కొడుకు మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటుంది తులసి.
మళ్లీ అభి మీ దగ్గరవుతాడు ఆంటి అంటుంది అంకిత. లాస్య మాయ నుంచి బయటపడి నా భర్త కూడా నేనేంటో తెలుసుకుంటాడని అనుకున్నా. లాస్యనే గెలిచింది. నా భర్తను నేను ఓడిపోయాను. వదులుకున్నాను. చూద్దాం.. నా కొడుకు విషయంలో ఏం జరుగుతుందో అంటుంది తులసి.
అలాగని నేను నిరాశ పడటం లేదు అంకిత. చివరి వరకు యుద్ధం చేస్తాను. అప్పట్లో కూడా యుద్ధం చేశాను. కానీ.. దేవుడి మీద ఎక్కువ భారం వేశాను. ఇప్పుడు అలా కాదు అంకిత. నా యుద్ధాన్ని నేనే గెలుస్తాను. నన్ను నేను నమ్ముకునేలా దేవుడు వరమిచ్చాడు. అది చాలు అంటుంది తులసి.
సరే.. ఆలస్యం అవుతోంది ఇక బయలుదేరుతాను అంటుంది తులసి. దీంతో అప్పుడేనా అని అంటుంది అంకిత. ఇంకొంచెం సేపు మీతో గడిపే అవకాశం ఇవ్వండి ఆంటి అంటుంది. అలా వెళ్లి జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం కారు ఎక్కండి అంటుంది అంకిత.
దీంతో నువ్వే నా బైక్ ఎక్కు అంటుంది. దీంతో అలా కాదు.. ఇద్దరం నడుచుకుంటూ అలా వెళ్దాం పదా అంటుంది అంకిత. దీంతో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. మరోవైపు ప్రేమ్.. ముప్పి లహరి ఇంటికి వస్తాడు. వచ్చి తనను కలుస్తాడు.
నమస్తే సార్ అంటాడు. నేను రమ్మన్నానా అంటాడు దీంతో నేనే వచ్చాను సార్ అంటాడు. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దీంతో మీరు చెప్పిన పాట రాసుకొచ్చాను సార్. ఈరోజు ఇవ్వమని చెప్పారు తీసుకొచ్చాను అంటాడు ప్రేమ్.
చెప్పిన సమయానికి రాసుకొచ్చావు. అసలే కుర్రాడివి ఆ మాత్రం స్పీడ్ ఉండాలిలే అంటాడు ముప్పి లహరి. పాట చదివి అదిరిపోయింది అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. అదేంటి నిలబడే ఉన్నావు కూర్చో అంటాడు. కాఫీ తాగుతావా.. తాగుతావా ఏంటి.. తాగాలి అంటాడు.
ఈ పని మనిషి పేరు ఏంటి గుర్తుకు రావట్లేదు అని అనుకుంటాడు. ప్రీతి అర్జెంట్ గా కాఫీ తీసుకురా అంటాడు. ఇంతలో తన కొడుకు వస్తాడు. నువ్వు అసలు మ్యూజిక్ డైరెక్టర్ వేనా అంటాడు పిల్లాడు. ఇంతలో అది హిందూలం కాదు. నేను పాడి వినిపిస్తాను అని పండుకు ప్రేమ్ పాడి చూపిస్తాడు.
కాఫీ తాగేసి వెళ్లు అంటే వద్దు సార్ అంటాడు ప్రేమ్. మరోవైపు తులసి, అంకిత.. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ శృతిని చూస్తారు. శృతి పనిమనిషిగా చేయడం చూసి షాక్ అవుతారు. దీంతో తనతో మాట్లాడుతారు. ఇదేంటి శృతి అని అడుగుతుంది తులసి.
దీంతో ఏ పని దొరకనప్పుడు ఏం చేస్తాం. బతకాలి అనుకున్నప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా ఆంటి. కళ్ల ముందు మనకు అవకాశాలు ఉంటే.. ఏదైనా అవకాశాన్ని ఎంచుకోవచ్చు. అసలు అవకాశమే లేనప్పుడు రాజీపడాల్సిందే ఆంటి అంటుంది శృతి.
ఒక్క మాట నాతో చెప్పాల్సింది కదా అంటుంది తులసి. దీంతో మీరు చెప్పే అవకాశం ఇస్తే కదా ఆంటి. ప్రేమ్ మీతో మాట్లాడటానికి ట్రై చేసినా దూరం పెట్టారు. అమ్మ కల నెరవేర్చాలని ప్రేమ్ పడరాని కష్టాలు పడుతున్నాడు. తప్పని సరి పరిస్థితుల్లో నేను పనిమనిషిగా మారాను కానీ.. ఇష్టంతో కాదు ఆంటి అంటుంది శృతి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.