Home » Entertainment » Intinti Gruhalakshmi 12 February 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 12 Feb Today Episode : పీకల్లోతు అప్పుల్లో మునిగిన అభి.. ఫ్రెండ్ ను నమ్మి అడ్డంగా బుక్.. నందును తనవైపునకు తిప్పుకున్న లాస్య

Authored By
Varun G
The Telugu News | Updated on: February 12, 2022, 9:33 am
Advertisement

Intinti Gruhalakshmi 12 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 554 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిగ్గుండాలి మీ అందరికీ ఇలా మాట్లాడటానికి. ఈ అప్పు ఎవరి కోసం తీసుకున్నానో.. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నానో మీకు తెలియదా అని సీరియస్ అవుతుంది తులసి. లాస్య మీద కూడా విరుచుకుపడుతుంది. సడెన్ గా మామయ్య గారికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ లేదు. నీ అకౌంట్ లో పది లక్షలు ఉన్నాయి అయినా నువ్వు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు నీ నోరు లేస్తుంది ఏంటి అని ప్రశ్నిస్తుంది తులసి. ఏరా అభి.. నువ్వు చేసిన పని ఏంటి. అప్పుడు డాక్టర్ గా నువ్వు చేసిన పనికి కేసు అయితే నా కాళ్ల మీద పడ్డావు. నీ పని అయిపోయిన తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయావు అంటుంది.

Advertisement

intinti gruhalakshmi 12 february 2022 full episode

మామయ్య గారి కోసం తీసుకున్న అప్పు అది. అందుకే.. ఆ అప్పును అందరూ సమానంగా పంచుకోవాల్సిందే అంటుంది తులసి. దీంతో లాస్య తులసి మాటను ఒప్పుకోదు. అప్పుడు అప్పు తీరుస్తా అని నువ్వే కదా ఒప్పుకుంది. ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నావా అని లాస్య తులసితో అంటుంది. ఇలా.. ఇద్దరూ గొడవ పెట్టుకుంటుండగా శశికళ ఆపండి అంటుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వారం రోజుల్లో 80 లక్షలు కట్టండి. లేదంటే ఈ ఇంటి ముందు నా బోర్డు పెట్టుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శశికళ. దీంతో అందరూ విన్నారు కదా. నా వాటాగా నేను 20 లక్షలు ఇచ్చేస్తాను. మిగితా వాళ్లు కూడా మీ డబ్బు తీసుకురండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

ఆ తర్వాత అందరూ ఎవరి రూమ్స్ లోకి వెళ్లిపోతారు. అంకిత దగ్గరికి వెళ్లిన అభి.. చూశావా అంకిత.. అమ్మ చేసిన తప్పును నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతాడు అభి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అభి. ముందు అప్పు ఎలా తీర్చాలో ఆలోచిద్దాం అంటుంది అంకిత.

ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే మనం ఎలా తీసుకొస్తాం. మా అమ్మను ముందు అడ్వాన్స్ గా అడుగుదామా అని అంటుంది అంకిత. వద్దు.. మీ అమ్మ దగ్గర వద్దు. నేనే ఎలాగోలా డబ్బు తీసుకొస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అభి.

Advertisement

మరో వైపు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో తన ఫ్యాక్టరీ మేనేజర్ కు ఫోన్ చేస్తుంది. మన అకౌంట్ లో డబ్బు ఎంతుంది అని అడుగుతుంది. కేవలం 4 లక్షలు మాత్రమే ఉన్నాయి అంటాడు మేనేజర్. అవునా అంటుంది. సరే అని ఫోన్ కట్ చేస్తుంది.

Intinti Gruhalakshmi 12 Feb Today Episode : తప్పు చేశావంటూ తులసిని నిలదీసిన అనసూయ

ఇంతలో అనసూయ వచ్చి తప్పు చేశావు తులసి అంటుంది. ఆయన నీ పేరు మీద ఇల్లు రాసింది.. కనీసం ఇలా అయినా అందరూ కలిసి ఉంటారని అంటుంది అనసూయ. ఇంకా ఏదో అనబోతుండగా పరందామయ్య వచ్చి.. తులసిని ఏం అనకు అంటాడు.

తను ఆరోజు ఆ పని చేయకపోయి ఉంటే.. ఇప్పుడు నేను బతికి ఉండేవాన్ని కాదు. ఆరోజు తను అందుకే శశికళ పెట్టిన అన్ని కండిషన్లను ఒప్పుకుంది. లేదంటే ఈరోజు నీ నుదుటి మీద బొట్టు ఉండేది కాదు.. అంటాడు పరందామయ్య. దీంతో అనసూయకు కూడా ఏం చేయాలో అర్థం కాదు.

మరోవైపు అభి.. ఓ సేటు దగ్గరికి వెళ్తాడు. నాకు 10 లక్షల అప్పు కావాలని అంటాడు. తాకట్టుగా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇస్తా అంటాడు. చెప్పిన సమయానికి డబ్బు ఇస్తానని చెప్పి 10 లక్షలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. నేను అడగకుండానే నా అప్పు తీర్చాలి లేకపోతే మాత్రం నేను మంచోడిని కాదు అని సేటు.. అభిని హెచ్చరిస్తాడు.

Advertisement

కట్ చేస్తే అప్పు తీర్చడానికి మన వాటా డబ్బులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నావా అని నందును అడుగుతుంది. దీంతో అవును లాస్య అంటాడు. సిగ్గు ఉండాలి నీకు.. తులసి చేసిన అప్పును మనం ఎందుకు తీర్చాలి. తను చేసిన అప్పు 20 లక్షలు మాత్రమే కదా. మిగితా 80 లక్షల బాధ మనకెందుకు అంటుంది లాస్య.

హక్కుల సంగతి గుర్తొచ్చేసరికి వాళ్లు తులసి మాత్రమే గుర్తొస్తుంది. అప్పులు అనేసరికి మాత్రం మనం గుర్తొస్తాం అంటుంది లాస్య. నీ కెఫెలో నీకు పది లక్షల లోన్ ఎక్కడ పుడుతుంది. నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాను. ఏ నమ్మకంతో వాళ్లు నాకు లోన్ ఇస్తారు అంటుంది లాస్య.

అదేంటి లాస్య అలా అంటావు. మరి తులసి మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంటాడు నందు. మరోవైపు అభి.. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. పది లక్షలు ఇచ్చి ట్రేడింగ్ చేయమంటాడు. వీటితో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అప్పు తీర్చేయాలి అంటాడు.

దీంతో తన ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కానీ.. తన ఫ్రెండ్ తనను మోసం చేస్తున్నాడన్న విషయం అభి తెలుసుకోడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి