Intinti Gruhalakshmi 12 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 735 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎలాగూ ఇక్కడికి వచ్చారు కాబట్టి పూజ చేశాకే వెళ్లండి అని తులసి… నందు, లాస్యతో అంటుంది. మరోవైపు హనీని చూసి హాయ్ హనీ ఎప్పుడు వచ్చావు అంటుంది లాస్య. దీంతో ఇప్పుడే వచ్చాను అంటుంది హనీ. దీంతో సామ్రాట్ గారు రాలేదా అని అడుగుతుంది. దీంతో వచ్చారు. బయట కారులో ఉన్నారు అని చెబుతుంది హనీ. దీంతో వెంటనే అయ్యో.. నిజమా.. నాకు చెప్పనేలేదు అని అంటుంది బాబాయితో. కారులో ఉండటం ఏంటి అని వెంటనే బయటికి వచ్చి కారు దగ్గరికి వెళ్తుంది తులసి. సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. కానీ.. తనతో ఎలా మాట్లాడాలో తులసికి అర్థం కాదు. సామ్రాట్ కు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. సామ్రాట్ గారిని ఇబ్బంది పెట్టుడు ఎందుకు.. నేనే ముందు మాట్లాడేస్తా అని తులసి అనుకుంటుంది. సామ్రాట్ కూడా అదే అనుకొని మాట్లాడేస్తా అనుకుంటాడు. ఇద్దరూ ఒకేసారి మాట్లాడుతారు. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉండిపోయారు అంటుంది తులసి.
దీంతో నేను మీ బాస్ ను కాదు కదా.. ఏ హోదాతో రావాలి. నేను మీ బిజినెస్ పార్టనర్ ను కూడా కాదు. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు కదా. కనీసం మీ ఫ్రెండ్ ను కూడా కాదు. కేవలం హనీకి తండ్రిగా వచ్చాను. అందుకే ఇక్కడే ఉండిపోయాను అంటాడు సామ్రాట్. తప్పయిపోయిందండి.. హనీతో పాటు మిమ్మల్ని కూడా పిలవాల్సింది అని అంటాడు సామ్రాట్. దీంతో హనీతో పాటు నన్ను పిలవాలని అనుకున్నారా.. నాతో పాటు హనీని పిలవాలని అనుకున్నారా అని అడుగుతాడు సామ్రాట్. అతి మంచితనం, హద్దు దాటిన త్యాగం మంచిది కాదంటారు. దానికి మీరేమంటారు అని అడుగుతాడు సామ్రాట్. అలాంటి వాటివల్లే నేను నష్టపోయినా నా నష్టం వేరే వాళ్లకు లాభం చేకూరుతుందని నేను సంతోషపడతాను అంటుంది తులసి. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వచ్చి సామ్రాట్, తులసి మాట్లాడుకోవడాన్ని చూస్తారు.
తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అందరూ ఎదురు చూస్తుంటారు. రండి లోపలికి అంటుంది తులసి. దీంతో సరే అని అంటాడు సామ్రాట్. తను ఇంట్లోకి రాగానే అందరూ సంతోషిస్తారు. కానీ.. లాస్య, నందుకు మాత్రం కోపం వస్తుంది.
నాన్న మన ఇంట్లో ఎప్పుడైనా ఇంత ఘనంగా వినాయకుడి పూజ చేశామా.. ఇక్కడికి వస్తే చూసి నేర్చుకుంటావని పిలిచాను అంటుంది హనీ. నాన్న నువ్వు కూడా ఈ వినాయకుడి పూజలో కూర్చోవాలి అంటుంది హనీ. దీంతో సరే అంటాడు సామ్రాట్. ఇంతలో మా అమ్మను అవమానించినందుకు సారీ చెప్పి లోపలికి రండి అంటాడు అభి. దీంతో అవసరం లేదు.. అంటుంది తులసి.
ఇంతలో సామ్రాట్ కు కోపం వచ్చి నేను ఇంట్లోకి రాను లేండి.. నేను కారులోనే కూర్చొంటే బెటర్ అంటాడు. దీంతో అయ్యో అదేం కాదు అంటుంది. పూజకు లేట్ అవుతోంది. వెంటనే వెళ్దాం పదండి అంటుంది. అందరూ కంకణాలు కట్టుకుంటారు. అందరూ భార్యాభర్తలు ఒకరికి మరొకరు కంకణాలు కట్టుకుంటారు.
ఇంతలో సామ్రాట్ కు కంకణం కట్టడానికి వెళ్తుంది తులసి. ఆమె సామ్రాట్ గారికి కంకణం కట్టడం ఏంటి అని అందరూ అనుకుంటుండగా.. హనీ ఇలారా అమ్మా.. నాన్న గారికి కంకణం కట్టమ్మా అంటుంది తులసి. నాకు కట్టడం రాదు అంటుంది హనీ. దీంతో నేను కట్టిస్తాను కదా అంటుంది తులసి.
ఆ దారం ఇప్పుడు ముడి వేసేయ్ అంటుంది. ఆ తర్వాత ఆంటి.. మీ చేతికి కూడా కడతాను అంటుంది హనీ. దీంతో సరే అంటుంది. నాన్న హెల్ప్ చేస్తారు అంటే సరే అంటాడు సామ్రాట్. పంతులు గారు వచ్చి వినాయక పూజ చేస్తారు. ఆ తర్వాత తులసికి అక్షింతలు ఇచ్చి పెద్ద వారి ఆశీర్వాదం తీసుకోండి అంటాడు పంతులు.
దీంతో వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటుంది తులసి. తర్వాత అభి, అంకిత జంట, ప్రేమ్, శృతి జంట తులసితో పాటు పరందామయ్య జంట ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఆ తర్వాత డాడ్ దీవనలు కూడా తీసుకుందాం రా అని అభి.. అంకితను అడుగుతాడు.
దీంతో అంకిత సంకోచిస్తుంది. ఇంతలో తులసి వెళ్లి తీసుకోండి అంటుంది. దీంతో వెళ్లి అభి, అంకిత దీవెనలు తీసుకుంటారు. కానీ.. ప్రేమ్, శృతి మాత్రం దీవెనలు తీసుకోరు. నాకు మొక్కుబడి దండాలు చేసే అలవాటు లేదు అంటాడు ప్రేమ్. దీంతో ప్రేమ్.. మీ అమ్మ గారే ఆయన మాట విని గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటి అని అడుగుతాడు సామ్రాట్.
ఆ తర్వాత సారీ మీ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను అంటాడు సామ్రాట్. పర్లేదు సార్.. మా ఫ్యామిలీ పబ్లిక్ అయింది అంటాడు ప్రేమ్. ఆ తర్వాత గుంజీలు తీయాలని పరందామయ్య చెబుతాడు. లక్కీ ఆయన మీద జోక్ వేస్తాడు. ఆ తర్వాత సామ్రాట్.. అందరి ముందే తులసి ఎందుకు నందు గురించి చెప్పలేదో చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vishnu Priya : స్టార్ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించట్లేదు. హౌస్ లో ఆమె…
Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్..…
Sonu Sood : సమాజ సేవ చేయడానికి ఎలాంటి అధికారం లేదా పదవి అవసరం లేదని ప్రూవ్ చేశారు నటుడు…
Ram Charan : తమ దగ్గర పనిచేసే పని వాళ్లను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తారు. కొందరేమో వాళ్లని కేవలం…
House Scheme : మధ్యతరగతి ప్రజలకు సరసమైన గృహ సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం. తీసుకొచ్చింది. దీని…
Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే అల్లు అర్జున్ మాత్రం అసలేమాత్రం సంతోషంగా…
Dried Apricots : ఈ రకమైన డ్రై ఆఫ్రికాట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా…
Game Changer : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్…
This website uses cookies.