intinti gruhalakshmi 13 august 2022 full episode
Intinti Gruhalakshmi 13 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 710 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్రీ బాగాలేదని కోపంతో ఇంట్లోకి వెళ్లిపోతాడు అభి. తినకుండానే వెళ్లిపోతాడు. దీంతో అంతా నావల్లే.. నేను ఫుడ్ మంచిగా చేస్తే బాగుండు. ఈరోజు రాత్రికి నేను వండను. బయటి నుంచి ఆర్డర్ చేస్తా అంటుంది అంకిత. కానీ.. వద్దు ఈరోజు రాత్రి కూడా నువ్వే వండాలి అంటుంది అనసూయ. మరోవైపు విమానంలో ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో విమానంలో కొన్ని ఫోటోలు తీయండి అని అంటుంది తులసి. సామ్రాట్ తో చెప్పడంతో సరే అంటాడు. విమానంలో తన ఫోటోలను తీస్తాడు. దీంతో వాటిని దివ్యకు పంపిస్తుంది తులసి. మరోవైపు నందు, లాస్యకు వాళ్లను చూసి అస్సలు సహించరు. కోపం వస్తుంది. వాళ్లను చూసి కోపంతో రగిలిపోతుంటారు.
intinti gruhalakshmi 13 august 2022 full episode
ఒక్కసారి మా మామయ్యకు ఫోన్ చేస్తాను అంటుంది తులసి. దీంతో హ్యాపీగా చేసుకోండి అంటాడు సామ్రాట్. దీంతో పరందామయ్యకు ఫోన్ చేస్తుంది. మామయ్య ఫోటోలు చూశారా అంటుంది తులసి. దీంతో చూశాం అమ్మ అంటాడు ప్రేమ్. మామయ్య.. మనం ఇదివరకు బస్సులో వెళ్లినప్పుడు ఏసీ ఎక్కువగా ఉందన్నారు కదా.. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంది అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడానా అంటుంది తులసి. ఏం లేదండి.. అంటాడు సామ్రాట్. తర్వాత డైరీ తీసి ఏదో రాస్తూ ఉంటుంది తులసి. ఇంతలో బత్తాయి బాలరాజు.. సామ్రాట్ ను పలకరిస్తాడు. మీరు హీరో అవుతారా … హైట్ బాగున్నారు అంటాడు. ఆ తర్వాత మీరిద్దరూ భార్యాభర్తలు.. ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా అంటాడు. హైదరాబాద్ లో లైఫ్ బోర్ కొట్టి వైజాగ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా అంటాడు బత్తాయి బాలరాజు.
దీంతో నందుకు కోపం వచ్చి ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే నాలిక కోస్తా అంటాడు నందు. దీంతో ఊరుకో నందు.. ఏదో తెలియకుండా మాట్లాడాడు అంటాడు సామ్రాట్. మీ గురించి ఏమో కానీ.. వీళ్ల గురించి మాత్రం బాగా చెబుతా. ఆవిడ మాత్రం ఆయన సెటప్ అయి ఉంటుంది అంటాడు బత్తాయి.
మరోవైపు అంకిత ఒక్కతే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. అన్నయ్య అన్న మాటలకు బాధపడకు వదిన అంటాడు ప్రేమ్. మనసు మార్చుకొని ఇంటికి వచ్చాను అని చెప్పిన వాడు.. బుద్ధిగా ఉండకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటుంది అంకిత.
నీ సంగతి ఏంటి అని అడుగుతుంది అంకిత. నీ మనసు నీ దగ్గర లేదు. శృతి గురించి ఆలోచిస్తున్నావు కదూ. ఇక్కడికి రావడం ఇష్టం లేకపోయినా మీ అన్నయ్య నా కోసం వచ్చాడు. జరిగిన గొడవ పక్కనపెట్టి శృతిని తీసుకొనిరా అంటుంది అంకిత.
తర్వాత విమానం వైజాగ్ కు బయలుదేరుతుంది. మరోవైపు బత్తాయి బాలరాజు.. నందు, లాస్యను హేళన చేస్తూ ఉంటాడు. దీంతో నందు, లాస్యకు తెగ కోపం వస్తుంటుంది. దీంతో లాస్య.. నందును పక్కకు తీసుకెళ్లి తులసికి దగ్గరయ్యేందుకు నందు ఎలా ప్రయత్నాలు చేస్తున్నాడో చూడు అంటుంది లాస్య.
సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు.. ఇంత తెగింపా అంటుంది లాస్య. ఏం చేయను నాకు కూడా కోపం వస్తోంది అంటుంది. మరోవైపు విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో టెక్నికల్ సమస్య వస్తుంది. దీంతో ప్రాణాలు పోతాయేమోనని నందు భయపడి ఎయిర్ హెస్టెస్ పై చిరాకు పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.