Home » Entertainment » Intinti Gruhalakshmi 13 December 2021 Episode
Entertainment

Intinti Gruhalakshmi 13 Dec Tomorrow Episode : నాకు తులసే ముఖ్యం అని లాస్యకు తేల్చిచెప్పిన నందు.. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు విషం తాగిన లాస్య.. ఆ తర్వాత ఏమైంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 12, 2021 12:09 pm
Advertisement

Intinti Gruhalakshmi 13 Dec Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 11 డిసెంబర్ 2021, 501 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత పాతికేళ్ల నుంచి తనను ఏనాడూ సరిగ్గా చూసుకోకపోవడంపై నందు.. తులసిని క్షమాపణ కోరుతారు. కానీ.. తులసి మాత్రం ఒప్పుకోదు. నా దుస్థితికి కారణం మీరు కాదు. అలా ఎప్పుడూ అనుకోకండి. నేను ఎప్పుడూ అనుకోలేదు. బంధాలు మనసుకు సంతోషాన్ని ఇస్తాయి. నా జబ్బుకు వచ్చిన ఈ కారణం నా తలరాత. మీరు కట్టిన ఈ తాళిని ఇప్పటికీ మెడలో ఉంచుకున్నానంటే అది మీ మీద గౌరవంతో కాదు.. అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 13 december 2021 episode

నేను బాధపడటం వల్ల నా మనసు బాధపడటం తప్పితే ఇంకేం ఉండదు. అందుకే.. చేదుగా అనిపించినా ఇదే నిజం. అయిపోయిందా ఇంకా ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది తులసి. మన దారులు వేరు కావచ్చు కానీ.. పాతికేళ్లుగా అల్లుకున్న బంధం మనది. దాన్ని ఎలా కాదనుకోగలను అంటాడు నందు. నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను తులసి అంటాడు నందు. నీ సంతోషం కోసం నువ్వు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. నా సంతోషం కోసం ఏమైనా చేస్తారా అని అడుగుతుంది తులసి. దీంతో అవును చేస్తాను అంటాడు నందు. దీంతో వెంటనే మీరు లాస్యను పెళ్లి చేసుకోవాలి అంటుంది తులసి.

Advertisement

దీంతో నందు షాక్ అవుతాడు. మీరు ఏదో ఒక బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోండి. నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. నా జీవితం ముగిసేలోపు కళ్లారా నేను చూడాలనుకుంటున్నాను. మీరు దాన్ని నిలబెట్టుకుంటారో లేదో మీ ఇష్టం.. అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరో వైపు అద్వైత కృష్ణ.. లాస్య కోపాన్ని తగ్గించే పనిలో ఉంటాడు. ఇంత కోపంగా ఉంటే చాలా కష్టం. అంత కోపం పనికిరాదు అంటాడు. కోపాన్ని తగ్గించుకునేలా లాస్యకు కృష్ణ ట్రెయినింగ్ ఇస్తుండగా.. అప్పుడే నందు వస్తాడు. మీరిద్దరికీ పరిచయం ఏర్పడిందా అంటాడు.

Advertisement

Intinti Gruhalakshmi 13 Dec Tomorrow Episode : అద్వైత కృష్ణ ముందే గొడవ పడ్డ నందు, లాస్య

ఇంతలో నందు, లాస్య.. ఇద్దరూ గొడవ పడుతుంటారు. దీంతో ఆపండి.. మీ పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే కాటేజ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకోండి అంటాడు. మీరు ఇలా పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ విషయాలను మాట్లాడుకుంటున్నారు కాబట్టి… మీ ఇద్దరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటాడు కృష్ణ.

లాస్య మీరు మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. లేదంటే కష్టం అంటాడు. అది మీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటాడు. నందు.. మీరు ఏదో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఒకరు మాత్రమే.. అంటాడు కృష్ణ.

మరోవైపు జామకాయలు కోయడం కోసం చెట్టు ఎక్కి కింద పడుతుంది తులసి. ఇఫ్పుడు నువ్వు జామకాయలు కోయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు నందు. మన పాతికేళ్ల జీవితంలో మీరు ఏనాడూ నాకు జామకాయలు కోసి ఇవ్వలేదు అంటూ తన బాధను చెప్పుకుంటుంది తులసి. దీంతో నందు బాధపడతాడు.

నేనే అడిగానని జామకాయలు కోయడానికి తులసి చెట్టు ఎక్కిందని చెబుతుంది అనసూయ. ఆ తర్వాత లాస్యతో గొడవపడతాడు నందు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే అంటాడు నందు. ఈ సిచ్యువేషన్ లో నాకు తులసి మాత్రమే ముఖ్యం అంటాడు నందు. తేల్చి చెప్పేసరికి.. లాస్య తట్టుకోలేకపోతుంది. సూసైడ్ చేసుకోవడం కోసం విషం తాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

 

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి