Intinti Gruhalakshmi 14 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 842 హైలైట్సై ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి గురించి నువ్వు ఆలోచిస్తున్నావని నేను చెప్పా కదా అంటాడు బాబాయి. దీంతో తులసి నాకు ఇప్పటికే చెప్పేసింది. నేను తనకు ఆత్మబంధువును అని అంటాడు సామ్రాట్. నువ్వు చెప్పినట్టుగా చేయకపోవడమే మంచిది అయింది అంటాడు సామ్రాట్. కొన్ని బంధాలు అంతే బాబాయి.. కొన్ని బంధాలు కలవడం కోసం ఎన్ని ఏళ్లు అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది అంటాడు సామ్రాట్. కట్ చేస్తే రాములమ్మ మళ్లీ తులసి ఇంటికి వస్తుంది. శృతి చూసి సంతోషిస్తుంది. నీకు మూడో నెల అట కదమ్మా అంటుంది రాములమ్మ. అవును.. నువ్వు ఎప్పుడు వచ్చావు. నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది శృతి. దీంతో ఇంకెవరు.. తులసి అమ్మగారే అంటుంది. లాస్య కూడా ఏం మారలేదట కదా అంటుంది.
ఇంతలో తులసి వచ్చి నువ్వు మాటలేనా.. చేతలు ఉందా. వంటింటి పనులు నేను చూసుకుంటా కానీ.. శృతి పనులు నువ్వు చూసుకోవాలి అంటుంది తులసి. దీంతో వద్దులేంటి ఆంటి. నా పనులు నేను చూసుకుంటాను. రాములమ్మను వంటింటి పనులు చూసుకోమను. చాలు అంటుంది శృతి. దీంతో ఏం కాదమ్మా.. మీకు ఇప్పుడు మూడో నెల కదా. నేను చూసుకుంటాను అంటుంది రాములమ్మ. ఇప్పటికే అంకితకు పిల్లలు పుట్టలేదు. మళ్లీ నీకు అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి అలా జరిగితే మనం తట్టుకోలేం అంటుంది. ఇంతలో అందరూ కలిసి వంటింటికి వెళ్తారు. అక్కడ ఫ్రిడ్జ్ కు తాళం వేసి ఉండటం చూస్తుంది తులసి. ఏంటి.. ఇంకా మారలేదా అంటుంది. దీంతో లేదు అంటుంది శృతి.
దీంతో కోపంతో తులసి అక్కడి నుంచి లాస్య దగ్గరికి వెళ్తుంది. మరోవైపు లాస్య ఏం జరుగుతోంది అని తన మీద తానే అరుచుకుంటూ ఉంటుంది. తులసి వచ్చి నా ఆశల మీద నీళ్లు జల్లింది. పరిస్థితి చూస్తుంటే తులసి నన్ను వదిలేలా లేదు అని అనుకుంటుంది.
ఇంతలో లాస్య. తులసిని చూసి నాకోసమే వస్తున్నట్టు ఉంది అని అనుకుంటుంది లాస్య. తులసికి చాన్స్ ఇవ్వకూడదు. నేను జింకలా తనకు ఎదురు తిరగాలి అని అనుకుంటుంది. లాస్య కొంగుకు కట్టుకున్న తాళాల గుత్తిని చూస్తుంది తులసి.
దీంతో దాన్ని చీరతో దాచేందుకు ప్రయత్నం చేస్తుంది లాస్య. నువ్వు దాస్తే దాగేది కాదు అని చెప్పి తాళాల గుత్తిని లాక్కుంటుంది తులసి. ముందు ఆ తాళాల గుత్తి ఇవ్వు తులసి అని అడుగుతుంది లాస్య.
దీంతో ఇక్కడికి వచ్చిందే ఒక్కొక్కటి లాక్కోవడానికి అని అంటుంది తులసి. ఇద్దరూ కాసేపు గొడవ పెట్టుకుంటారు. తల కిందులుగా తపస్సు చేసినా నువ్వు ఈ ఇంటికి కోడలు కాలేవు అంటుంది తులసి.
నీ పిల్లలకు తల్లిగా, నీ మాజీ అత్తామామలకు కోడలుగా నీ స్థానాన్ని నేను ఆక్రమించబోతున్నాను. ఇది గ్యారెంటీ అని అంటుంది లాస్య. అది నీ వల్ల కాదు అని అంటుంది తులసి. దీంతో అవన్నీ చేయడానికి నేను రెడీ. చేసి చూపిస్తాను అంటుంది లాస్య.
మంచితనం ముసుగు వేసుకుంటావా? నీ వంకర బుద్ధిని దాచుకోలేవు అంటుంది తులసి. మనిషి అందంగా కనపడాలి అంటే.. ముఖానికి మేకప్ వేసుకుంటే చాలు కానీ.. మనసు అందంగా కనిపించాలంటే దానికి ఎలాంటి రంగులు లేవు.
ముఖానికి వేసుకున్న రంగు ఏదో ఒకరోజు వెలిసి పోయి బయటపడుతుంది.. అంటుంది తులసి. ఎందుకు నన్ను డిస్ కరేజ్ చేస్తున్నావు. నాకు నెల రోజుల సమయం ఇవ్వు. నేను ఈ ఇంట్లో నెల రోజుల్లో మంచి కోడలుగా అందరితో అనిపించుకుంటా అంటుంది లాస్య.
దీంతో నీ చాలెంజ్ కు నేను రెడీ అంటుంది తులసి. చూపిస్తా అంటే చూద్దాం అంటుంది తులసి. మరోవైపు ప్రేమ్.. పాటను రిహార్సల్ చేస్తుంటాడు. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. పాట పాడు నాన్న. నీ పాట వినక చాలా రోజులు అయింది. గిటార్ తెచ్చి పాడు అంటుంది.
దీంతో గిటార్ ను ప్రేమ్.. తాకట్టు పెట్టిన విషయం తులసికి తెలుసు అనే విషయం ప్రేమ్ కు తెలియదు. గిటార్ అమ్మేశానని అమ్మకు తెలిస్తే ఎలా అనుకుంటాడు ప్రేమ్. ఇంతలో లోపలికి వెళ్లి గిటార్ తెచ్చి ఇచ్చి ఇదిగో తీసుకో.. మొదలు పెట్టు అంటుంది తులసి.
దీంతో ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. తనను హత్తుకుంటాడు ప్రేమ్. అమ్మ ఉంది ఎందుకురా. కష్టం వస్తే చెప్పుకోవాలి కానీ.. ఇలా గిటార్ ను అమ్ముకోవచ్చా అంటుంది తులసి. నిన్ను ఎంతగా అభిమానిస్తానో.. నువ్వు ఇచ్చిన గిటార్ ను కూడా అంతే ప్రేమిస్తాను.
గిటార్ మీద గీత కూడా పడనిచ్చేదాన్ని కాదు. కానీ.. దాన్ని అమ్ముకోవాల్సిన కష్టం వచ్చిందంటే.. అంటాడు ప్రేమ్. అది అమ్మ ప్రేమకు మించిన కష్టం అని అనిపించింది అంటుంది తులసి. నువ్వు అమ్మిన రోజు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అంటుంది తులసి.
నువ్వు నీ బాధ్యత తెలుసుకున్నావు అని సంతోషిస్తుంది తులసి. మరోవైపు అందరినీ కాకా పట్టేందుకు రెడీ అవుతుంది లాస్య. అనసూయ దగ్గరికి వెళ్లి ప్రేమ ఒలకబోస్తుంది. అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.