Home » Entertainment » Intinti Gruhalakshmi 14 March 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 14 March Today Episode : తులసిపై ధ్వేషం పెంచుకున్న దివ్య.. ప్రేమ్ పై శృతి సీరియస్.. ఇంతలో తలసికి మరో షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: March 14, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 14 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 579 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చారని చెబుతాడు ప్రేమ్. ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం బతికే ఉందని అంటాడు. ఒకప్పుడు నా నుండి సాయం పొందిన ఫ్రెండ్స్ నాకు ఇఫ్పుడు సాయం చేశారు అంటాడు ప్రేమ్. దీంతో అందులో నుంచి మూడు వేలు ఇంటి ఓనర్ కు అడ్వాన్స్ ఇవ్వు అంటుంది. మరో 3 వేలు ఇచ్చి ఇంట్లో సరుకులు తీసుకురా అంటుంది. మిగిలిన మూడు వేలను తన చీర కొంగులో దాచుకుంటుంది. ఈ మూడు వేలు ఏం చేస్తావు అని అడుగుతాడు. దీంతో బ్యూటీ పార్లర్ కు వెళ్తా.. హెయిర్ ట్రీట్ మెంట్ చేయించుకోవాలి కదా అంటుంది శృతి.

Advertisement

intinti gruhalakshmi 14 march 2022 full episode

దీంతో సరే అంటాడు ప్రేమ్. దీంతో.. ఊరికే అన్నా. ఏవైనా అవసరాలు ఉంటే ఈ మూడు వేలు అవసరానికి వస్తాయి అని చెబుతుంది. మరోవైపు ప్రేమ్ ఇంటికి అడ్వాన్స్ నేనే కడతా అని చెప్పాను. ఇప్పుడు ఆ డబ్బులు లేవు. ఎలా కట్టాలి.. అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో తులసి రావడంతో తులసిని మూడు వేలు కావాలని అడుగుతుంది. దీంతో ఎందుకు అని అంటుంది. నా బంధువుల అబ్బాయి పెళ్లి చేసుకొని పారిపోయి వచ్చాడు..అతడికి ఇల్లు చూపించాను.. అద్దె కట్టాలి అంటుంది. దీంతో డబ్బులు తెచ్చి ఇస్తుంది. ప్రేమ్ కూడా ఇలాగే భార్యతో కట్టుబట్టలతో వెళ్లాడు కదా అని మనసులో అనుకుంటుంది తులసి.

Advertisement

మరోవైపు ప్రేమ్.. శృతి కోసం చీరలు తీసుకొస్తాడు. 50 శాతం డిస్కౌంట్ తో ఇస్తున్నారని నీకోసం చీరలు తీసుకొచ్చాను అంటాడు ప్రేమ్. దీంతో శృతికి కోపం వస్తుంది. ప్రేమ్ పై విరుచుకుపడుతుంది. ఉన్న డబ్బులు మొత్తం చీరలకే కట్టేస్తే.. సరుకుల కోసం ఎలా అని అడుగుతుంది శృతి.

దీంతో సరుకుల కోసం అడ్వాన్స్ డబ్బు ఉంది కదా. దాన్ని ఖర్చు పెట్టా అంటాడు. మరి అడ్వాన్స్ ఎలా ఇస్తావు అని అడుగుతుంది శృతి. దీంతో నీ దగ్గర 3000 ఉన్నాయి కదా అంటాడు. కానీ.. ఆ మూడు వేలతో శృతి.. ప్రేమ్ కోసం డ్రెస్సులు తీసుకుంటుంది.

Advertisement

తర్వాత నీ సెలక్షన్ బాగుంది. ఇంటి ఓనర్ కు ఏం చేస్తావు అనేదే బాధ అంటుంది. సర్లే.. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటుంది. ఇంతలో మాధవి వస్తుంది. ప్రేమ్, శృతి.. మాధవిని చూసి షాక్ అవుతారు. అత్తయ్య మీకు మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది అని అడుగుతారు.

Intinti Gruhalakshmi 14 March Today Episode : లాస్య ఫోన్ నుంచి ప్రేమ్ కు కాల్ చేసిన దివ్య

మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెబుతుంది.. మాధవి. ఇంతలో లాస్య ఫోన్ నుంచి ప్రేమ్ కు కాల్ వస్తుంది. లాస్య ఎందుకు కాల్ చేసింది అని అనుకుంటాడు. ఫోన్ ఎత్తగా.. దివ్య మాట్లాడుతుంది. ప్రేమ్ షాక్ అవుతాడు. ఎలా ఉన్నావు అని అడుగుతాడు.

అమ్మ సంగతి పక్కన పెట్టు.. అమ్మ కోపాన్ని మరిచిపో.. నా కోసం తిను.. నా కోసం మంచిగా ఉండు అని చెబుతాడు ప్రేమ్. నువ్వు ఇలా చేస్తే నేను కూడా అన్నం తినడం మానేస్తాను అంటాడు ప్రేమ్. నువ్వు ఇక రావా అని అడుగుతుంది దివ్య. దీంతో ఎందుకు రాను అంటాడు. రావాల్సిన సమయం వచ్చినప్పుడు వస్తాను అంటాడు ప్రేమ్.

ఈ ఇంట్లో అందరూ నీ గురించి ఫీల్ అవుతున్నారు.. ఒక్క మామ్ తప్ప అంటుంది దివ్య. రేయ్.. నువ్వు ఎక్కడున్నావో చెప్పరా.. నేనైనా వచ్చి నిన్ను కలుస్తాను అంటుంది. దీంతో వద్దు.. కలవాల్సినప్పుడు నేనే కలుస్తాను అంటాడు ప్రేమ్. నువ్వు అన్నం తినకపోతే నా మీద ఒట్టే.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

Advertisement

నువ్వు ప్రేమ్ గురించి ఎందుకు దిగులు పెట్టుకున్నావో.. ప్రేమ్ కూడా నీ గురించి అంతే దిగులు పెట్టుకున్నాడు. మీ ప్రేమ్ అన్నయ్య ఒట్టేసినందుకు అయినా నువ్వు అన్నం తినాలి అని అంటుంది లాస్య. మీ అన్నయ్యతో మాట్లాడించాను.. ఇప్పటికైనా ఈ ఆంటి మీద నమ్మకం కుదిరిందా అని అంటుంది లాస్య.

దీంతో తనను కౌగిలించుకొని థాంక్యూ ఆంటి.. థాంక్యూ సోమచ్ అంటుంది. దివ్య లాస్యతో చనువుగా ఉండటం చూసి తులసి షాక్ అవుతుంది. మరోవైపు రాత్రి అవుతుంది. భోజనాలు రెడీ అవుతాయి. ఇంతలో దివ్య వచ్చి రాములమ్మ అని పిలుస్తుంది.

నాకు భోజనం పెట్టు అని అడుగుతుంది. ఏం వండావు అని అడుగుతుంది. దీంతో వంట వండే విషయంలో తులసమ్మ నన్ను వేలు పెట్టనీయదు అమ్మ అంటుంది రాములమ్మ. తెలుసు నాకు.. అలా అన్నింట్లో ఆమె వేలు పెడుతుంది అని తెలిసిందే.. అంటుంది దివ్య.

ముందు నాకు భోజనం పెట్టండి అంటుంది దివ్య. తులసి వడ్డించబోతే వద్దు అంటుంది దివ్య. నాకు నువ్వు వడ్డించకు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి