Intinti Gruhalakshmi 14 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 14 అక్టోబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1075 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీని గదిలోకి పంపిస్తాడు నందు. ఏమైందిరా నందు.. అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న అంటాడు నందు. ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది.. హనీ మీద అంత దౌర్జన్యం ఏంటి అని అడుగుతుంది తులసి. ఎందుకు ఆవేశంలో ఉన్నావురా నువ్వు. ఇప్పుడేం మాట్లాడుకు అంటాడు పరందామయ్య. ఇప్పుడు నేను వెళ్లను.. తులసి నా బాధ అర్థం చేసుకోవడం లేదు. చాలా మొండిగా ఉంటోంది అంటాడు నందు. అటు వాళ్లు నా బాధ అర్థం చేసుకోవడం లేదు.. అంటాడు నందు. దీంతో ఎవరు వాళ్లు.. ఎవరు మీ మాట వినడం లేదు. బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తున్నారు అని అడుగుతుంది తులసి. మనం ఎటువంటి సంబంధం లేని హనీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కదా అంటాడు నందు. దీంతో నాకు హనీకి సంబంధం ఉంది అంటుంది తులసి. నేను నీలా భయపడను అంటుంది తులసి. దీంతో నీ ఫ్యామిలీని చంపుతా అన్నా భయపడవా అంటాడు నందు. నాన్నను రౌడీలతో కొట్టించారు. గుడి దగ్గర మిమ్మల్ని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేయాలనుకున్నది వాళ్లే. ఈ బెదిరింపులే రేపు నిజం అయితే. మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి తులసి.. లేని కష్టాలను ఎందుకు కోరి తెచ్చుకోవాలి.. ఇదంతా అవసరమా అంటాడు నందు.
నా మాట విను తులసి. ఇప్పుడే వెళ్లి హనీని వాళ్ల ఇంటి దగ్గర దింపేసి వస్తాను అంటాడు నందు. దీంతో వాళ్లు హనీని చంపేస్తే ఎలా అంటుంది తులసి. వాళ్లు ఎందుకు చంపుతారు అంటాడు నందు. చంపరని గ్యారెంటీ ఏంటి అంటుంది తులసి. మీ మనసు అంత స్వార్థంతో నిండిపోయింది. అందుకే మీ గురించి, మీ వాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. స్వార్థాన్ని ఆలోచించడం పక్కన పెట్టండి. ఒక చిన్నారి ప్రాణం చావు బతుకుల మధ్య ఉంటే మీరు పట్టించుకోరా? జాలి చూపించడానికి హనీ మన రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరం లేదు. జాలి ఉంటే చాలు అంటుంది తులసి. మనం చేయాల్సిన పని మనల్ని మనం రక్షించుకోవడం, హనీని రక్షించుకోవడం అంటుంది తులసి. అది జరిగే పనేనా అంటే.. జరిగి తీరాలి.. జరిగేలా చేస్తాను అంటుంది తులసి. ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు నాకు చెప్పలేదు. కారణం ఏదైనా ఇప్పటికైనా నిజం బయటికి చెప్పారు. నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు తెలిసేలా చేశారు. చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక ఏం చేయాలో నేను చూసుకుంటాను.. అని అంటుంది తులసి.
తులసి.. రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో వద్దు అక్కడికి వెళ్లకు అంటాడు నందు. ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. ఎవరి సాయం అవసరం లేదు. మీ అమ్మానాన్నలకు కాపలాగా ఉండండి అంటుంది తులసి. వెంటనే రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తుంది తులసి. అక్కడ లాస్య కనిపిస్తుంది తనకు. లాస్యను చూసి షాక్ అవుతుంది.
లాస్య, రాజ్యలక్ష్మి భర్త, రాజ్యలక్ష్మి ఈ ముగ్గురూ తులసి గురించే మాట్లాడుతూ ఉంటారు. నందు తులసికి నచ్చజెప్పి హనీని తీసుకురాలేడు. బెదిరించి తీసుకొస్తాడు. ఇది గ్యారెంటీ అంటుంది లాస్య. దీంతో కలలు కంటున్నావా అంటుంది తులసి. వీళ్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నీదా? అంటుంది తులసి.
దీంతో షాక్ అయ్యావా అంటుంది లాస్య. దీంతో అవును.. మా చేతుల్లో చచ్చేంత తన్నులు తిన్నావు. ఇంకా సిగ్గు రాలేదా అంటుంది తులసి. నంద గోపాల్ నన్ను బెదిరించి హనీని ఎత్తుకొచ్చి మీ చేతుల్లో పెడతారని అనుకుంటున్నారా? అని అడుగుతుంది తులసి. దీంతో ఖచ్చితంగా అంటుంది లాస్య.
సూటిగా ఒక్క మాట చెప్పి పోదామని వచ్చాను. హనీ గురించి ఆలోచించడం మానేయండి. హనీని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు ఆపేయండి. హనీ నా దగ్గరే ఉంటుంది. నాతోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాదు. అర్థమయిందా అంటుంది తులసి.
ఇలాంటి పనికిరాని దాన్ని పక్కన పెట్టుకొని నాతో యుద్ధం చేస్తే మీకే నష్టం అంటుంది తులసి. నీ మొగుడిని నా మొగుడిని చేసుకున్నాను. నేను చేతకాని దాన్ని కాదు. ఏదైనా చేయగలిగే సత్తా ఉన్నదాన్ని అంటుంది లాస్య. హనీ గురించి మరిచిపోండి.. అంటుంది తులసి.
మేము చేతులు ముడుచుకొని కూర్చొంటామా? నువ్వు కూడా నీ ఫ్యామిలీని మరిచిపో. ఎవ్వరూ దక్కరు అంటుంది లాస్య. ఒకప్పుడు వాళ్లు నీ ఫ్యామిలీ కూడా అంటుంది తులసి. కోపం ఉంటే నన్ను సాధించు. మధ్యలో పసిదాని జీవితంతో ఆడుకోకు అంటుంది తులసి.
నీకు హనీ ముఖ్యమో.. నీ ఫ్యామిలీ ముఖ్యమో తేల్చుకో.. అంటుంది లాస్య. దీంతో నాకు హనీ ముఖ్యం. నా ఫ్యామిలీ అంతకంటే ముఖ్యం అంటుంది తులసి. దీంతో అవ్వ కావాలి.. బువ్వ కావాలి అంటే కుదరదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. హనీనా.. ఫ్యామిలీనా.. ఈ రెండు వేళ్లలో ఒకటి పట్టుకో. నీ చాయిస్ నేను డిసైడ్ చేస్తా అంటుంది లాస్య.
దీంతో నా కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసుకోవడానికి క్లారిటీ కావాలి. ఈ రెండింట్లో ఒక వేలు పట్టుకో. నిన్ను వెంట పడి తరమాలా? నా వెంట పడకుండా కాళ్లు విరగ్గొట్టాలా? ఏదో ఒక ఆప్షన్ డిసైడ్ చేసుకుంటా అంటుంది తులసి. హనీ కోసం నీ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టుకోకు తులసి అంటుంది లాస్య.
రిస్క్ తీసుకోవడం నాకేం కొత్త కాదు లాస్య. నాతో పెట్టుకుంటే నీకే ప్రమాదం. నువ్వే ఆలోచించుకో. నేను ఉన్నంత వరకు నా ఫ్యామిలీ జోలికి రాలేవు. అసలు వాళ్లను ఏం చేయలేవు. గుర్తుపెట్టుకో అంటుంది తులసి. దీంతో ఈరోజు నువ్వు తీసుకున్నది ఎంత తప్పుడు నిర్ణయమో ముందు ముందు నీకే తెలుస్తుంది అంటుంది లాస్య.
నా ఫ్యామిలీని టచ్ చేసి చూడు.. నేనేంటో తెలుస్తుంది అంటుంది తులసి. దీంతో ఈ లాస్య ఒకప్పటి లాస్య కాదు ఏమైనా చేస్తుంది అంటే తులసి కూడా ఒకప్పటి తులసి కాదు ఎంతకైనా తెగిస్తుంది అని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
తులసి యుద్ధం కోరుకుంటే ఈ లాస్య తడాఖా ఏంటో చూపిస్తా అని అంటుంది లాస్య. మరోవైపు దివ్య చీర ఐరన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ వస్తాడు. తనకు బిస్కెట్లు వేయబోతాడు. దీంతో నాకు బిస్కెట్లు వేయకు అంటుంది. ముద్దు మురిపం ఏం లేదా అంటాడు విక్రమ్. దీంతో జాను కలిసి మందు తాగినప్పుడు ఈ విషయం తెలియలేదా అంటుంది దివ్య.
ఆ తర్వాత అదే బిస్కెట్ తో ఇద్దరూ కలిసి కాసేపు రొమాన్స్ చేసుకుంటారు. మంచంలో పడుకొని కాసేపు సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత జానుకు వెంటనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంటుంది దివ్య. దీంతో అది మనకెందుకు.. అమ్మ చూసుకుంటుంది కదా అంటాడు విక్రమ్.
ఎవ్వరూ చూడరు.. మనమే చేయాలి. జాను నిన్ను ఇష్టపడుతోంది. తను ఇప్పుడు నీ మీద మనసు పడుతోంది అంటుంది. దీంతో నువ్వేదో పొరపాటు పడుతున్నావు. జాను చిన్నపిల్ల అంటే అస్సలు కాదు. చాలా ఎదిగిపోయింది అంటుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.