Home » Entertainment » Intinti Gruhalakshmi 15 April 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 15 April Today Episode : తులసికి మరో షాక్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అభి, అంకిత.. దివ్య పరిస్థితి ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Updated on: April 15, 2022, 10:34 am
Advertisement

Intinti Gruhalakshmi 15 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 607 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుతో వెటకారం ఆడుతుంది లాస్య. నీ మనసులో ఒక కోరిక ఉంది. మీ అమ్మానాన్నలను తీసుకొద్దాం అనుకున్నావు. కానీ.. ఏం జరిగింది సర్దుకుపోతున్నావు కదా. అలాగే ఫుడ్ గురించి కూడా సర్దుకోవచ్చు కదా. నూడుల్స్ తినొచ్చు కదా అంటుంది లాస్య. దీంతో ఫుడ్ విషయంలో సర్దుకుపోవడం నా వల్ల కాదు. నా నోరు చచ్చుపడిపోతుంది అంటాడు నందు. దీంతో మీ అమ్మానాన్నలను తీసుకురావడానికి ఊరికే అక్కడికి వెళ్లకు. నేను కూడా సర్దుకుపోను అంటుంది లాస్య.

Advertisement

inntinti gruhalakshmi 15 april 2022 full episode

మరోవైపు కొత్త ఇంట్లో సర్దుకుపోతుంటారు తులసి ఫ్యామిలీ. దివ్య చదువుకుంటూ ఉంటుంది. అభి వస్తువులను సెట్ చేస్తుంటాడు. తులసి గిన్నెల తోముతూ ఉంటుంది. దీంతో ఇంట్లో ఎవ్వరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. నన్నే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటుంది అనసూయ. ఏమైంది అత్తయ్య.. నీకు ఏం కావాలి.. మజ్జిగ ఇవ్వాలా అంటుంది అనసూయ. ఏం అవసరం లేదు.. నీ పెద్ద కొడుకును నేను చెప్పింది చేయమను చాలు అంటుంది అనసూయ. నాకు నిద్ర పట్టడం లేదు.. అవతల కొంపలు అంటుకుపోతున్నాయి అంటుంది అనసూయ. వీడు కావాలనే నన్ను ఏడిపించడానికే అలా చేస్తున్నాడు అని అంటుంది అనసూయ.

Advertisement

టీవీ చూడటం కోసం అనసూయ తంటాలు పడుతుంది. సెటప్ బాక్స్ ను సెట్ చేస్తూ ఉంటాడు అభి. మరోవైపు దివ్య బయటికి వస్తుంది. ఇంట్లో చదువుకోలేకపోతుంది. దీంతో తన దగ్గరికి వచ్చిన తులసి.. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుపోతాయి.. అంటుంది.

కట్ చేస్తే తెల్లారుతుంది. పరందామయ్య టీవీని తూడుస్తుంటే.. ఏంటి ఆ తూడవడం అంటుంది అనసూయ. ఇద్దరూ కాసేపు గొడవపడతారు. ఇంతలో అంకిత.. ఇల్లు తూడుస్తూ ఉంటుంది. అప్పుడే గాయత్రి వస్తుంది. తన కూతురు ఇల్లు తూడవడం చూసి షాక్ అవుతుంది.

Advertisement

వావ్ సూపర్ అంకిత అంటుంది. చప్పట్లు కొడుతుంది. ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చావు మీ మామ్ కు అంటుంది గాయత్రి. చీపురు అంటే ఎక్కడ ఉంటుందో.. ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగిన నిన్ను.. ఇక్కడ అన్ని పనులు చేయిస్తున్నారు అంటుంది.

Intinti Gruhalakshmi 15 April Today Episode : బాధలో ప్రేమ్… ఓదార్చిన తులసి

అసలు.. నా కూతురుతో ఇన్ని పనులు ఎలా చేయిస్తున్నావు తులసి.. అని అంటుంది గాయత్రి. నేను ఉన్నది అత్తారింట్లో. జైలులో కాదు. నాకు నచ్చిన ప్రకారం ఉంటాను అంటుంది అంకిత. ఇలా నీకు నచ్చినట్టు చేసే ఈ దరిద్రపు కుటుంబంలో వచ్చి పడ్డావు అంటుంది గాయత్రి.

నువ్వు ఇక్కడ ఉండాల్సిన ఖర్మ ఏంటి. మా ఇంటికి వచ్చేయ్ అంటుంది గాయత్రి. లేదంటే కొత్త ఇంట్లో ఉండండి. ఇదిగో కీస్ తీసుకో అంటుంది గాయత్రి. నిజంగా నువ్వు నా మంచి కోరేదానివే అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది అంకిత.

దీంతో గాయత్రి షాక్ అవుతుంది. మన అంతస్తుకు తక్కువ ఉన్న వాళ్లను గౌరవించడం కూడా తెలియదు. మధ్య తరగతి జీవితంలో నీకు తెలియని ఆనందాలు చాలా ఉన్నాయి. అనుభవంతో తెలుసుకున్నాను అంటుంది అంకిత. మీరు పైకి ఎదిగి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. ఆ డబ్బు నేను ఇస్తే తప్పేంటి అంటుంది గాయత్రి.

Advertisement

ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది గాయత్రి. మరోవైపు ప్రేమ్.. దిగాలుగా కూర్చొని ఉంటాడు. ఇంతలో శృతి వస్తుంది. ఏమైంది ప్రేమ్ అంటుంది. ఈ వయసులో కూడా అమ్మ ఇన్ని కష్టాలు పడుతోంది అంటాడు ప్రేమ్. ఎలాగైనా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటాడు ప్రేమ్.

మరోవైపు తన తల్లి అలా మాట్లాడటంపై అంకిత బాధపడుతుంది. తులసి చూసి.. బిడ్డల మీద ప్రేమ లేని తల్లి ఎవ్వరూ ఉండరు అమ్మ అని అంకితకు నచ్చజెబుతుంది. ఆ తర్వాత అభిని కలుస్తుంది గాయత్రి. అంకిత పేరు మీద త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నానని.. మీరు వెళ్లి అక్కడ ఉండండి అని చెబుతుంది.

దీంతో అభి కీస్ తీసుకుంటాడు. ఇంటికి వచ్చి అంకితకు అసలు విషయం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి