
intinti gruhalakshmi 16 august 2022 full episode
Intinti Gruhalakshmi 16 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 712 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శృతి కోసం ఎదురు చూస్తూ తన ఇంటి వద్దే ఉంటాడు ప్రేమ్. ఇంతలో శృతి, వాళ్ల అత్తయ్య బయటి నుంచి వస్తారు. అప్పటి వరకు నవ్వుతూ వచ్చిన శృతి.. ప్రేమ్ ను చూసి నవ్వడం ఆపేస్తుంది. దీంతో నన్ను చూసి ఎందుకు నవ్వు ఆపేశావు అంటాడు ప్రేమ్. నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురుచూస్తున్నాను అంటాడు. దీంతో నేను కూడా నీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటాడు. నీ అంతట నువ్వు వచ్చావా… లేక ఎవరైనా ఫోర్స్ చేస్తే వచ్చావా శృతి మీద ఒట్టేసి చెప్పు అని అంటుంది శృతి అత్తమ్మ. దీంతో ఏది ఏమైనా.. భార్యాభర్తలు కలిసే ఉండాలి అంటాడు ప్రేమ్. ఎవరు చెప్పారు అంటుంది తన అత్తమ్మ. దీంతో నా వదిన అంకిత చెప్పింది అంటాడు. దీంతో అది విషయం.. ఆవిడ చెబితే వచ్చాడట అంటుంది. ఇక నువ్వే నిర్ణయం తీసుకో అంటుంది.
intinti gruhalakshmi 16 august 2022 full episode
మీరు మా మధ్యలోకి రాకండి. భార్యాభర్తల మధ్య రాకండి.. అంటాడు ప్రేమ్. దీంతో తాగి నోటికొచ్చినట్టు మాట్లాడింది నువ్వు. ఇప్పుడు ఆ నేరాన్ని నా నెత్తి మీద వేస్తున్నావా అంటుంది తన అత్తమ్మ. పెద్దవాళ్లు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే సర్దిచెప్పాలి.. పంపించాలి కానీ ఇలా రోజుల తరబడి ఇంట్లో ఉంచుకుంటే ఎలా అని కౌసల్యను తిడతాడు ప్రేమ్. దీంతో ప్రేమ్.. నువ్వు ఎందుకు కౌసల్య అత్తను తిడుతున్నావు అని అంటుంది. నా జీవితం ఇలా అయిందని తను చాలా బాధపడుతోంది అంటుంది శృతి. దీంతో ఒక్క మాట చెప్పండి. మీరు మిమ్మల్ని కలుపుదామనుకుంటున్నారా? లేక విడగొడదాం అనుకుంటున్నారా అంటాడు ప్రేమ్.
ప్రేమ్… నువ్వు ఇక్కడికి గొడవ చేయడానికి వచ్చావా అలా అయితే దయచేసి వెళ్లిపో అంటుంది శృతి. ఈ హోటల్ లో రూమ్ లేదంటే వైజాగ్ లో ఇంకా హోటల్స్ లేవా. అని అనుకుంటాడు. అక్కడ రూమ్ లో తులసి, సామ్రాట్ ఏం చేస్తున్నారు అని అనుకొని వెళ్లి తులసి రూమ్ బెల్ కొడతాడు.
తులసి డోర్ ఓపెన్ చేస్తుంది. చెప్పండి అంటుంది. సామ్రాట్ గారిని ఒకసారి కలవాలి అంటాడు. దీంతో లోపలికి రండి అంటుంది. రండి నందు.. ఒక రెండు నిమిషాల ముందు వచ్చి ఉంటే బాగుండేది. తను ఒక జోక్ వేసింది. నవ్వలేక చచ్చాను. సరే చెప్పండి నందు.. ఏంటి ఇలా వచ్చారు అంటాడు.
దీంతో మీరు ఫ్రెష్ అయితే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అంటాడు నందు. దీంతో సరే వెళ్దాం పదా అంటాడు దీంతో మా రూమ్ లో లాస్య ఫ్రెష్ అప్ అవుతోంది అంటాడు నందు. అయితే ఏంటి.. నేను వెళ్దామన్నది నా రూమ్ కు అంటాడు సామ్రాట్. మీరు వెళ్లాక.. ఒక రూమ్ చెక్ అవుట్ అయితే నేను ఆ రూమ్ తీసుకున్నాను అంటాడు సామ్రాట్.
దీంతో నందు ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు గెట్ అవుట్ ప్రేమ్ అంటుంది. ఒకప్పటి నా ప్రేమ్ నన్ను ప్రేమించేవాడు.. నేను ఏం చెప్పినా వినేవాడు. కానీ.. ఇప్పుడు ఆ ప్రేమ్ లేడు అంటుంది శృతి. దీంతో ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను శృతి అంటాడు ప్రేమ్.
నీ మీద నాకు నమ్మకం లేదు. పోయింది. మన బంధం బతకదు అంటుంది శృతి. నీకు భార్యంటే అదే నిర్లక్ష్యం… అదే మెంటాలిటీ.. అదే పొగరు అంటుంది. దీంతో మన బంధం మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడితే తెంపేయ్ కానీ.. నన్ను మా నాన్నతో పోల్చకు. నన్ను దూరం చేసుకోవడానికి వంకర మాటలు మాట్లాడకు.
లైఫ్ లో నిన్ను డిస్టర్బ్ చేయను… అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. ఇంకొక విషయం.. మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇదే ఆఖరు సారి. గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. దీంతో శృతి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
కట్ చేస్తే తులసి తన డైరీలో తన కోరికలను చెక్ చేసుకుంటుంది. విమానం ఎక్కాను కదా అని విమానం ఎక్కడం అని రాసుకున్న చోట టిక్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత హోటల్ విండోకు ఉన్న కర్టెన్ ను ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ఎదురుగా సముద్రం కనిపిస్తుంది తనకు.
తను ఇప్పటి వరకు సముద్రం చూడకపోవడంతో దాన్ని చూడగానే తను ఉద్రిక్తతకు లోనవుతుంది. మరోవైపు రెడీ అయి సామ్రాట్ వెళ్లి తులసి డోర్ ను కొడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.