Intinti Gruhalakshmi 16 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 817 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన ఇంట్లోకి వెళ్లి తన చిన్ననాటి మెమోరీస్ అన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటుంది తులసి. నేను ఈ ఇంట్లో గడిపిన ప్రతి క్షణం వెలకట్టలేని మధురానుభూతి. ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తోంది. గతంలో కలిసిపోయాకే కొన్నింటి విలువ తెలుస్తుంది అంటుంది తులసి. తన చిన్ననాటి మెమోరీస్ గుర్తొస్తాయి. ఏదో ఒక రాగం అనే పాటను గుర్తుకు తెచ్చుకుంటుంది. తన అమ్మ తనను బుజ్జగించేటప్పుడు ఏదో ఒక రాగం పాట పాడటం అలవాటు. దీంతో తులసి కూడా పాడుతుంది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు.
దీంతో ఇద్దరూ బయటికి వస్తారు. తులసిని తదేకంగా చూస్తాడు. నువ్వు తులసివే కదు అంటాడు. అవును అంటుంది. మాస్టారు గారు మీరా అని ఆశ్చర్యపోతుంది. సరిగ్గా గుర్తుపట్టావు. చిన్నప్పుడు నీకు సంగీతం నేర్పించిన జగన్నాథం మాస్టారును నేనేనమ్మా అంటాడు. ఒక్క గురువుకు ఎందరో శిష్యులు ఉంటారు కానీ.. దగ్గరయ్యేది కొందరే. నాకు ఉన్న ఆ కొద్దిమందిలో నువ్వు ఒకదానివి. ఎప్పుడో చిన్నప్పుడు ఊరు వదిలి వెళ్లిపోయావు. అయినా ఇప్పుడు గొంతు విని గుర్తుపట్టా అంటాడు జగన్నాథం. పాఠాలు నేర్పని గురువును గుర్తు పెట్టుకునేది కొందరేనమ్మా.. అంటాడు మాస్టారు. తర్వాత ఈయన నా స్నేహితుడు సామ్రాట్ అని అంటుంది. ఆవిడ నాకు జీవిత పాఠాలు నేర్పించింది అని అంటాడు సామ్రాట్. ఈపాటికి నువ్వు గొప్ప గాయనిగా ఉండాలే అంటాడు. దీంతో మీరు చెప్పినట్టు సంగీతాన్ని వృత్తిగా ఎంచుకొని ఉంటే బాగుండేది. కానీ.. నా పుట్టింట్లోనే దాన్ని వదిలేశాను అంటుంది తులసి.
సామ్రాట్ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఒక మంచి మ్యూజిక్ స్కూల్ ప్రారంభించబోతున్నాం. ఏ రోజైతే మ్యూజిక్ స్కూల్ కు శంకుస్థాపన చేశామో ఆరోజే అనుకున్నాం. మీరు ఎక్కడున్నా.. మీతో దాన్ని ప్రారంభించాలని అంటుంది తులసి. తీరిగ్గా మీ ఇంటికి వచ్చి ప్రాజెక్టు గురించి వివరిస్తాను. దయచేసి నా విన్నపాన్ని మన్నించవద్దు అంటుంది తులసి. సరే.. కానీ ఇక్కడికి వచ్చేశారా అని అడుగుతాడు. దీంతో ఇంకా రాలేదు.. ఇక వచ్చేస్తారు అని అంటాడు సామ్రాట్.
అదేంటి.. మనం ఇక్కడికి వచ్చేశాం అని అన్నారు అంటుంది తులసి. దీంతో మీరు ఈ ఇంటికి వస్తా అని అనుకున్నారా.. వచ్చారు కదా.. అది కూడా అంతే. దేవుడు తదాస్తు అంటాడు అంటాడు సామ్రాట్. అయితే.. ఈ ఇంటిని నా తమ్ముడికి బహుమతిగా ఇవ్వాలి. దానికి కూడా దేవుడు తదాస్తు అంటే చాలు అంటుంది తులసి.
మరోవైపు లాస్య దగ్గరికి వెళ్లి తన పేషెంట్స్ దగ్గర ఎలా ఫీజు వసూలు చేస్తావు అని అడుగుతుంది అంకిత. కరెక్టే.. కానీ వాళ్లు వచ్చింది నా ఇంటికి. కూర్చొన్నది నా ఇంట్లో అంటుంది లాస్య. దీంతో అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చెప్పాలో అర్థం కాదు.
నువ్వు అంతలా ఆవేశపడితే వచ్చేదేం ఉండదు. నీకే టికానా లేదు. నువ్వు వేరే వాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తున్నావా.. ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు అని అంటుంది లాస్య. ఇంతలో అక్కడికి వచ్చిన నందు.. ఏంటి నవ్వుతారు అని అంటున్నావు అంటాడు నందు.
దీంతో మాట మార్చి అంకిత ఉచితంగా వైద్య సేవలు చేస్తుందట. దీంతో ముందు నువ్వు సెటిల్ అవ్వు. ఆ తర్వాత నువ్వు ఉచితంగా వైద్యం చేయొచ్చు అని చెప్పాను అంటుంది. దీంతో లాస్య చెప్పేది కరెక్టే కదా. దాని గురించి ఆలోచించు. ముందు సెటిల్ అవ్వు అంటాడు నందు.
కట్ చేస్తే మరోవైపు ఇంట్లో తన చిన్ననాటి వస్తువులు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నారు అంటాడు సామ్రాట్. దీంతో చిన్నప్పుడు నాకు ఇష్టమైన వస్తువులు అన్నీ ఒక బాక్స్ లో జాగ్రత్తగా దాచుకునే దాన్ని. అలా దాచుకునే ప్రతి వస్తువు వెనకాల ఒక కథ ఉండేది అంటుంది.
కింద ఎక్కడైనా పెడితే మా అమ్మ పడేస్తుందనే భయం. అందుకే.. కిచెన్ లో ఎక్కడో పెట్టాను. అది కనిపించడం లేదు అంటుంది తులసి. ఇంతలో తనకు సంతక కనిపిస్తుంది. దాన్ని తీసుకొని కింద పెడుతుంది తులసి. దాన్ని ఓపెన్ చేసి ఆ వస్తువులను చూసి మురిసిపోతుంది.
అందులో ఉన్న చిరంజీవి ఫోటోను చూసి దాచుకోబోతుంది. ఇంతలో అలా దాచుకోకూడదు. చూపించండి అంటే.. చూపిస్తుంది. దీంతో చిరంజీవి అంటే మీకు ఇష్టమా అని అడుగుతాడు. దీంతో అవును అంటుంది. ఆ తర్వాత పాపడిబిల్లను చూస్తాడు. దాని గురించి చెబుతుంది.
కట్ చేస్తే.. ఫ్రిడ్జ్ కు లాక్ వేసుకుంటుంది లాస్య. దీంతో చాయ్ చేయడానికి కూడా పాల ప్యాకెట్ లేకపోవడంతో శృతి.. పరందామయ్య, అనసూయకు డికాషన్ తో చాయ్ చేసి ఇస్తుంది. ఈ విషయాలన్నింటినీ అనసూయ.. తులసికి ఫోన్ చేసి చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.