Home » Entertainment » Intinti Gruhalakshmi 16 June 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 16 June Today Episode  : లక్కీ డ్రాలో గెలిచిన తులసి.. లాస్యకు భారీ షాక్.. నందు, తులసి కలిసి ట్రిప్

Authored By
Varun G
The Telugu News | Updated on: June 16, 2022, 9:49 am
Advertisement

Intinti Gruhalakshmi 16 June Today Episode  : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జూన్ 2022 గురువారం ఎపిసోడ్ 660 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య వచ్చేలోపు లక్కీని తులసి దగ్గర్నుంచి తీసుకెళ్లాలని అనుకొని ఇందాక కూల్ డ్రింక్ కావాలన్నావు కదా.. వెళ్లి తాగి వద్దాం పదా అని అంటాడు నందు. దీంతో నేను రాను. నాకు కూల్ డ్రింక్ వద్దు అంటాడు లక్కీ. దీంతో నందుకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వీడికి ఇలా దొరికిపోయానేంటి. వీడికి నేను దగ్గరవుదామనుకుంటే.. వీడేంటి.. నన్ను లాస్యకు దూరం చేసేలా ఉన్నాడు అని అనుకుంటుండగానే.. ప్రేమ్, అభిని చూస్తుంది తులసి. అక్కడికొచ్చిన అభి.. హాయ్ డాడ్ అంటాడు. అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకేచోట కలుస్తారు. అందరం భలే కలిశాం కదా అని అంటుంది దివ్య.

Advertisement

intinti gruhalakshmi 16 june 2022 full episode

ఏదో ఈదురు గాలి అనుకున్నాను.. పెద్ద తుఫానే వచ్చేలా ఉంది. అందరూ కట్టగట్టుకొని ఒకేచోటుకు రావాలా అని అనుకుంటాడు నందు. ఇంతలో లాస్య మాల్ లోకి వస్తుంది. నందుకు ఫోన్ చేస్తుంది. దీంతో తన ఫోన్ చూసి షాక్ అవుతాడు. ఎక్కడున్నారు అని అడుగుతుంది. దీంతో నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దీంతో ఇప్పుడే మాల్ లోకి ఎంటర్ అయ్యాను అంటుంది లాస్య. నువ్వు అక్కడే ఉండు.. ఎలాగోలా వాడిని బతిమిలాడి తీసుకొస్తాను అంటాడు నందు. దీంతో ఏం అక్కర్లేదు.. మీరు గేమ్ జోన్ లో ఉండి ఉంటారు. నేనే అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది లాస్య.

Advertisement

ఇంకాసేపట్లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతుంది. నేనేం చేయలేను అని మనసులో అనుకుంటాడు నందు. ఇంతలో ఆంటి నేను మీకు ఒక గేమ్ నేర్పిస్తాను అంటాడు లక్కీ. బైక్ ఎక్కి.. తులసి లక్కీతో పాటు గేమ్ ఆడుతుంది. ఇంతలో లాస్య వచ్చి.. తులసితో ఉన్న లక్కీని చూసి షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi 16 June Today Episode  : తులసిపై విరుచుకుపడ్డ లాస్య

లక్కీ.. అంటూ గట్టిగా అరుస్తుంది లాస్య. దీంతో లక్కీ, తులసి షాక్ అవుతారు. అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది లాస్య. దీంతో గేమ్ ఆడుకుంటున్నా మమ్మీ అంటాడు లక్కీ. అయినా నిన్ను కాదు అనాల్సింది.. నిన్ను ఈ మాల్ కు తీసుకొచ్చిన ఈయన్ను అనాలి అని నందు వైపు సీరియస్ గా చూస్తుంది లాస్య.

Advertisement

పాపం అంకుల్ ఇరుక్కుపోయినట్టున్నాడు అని మనసులో అనుకుంటాడు లక్కీ. నువ్వు ఆడుకోవాల్సింది ఇక్కడ కాదు.. నాతో రా అని చెప్పి లక్కీని తీసుకెళ్లి వేరే గేమ్ ఆడిస్తుంది లాస్య. నందు, లాస్య దగ్గరికే అభి కూడా వెళ్లిపోతాడు. దీంతో తులసి షాక్ అవుతుంది.

ఏదో ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వస్తే.. ఇక్కడ కూడా శని తప్పేట్టు లేదు.. అంటుంది అనసూయ. దీంతో ఎవరిని శని అంటున్నావు అంటుంది లాస్య. దీంతో అర్థం అవ్వాల్సినోళ్లకు అర్థం అవుతుందిలే అంటుంది అనసూయ. దీంతో ఇప్పుడు మంచిగా ఉందా నీకు అంటుంది లాస్య.

డాడ్ నిజాయితీ ఉన్నవాళ్లతో మనసు విప్పి మాట్లాడొచ్చు కానీ.. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడేవాళ్లతో మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అంటాడు అభి. అవును మరి.. మీ లాస్య ఆంటి నిజాయితీపరురాలని ఊరంతా అనుకుంటున్నారు అంటాడు పరందామయ్య.

ప్రేమ్ కు హెల్ప్ చేస్తానన్న అభి.. ఆంటిని ఎందుకు ద్వేషిస్తున్నాడు అని అనుకుంటుంది అంకిత. అసలు నాకు చెప్పకుండా లక్కీని నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు. అంతా నీ వల్లే అంటుంది లాస్య. నేను వచ్చేదాన్ని కాదు కదా అంటుంది లాస్య.

Advertisement

లక్కీ.. ఆడింది చాలు పదా అంటూ లక్కీని తీసుకెళ్తుంది లాస్య. తనతో పాటు నందు, అభి కూడా వెళ్లిపోతారు. మరోవైపు లక్కీ డ్రా తీస్తారు. మొదటి లక్కీ విజేతగా నంద గోపాల్ నిలుస్తాడు. తర్వాత అభి పేరు వస్తుంది. ఫైనల్ లక్కీ విన్నర్ పేరు తులసిది వస్తుంది.

గెలిచిన వాళ్లను అందరినీ పిలిచి వాళ్లతో ఫోటో దిగుతారు. లాస్యకు తన పేరు రాలేదని కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి