Intinti Gruhalakshmi 16 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 581 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కూరగాయల కోసం ప్రేమ్, శృతి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంతలో తులసి స్కూటీకి శృతి ఢీకొనబోతుంది. అది తులసి బండి అని చూసి షాక్ అవుతారు. తులసి కూడా ప్రేమ్ ను చూసి షాక్ అవుతుంది. జరుగు అంటుంది. నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయినా నీకు కోపం చల్లారడం లేదా అంటాడు ప్రేమ్. నాకు కావాల్సింది మా అమ్మ కోపం తగ్గడం.. నాతో మాట్లాడటం.. అంతే అమ్మ. అంతకంటే ఇంకేం లేదు అంటాడు ప్రేమ్. మనసులో అనుకున్నా.. అమ్మ కనిపిస్తే బాగుండు అని.. దేవుడు దయతలిచాడు.. నాకు అమ్మను కనిపించేలా చేశాడు.
వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఏ ఒక్కటీ పట్టించుకోలేదు. పనికిరాని ప్రేమలు.. మనుషులను దగ్గర చేయడానికి సరిపోవు. నిజాయితీ ఉండాలి. ఈ మాట వాడికి చెప్పు.. అంటుంది తులసి. ఇవన్నీ చెప్పకుండానే ప్రేమ్ ను ఇంతవాడిని చేశారా ఆంటి. ప్రేమ్ చూపించే అభిమానంలో నిజాయితీ కనిపించడం లేదా. నన్ను నమ్మమంటారా అంటుంది. ఒకప్పుడు వాడి మీద పట్టలేని ప్రేమ చూపించాను. కానీ.. మనం చూపించే ప్రేమ కూడా ఎదుటి మనిషిని నాశనం చేస్తుందని ఈ మధ్యే తెలుసుకున్నాను. ఇప్పుడు నా హద్దుల్లో నేను ఉన్నాను అంటుంది తులసి.
నాన్న పట్ల నేను అలా ప్రవర్తించడం తప్పే కానీ.. దానికి ఉరి శిక్ష కంటే పెద్ద శిక్ష వేశావు కదా అంటాడు ప్రేమ్. కాని ఒక్కటి.. నువ్వు నన్ను ఇంటికి పిలవకున్నా పర్వాలేదు కానీ.. నేను ఎలా ఉన్నానో అడుగు అమ్మ. కొండంత ధైర్యంతో బతికేస్తాను అంటాడు ప్రేమ్.
కనిపించినప్పుడల్లా నీతో మాట్లాడాలి అంటే నా మనసును చంపుకోవాలి. చంపుకోమంటావా.. నీకు కావాల్సింది అదేనా.. చెప్పరా అంటుంది. పక్కకు తప్పుకో అంటుంది తులసి. దీంతో ప్రేమ్, శృతి పక్కకు తప్పుకుంటారు. అక్కడి నుంచి తులసి వెళ్లిపోతుంది.
మరోవైపు బాబురావు.. పేకాడుతూ కనిపిస్తాడు. బాబు అని పిలుస్తుంది తన భార్య. చేతులు ఖాళీ లేవు.. తర్వాత రాపో అని అంటాడు. అడుక్కునే వారికి ఏం పనిలేదు అని అంటాడు. దీంతో కోపం వచ్చి అక్కడే ఉన్న క్యాన్ ను విసిరేస్తుంది. రెంట్ కు ఉన్నవాళ్లు అడ్వాన్స్ ఇచ్చారా అని అడుగుతుంది.
దీంతో ఇంకా ఇవ్వలేదు అంటాడు. వెంటనే వెళ్లి అడ్వాన్స్ తీసుకొనిరా అంటుంది. దీంతో కోపంతో ప్రేమ్ ఇంటికి వెళ్లి అడ్వాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. ఒక రెండు రోజులు ఆగండి అని అంటాడు ప్రేమ్. కుదరదు.. అస్సలు కుదరదు.. అడ్వాన్స్ ఇస్తారా.. లేక ఇల్లు ఖాళీ చేస్తారా అని అంటాడు బాబురావు.
అయినా ఇదంతా రాములమ్మ వల్లనే. రాములమ్మ ఎక్కడున్నావు అని అడుగుతాడు. దీంతో రాములమ్మ వస్తుంది. ఇదిగోండి మీ అడ్వాన్స్ 3000 అంటుంది. దీంతో అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో థాంక్స్ రాములమ్మ అంటాడు ప్రేమ్.
మరోవైపు తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దివ్య. తన ఫ్రెండ్స్ వస్తున్నారని పరందామయ్య.. యువకుడిలా రెడీ అవుతాడు. ఇంతలో తన ఫ్రెండ్స్ వస్తారు. లాస్య కూడా వస్తుంది. అరేంజ్ మెంట్స్ అన్నీ చేశాను.. ఎంజాయ్ చేయండి అని అంటుంది లాస్య.
ఫ్యాక్టరీకి వెళ్లిన తులసికి 80 లక్షల డబ్బు ఎలా కట్టాలో అర్థం కాదు. టైమ్ దగ్గర పడుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ వస్తాడు. ఈ చెక్ మీద సైన్ చేయండి మేడమ్ అంటాడు. మీరు ఆ బాకీ గురించే ఆలోచిస్తున్నారు కదా మేడమ్.
ఈ సమస్యకు ఒక పరిష్కారం చెబుతాను మేడమ్. ఈ ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకోవచ్చు కదా మేడమ్ అంటాడు మేనేజర్. వద్దు.. దీని మీద పడి చాలామంది ఆధారపడ్డారు. ఒకవేళ తీర్చలేకపోతే ఫ్యాక్టరీకి దూరం అవ్వాల్సి వస్తుంది అంటుంది తులసి.
మూతపడబోయే ఫ్యాక్టరీని మీరు తెరిపించారు. మీ సామర్థ్యాన్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన మేనేజర్ ఒకరు ఉన్నారు. అతడిని పిలిపిస్తా.. అతడే లోన్ ప్రాసెసింగ్ మొత్తం చూసుకుంటాడు అని చెబుతాడు మేనేజర్.
మరోవైపు డీజే పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు దివ్య, తన ఫ్రెండ్స్. లాస్య ఆంటి.. మా లంచ్ కోసం ఏం ప్లాన్ చేశారు అంటుంది. బయటి నుంచి తెప్పిస్తున్నాను మీరేం టెన్షన్ పడకండి అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.