Home » Entertainment » Intinti Gruhalakshmi 16 May 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 16 May Today Episode : కాలేజీ ప్రిన్సిపల్ ముందే నందు పరువు తీసిన దివ్య.. దీంతో నందు షాకింగ్ నిర్ణయం.. ఈ విషయం తులసకి తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: May 16, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 16 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మే 2022, సోమవారం ఎపిసోడ్ 633 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసే మీ మనసులను పొల్యూట్ చేసి ఇలా మాట్లాడిస్తోంది. ఈ సంసారాన్ని మోయడానికి నేను ఎంత ముందుకు వచ్చినా తులసే పడనీయడం లేదు అంటాడు నందు. దీంతో అవును అవును.. నువ్వొక దానకర్ణుడివి.. మేమే అర్థం చేసుకోలేకపోయాం కానీ.. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో ఎందుకు వస్తారు.. ఇక్కడికొచ్చి నాలుగు కూతలు కూయనిదే వాళ్లకు నిద్రపట్టదు కదా అంటుంది అనసూయ. నేనేమీ పనిలేక ఇక్కడికి రాలేదు. మీ మాజీ కోడలును ఉద్యోగం వెతుక్కునే సమయంలో కాస్త డిగ్నిటీ మెయిన్ టెన్ చేయమని చెప్పండి అంటాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 16 may 2022 full episode

మన ఫ్యామిలీ మ్యాటర్ ను పబ్లిక్ చేయడం తప్పు కదా అంటాడు నందు. ఇంకోసారి అలా చేయొద్దని చెప్పండి. కొడుకుగా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. చూసుకుంటాను. మీ దగ్గర ఉంటుంది కాబట్టి తులసి బాధ్యత కూడా నాదే. రోడ్డు మీద పడి రచ్చ చేయొద్దని చెప్పండి అంటాడు నందు. దీంతో ఇప్పుడు అర్థం అయిందిరా నువ్వు ఎందుకు వచ్చావో అంటాడు పరందామయ్య. తులసి నోరు నొక్కడానికి బాధ్యత, గోంగూర అని చెప్పి డబ్బులు పడేసి మా నోరు నొక్కేయడానికి వచ్చావు అంటాడు పరందామయ్య. అది కాదు.. అని చెప్పినా కూడా పరందామయ్య, అనసూయ వినరు. నీ గురించి ఎవ్వరూ ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో ఈపాటికి జనాలందరికీ తెలుసు అంటుంది అనసూయ.

Advertisement

ఏం చూసుకొని తులసి మీద మీకు అంత నమ్మకం. ఆఫ్టరాల్ బియ్యం బస్తా మోయలేకపోయింది.. సంసారాన్ని మోస్తుందా అని అంటాడు నందు. దీంతో దివ్యను రమ్మని చెప్పి కష్టపడి బియ్యం బస్తాను స్కూటీ నుంచి తీసి ఇంటి ముందు పడేస్తుంది తులసి.

దీంతో నందు, లాస్య షాక్ అవుతారు. పదా అని చెప్పి లోపలికి వెళ్తారు దివ్య, తులసి. ఇప్పుడు ఏమంటావు రా.. నిన్ను నువ్వు గొప్ప అనుకో తప్పు కాదు కానీ.. వేరే వాళ్లను తక్కువగా చూడకు.. మమ్మల్ని చూడాలనిపిస్తే ప్రేమతో రా.. అమ్మ చేతి కాఫీ తాగి వెళ్లు కానీ.. విషం చిమ్మకు.. ఇక వెళ్లి రండి అంటాడు పరందామయ్య.

Advertisement

మరోవైపు ప్రేమ్.. ఆఫీసులో ఉంటాడు. ఓ ప్రొడ్యూసర్ ఫోన్ లో మాట్లాడుతుండగా వింటాడు. కొత్త లిరిక్ రైటర్ కావాలి.. అది లవ్ స్టోరీ అని ఎవరికో చెబుతుంటాడు ప్రొడ్యూసర్. దీంతో ప్రేమ్ కు చాలా సంతోషం వేస్తుంది. అతడి దగ్గరికి వచ్చి మీ పిక్చర్ లో పాటలు రాసే అవకాశం ఇవ్వండి అంటాడు.

మ్యూజిక్ డైరెక్టర్ ఇదంతా చూసి.. అర్జెంట్ గా నా స్టూడియోను వదిలి వెళ్లిపో అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఒళ్లు మండిపోతోంది.. వెంటనే నా ముందు నుంచి వెళ్లిపో.. వెళ్లు అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

లాస్య.. కొన్ని మంచినీళ్లు ఇస్తావా అని అడుగుతాడు నందు. ఇంటికొచ్చాక పెళ్లాన్ని అడిగావు. మరి అక్కడ మీ అమ్మను అడగలేదు. కనీసం మీ అమ్మ అయినా లోపలికిరా.. కాఫీ తాగి వెళ్లు అని కూడా అనలేదు.. అంటూ నందుపై చిరాకు పడుతుంది లాస్య.

Intinti Gruhalakshmi 16 May Today Episode : దివ్య ఫీజు విషయమై నందుకు ఫోన్ చేసిన కాలేజీ ప్రిన్సిపల్

మనం ప్రతీసారి వాళ్లతో మాటలు అనిపించుకోవడానికే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. కనీసం ఒక్కసారి అయినా మన మాట విన్న పాపాన పోలేదు అంటుంది లాస్య. ఇంతలో నందుకు ఫోన్ వస్తుంది. దివ్య కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి పేరెంట్స్ మీటింగ్ కు రాలేదు అంటుంది.

Advertisement

ఆ తర్వాత రేపు దివ్య ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్. గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అంటుంది. దీంతో నేనే పర్సనల్ గా వచ్చి పే చేస్తాను అని అంటాడు నందు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. నీకు, దివ్యకు సంబంధం లేదని చెప్పేయాల్సింద కదా అంటుంది లాస్య.

దీంతో అలా ఎలా చేస్తారు.. టైమ్ కు ఫీజు కట్టకపోతే దివ్యకు బ్యాడ్ రిమార్క్ వస్తుంది అంటాడు నందు. ఈ విషయంలో తులసి వచ్చి గొడవ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి వెళ్లిపోతుంది లాస్య. తర్వాత పరందామయ్య.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

మనం తులసి దగ్గర ఉండటం వల్ల తులసికి మేలు జరుగుతోందా.. లేక కీడు జరుగుతోందా అని అర్థం కావడం లేదు అని అనసూయతో అంటాడు పరందామయ్య. తులసికి మనం బారం అవుతామేమో అని భయంగా ఉంది అనసూయ అంటాడు పరందామయ్య.

దివ్య కాలేజీ ఫీజుకు ఇవాళే చివరి తేదీ తులసి ఫోన్ కు మెసేజ్ వస్తుంది. దాన్ని పరందామయ్య చూసి చెబుతాడు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఇంతలో దివ్య వచ్చి నేను కాలేజీకి వెళ్తున్నాను. ఫీజు కట్టడానికి ఇవాళ వస్తున్నావు కదా అంటుంది దివ్య.

Advertisement

నేను రేపు వస్తాను అని చెప్పి దివ్యకు సర్దిచెబుతుంది తులసి. మరోవైపు దివ్య కాలేజీకి వెళ్తుంది. ఇంతలో దివ్య నిన్ను ప్రిన్సిపల్ మేడమ్ పిలుస్తున్నారు అని చెబుతుంది తన ఫ్రెండ్. ఇంతలో తను లోపలికి వెళ్లే సరికి.. అక్కడ నందు ఉంటాడు.

తనను చూసి షాక్ అవుతుంది దివ్య. మీ దివ్య చాలా మెరిట్ స్టూడెంట్ అని చెబుతుంది ప్రిన్సిపల్. ఇంతలో నీ ఫీజు కట్టడానికి వచ్చాను అమ్మ అంటాడు నందు. దీంతో మీరెందుకు కడతారు. అసలు మీకు ఏంటి సంబంధం అంటుంది దివ్య. దీంతో నేను మీ డాడీని. ఫీజు కట్టడం నా బాధ్యత అంటాడు నందు.

దీంతో ఎప్పుడు నీకు ఈ విషయం గుర్తొచ్చింది డాడీ. నా కాలేజీ ఫీజు గురించి మా మామ్ మీతో మాట్లాడుతా అన్నారు. దయచేసి అప్పటి వరకు ఆగండి. ఒకవేళ మా మామ్ కాలేజీ ఫీజు కట్టకపోతే నేను కాలేజీ రావడమే మానేస్తాను కానీ.. వేరే ఎవరో నా ఫీజు కడతారంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య.

బయటికి వచ్చాక నేను ఫీజు కడుతానంటే వద్దన్నందుకే నాకు బాధగా ఉంది అని అంటాడు నందు. నీకు నేనంటే ఇష్టం లేదా దివ్య అని అడుగుతాడు నందు. దీంతో నాకు డాడీ అంటే చాలా ఇష్టం. కానీ.. మామ్ ను ఇష్టపడే డాడ్ అంటేనే నాకు చాలా ఇష్టం అంటుంది దివ్య.

మరోవైపు తులసి పాటలు పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటుంది. తనను చూసి పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు. ఇంతలో దివ్య కోపంతో ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి