Home » Entertainment » Intinti Gruhalakshmi 17 January 2023 Tuesday Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : తులసికి మీటింగ్ లో అవమానం.. ఇంగ్లీష్ రాకపోవడంతో జాబ్ కు రాజీనామా చేస్తుందా? తులసిపై లాస్య మరో ప్లాన్

Authored By
Varun G
The Telugu News | Updated on: January 17, 2023 9:39 am
Advertisement

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 844 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలని సామ్రాట్ చెప్పడంతో ఇంగ్లీష్ నేర్చుకునే బుక్కులు కొనుక్కోవడం కోసం స్టేషనరీ షాప్ నకు వెళ్తుంది. తన కొడుకుకు ఇంగ్లీష్ నేర్చుకునే బుక్స్ కావాలి అంటుంది. దీంతో షాపతను.. ఏం చదువుతున్నడు మీ వాడు అని అడుగుతాడు. దీంతో డిగ్రీ అని చెబుతుంది. దీంతో డిగ్రీ చదివే వాళ్లకు ఇంగ్లీష్ వస్తుంది కదా.. అంటే తెలుగు మీడియం అంటుంది. దీంతో గ్రామర్ బుక్ కావాలా అంటాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక.. నాకే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బుక్స్ కావాలి అంటుంది. దీంతో తనకు కొన్ని బుక్స్ ఇస్తాడు. వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న టీపాయ్ మీద పెట్టి ఫ్రెష్ అయి వద్దామని లోపలికి వెళ్తుంది.

Advertisement

intinti gruhalakshmi 17 january 2023 tuesday full episode

ఇంతలో ఆ పుస్తకాలను చూస్తాడు పరందామయ్య. వారం రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? అని అనుకుంటాడు. ఇంతలో తులసి వచ్చి నేర్చుకోలేమా అంటుంది. దీంతో ఎందుకు నేర్చుకోలేం. రోజూ ఎంత సేపు దీని మీద దృష్టి పెడుతున్నాం అనేది ముఖ్యం అంటాడు పరందామయ్య. ఇంతలో శృతి వస్తుంది. ఇంగ్లీష్ పుస్తకాల ద్వారా నేర్చుకోవడం కంటే కూడా.. ఎవరితోనైనా మాట్లాడుతుంటే త్వరగా వస్తుంది అంటాడు పరందామయ్య. దీంతో కరెక్టే కదా.. అని అంటుంది కానీ.. నాతో మాట్లాడేవారు ఎవరు అంటుంది. దీంతో శృతి నేను ఉన్నాను కదా ఆంటి.. నేను మాట్లాడుతా అంటుంది. ఇంతలో అంకిత వచ్చి మీది అమెరికన్ ప్రాజెక్ట్ కదా ఆంటి.. మీకు అమెరికన్ యాసెంట్ అయితే బెటర్ అంటుంది. దీంతో మరి ఎలా అంటుంది. దీంతో నేను ఉన్నాను కదా ఆంటి. కాన్వెంట్ లో చదువుకున్నాను కదా. నేను నేర్పిస్తాను అంటుంది అంకిత. ఇవన్నీ విన్న లాస్య.. అంటే శృతికి ఇంగ్లీష్ రాదనే కదా నీ అర్థం అంటూ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

దీంతో అవమానంతో అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది శృతి. తను ఫీల్ అయిందని అనుకొని శృతి రూమ్ లోకి వెళ్తుంది తులసి. ఇంతలో అంకిత కూడా వస్తుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నేను నిన్ను నా సొంత చెల్లిలాగానే అనుకుంటున్నాను. అలాగే ట్రీట్ చేస్తున్నాను కూడా. అలాగని నేను ఎప్పుడూ నిన్ను బాధపెట్టాలనుకోలేదు అంటుంది అంకిత.

తులసి ఆంటికి కాన్వెంట్ స్టయిల్ ఇంగ్లీష్ కావాలన్నాను కానీ.. నీ ఇంగ్లీష్ మీద నేను కామెంట్స్ చేయలేదు అంటుంది. అర్థం చేసుకో శృతి అంటుంది. ఇంతలో ప్రేమ్ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. ఎవరికిరా ఐస్ క్రీమ్ అంటే.. శృతికి అమ్మ అంటాడు. అంటే.. మేం తినం అనుకున్నావా అంటుంది తులసి.

Advertisement

కడుపుతో ఉంది కదా.. ఆమె అడిగింది అని తీసుకొచ్చా అంటాడు ప్రేమ్. దీంతో చూశావా.. నీ మొగుడికి ఎంత ప్రేమో.. అంటుంది తులసి. తీసుకురావడం మాత్రమే కాదు.. మా ముందే తినిపించాలి అంటుంది అంకిత. దీంతో ఐస్ క్రీమ్ ను ఓపెన్ చేస్తాడు. చూస్తే అది నీళ్లలో కరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత శృతి కూడా కూల్ అవుతుంది.

Intinti Gruhalakshmi 17 Jan Today Episode : పరందామయ్యకు కాఫీ తెచ్చి ఇచ్చిన లాస్య

మరోవైపు పరందామయ్య కాఫీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతలో లాస్య కాఫీ తీసుకొస్తుంది. మామయ్య కాఫీ అంటుంది. దీంతో నువ్వు పెట్టావా అమ్మ అంటాడు. దీంతో నేనే పెట్టాను. కాఫీ ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో సూపర్. నేను తర్వాత తాగుతా కానీ.. మీ అత్తయ్యకు ఇవ్వమ్మా. నాలుక పీకుతోందట అంటాడు.

దీంతో నాకు వద్దు. మీ మామయ్యకే ఇవ్వు. ఇందాక కాఫీ కాఫీ అంటూ లొట్టలేస్తున్నాడు అంటుంది అనసూయ. తీసుకోండి. పాపం కష్టపడి చేసి తీసుకొచ్చింది. ఇవ్వమ్మా అంటుంది. దీంతో కాఫీ తీసుకుంటాడు పరందామయ్య. కాఫీ తాగుతాడు. కానీ.. అస్సలు బాగోదు. ఎలా ఉంది అంటే ఆ.. ఆ.. అంటాడు.

కానీ.. పక్కన పెడతాడు. దీంతో అదేంటి పక్కన పెట్టారు అంటే.. బాగా టేస్టీగా ఉన్నవి బాగా దాచుకొని తినడం, తాగడం అలవాటు అంటాడు. ఇంతలో హారతి తీసుకొని వస్తుంది తులసి. అందరూ తీసుకుంటారు. ఇంతలో నందు రావడంతో నందుకు హారతి ఇవ్వబోతుంది.

Advertisement

ఇంతలో తులసి ఆపి.. హారతి నేను ఇస్తా అని చెబుతుంది. తన దగ్గర నుంచి హారతి తీసుకొని నేను ఇస్తా అంటుంది. నందు హారతి తీసుకో అంటుంది లాస్య. అవును.. నందు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఇక వెళ్లిన పని అయినట్టే అని అనుకుంటుంది అనసూయ.

మరోవైపు నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అని పరందామయ్య, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత తులసి కూడా నేను ఆఫీసుకు వెళ్లాలి అని రెడీ అవుతుంది. ఇంతలో దివ్య వచ్చి.. నా లాప్ టాప్ పని చేయడం లేదు. నాకు కొత్త లాప్ టాప్ కావాలి అంటుంది.

దీంతో లాప్ టాప్ కొనివ్వడానికి అదేమీ వందకు, వేయికి వచ్చేది కాదు కదా. ఉన్న లాప్ టాప్ తో సర్దిపెట్టుకో అంటుంది తులసి. దీంతో పోనీ సామ్రాట్ అంకుల్ ను అడగనా అంటే.. వద్దు అని సీరియస్ అవుతుంది. పరీక్ష వరకు ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసుకో. ఆ తర్వాత చూద్దాం అంటుంది తులసి.

దీంతో కోపంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో లాస్య వచ్చి అనవసరంగా దివ్యను బాధపెడుతున్నావు అని అంటుంది. ఆడుకోవడానికి బొమ్మలు అడగలేదు కదా.. చదువుకోవడానికి లాప్ టాప్ కావాలని అడిగింది అంతే కదా అంటుంది లాస్య.

Advertisement

దీంతో నాకు వినబడింది అంటుంది తులసి. పిల్లలు అడిగింది అల్లా కొనిస్తేనే వాళ్ల మీద ప్రేమ ఉన్నట్టా అని అంటుంది తులసి. మరోవైపు ఎలాగైనా ఈసారి జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటాడు నందు. మీటింగ్ కు వెళ్లాక అక్కడ క్లయింట్స్ అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడటంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి