intinti gruhalakshmi 17 june 2022 full episode
Intinti Gruhalakshmi 17 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 661 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుకోకుండా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్లను సెలెక్ట్ చేశారు.. చాలా థాంక్స్ అని నిర్వాహకులతో అంటాడు పరందామయ్య. ఈ లక్కీ డ్రా అంతా బోగస్. కావాలని డబ్బులు తీసుకొని ఒకే ఫ్యామిలీని సెలెక్ట్ చేశారు అంటుంది లాస్య. దీంతో మాకు అలాంటి అవసరం లేదు. కావాలంటే బౌల్ లోని స్లిప్స్ ను మరోసారి వెరిఫై చేసుకోండి అని అంటారు నిర్వాహకులు. దీంతో తన పేరు ఉందా అని బౌల్ లోని స్లిప్స్ ను చెక్ చేసుకుంటుంది. తన పేరు ఉండటంతో తనకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. విన్నర్స్ అందరూ ఇక్కడికి వస్తే నేను ఫోటో తీస్తాను అంటుంది నిర్వాహకురాలు. దీంతో గెలిచిన వాళ్లు అంతా అక్కడ నిలబడతారు. ప్రేమ్, అభి, నందు, తులసి.. నలుగురిని కలిపి ఫోటో దించుతారు. ఆ తర్వాత బంధం గురించి ఏదైనా చెప్పండి అని నిర్వాహకురాలు.. తులసిని అడుగుతుంది.
intinti gruhalakshmi 17 june 2022 full episode
దీంతో బంధం అనేది రెండు అక్షరాల మాట కాదు.. నూరేళ్లు జీవితం అంటుంది తులసి. ఆ తర్వాత నందు దగ్గరికి వెళ్లి మీ ఉద్దేశంలో భార్య అంటే ఎవరు అని అడుగుతుంది నిర్వాహకురాలు. దీంతో నందు ఏం చెప్పడు. దీంతో నేను చెప్పనా అంటాడు పరందామయ్య. ఆ తర్వాత కాశ్మీర్ కు విమాన టికెట్లను అందరికీ పంపిస్తామని చెప్పి నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఫ్యామిలీ అందరి సెల్ఫీ తీస్తుంది దివ్య. కోపంతో లాస్య లక్కీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో నందు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లాస్య అని పిలుస్తున్నా కూడా తనను పట్టించుకోకుండా అక్కడి నుంచి లాస్య వెళ్లిపోతుంది. మాల్ బయట ఉంటాడు నందు. అప్పుడే అక్కడికి వచ్చిన పరందామయ్య, తులసి నందును చూస్తారు. ఏరా ఒంటరివాడివయ్యావా.. అని అంటాడు పరందామయ్య. జీవితంలో ఓడిపోవడం అంటే ఇలా ఒంటరిగా మిగిలిపోవడమే అంటాడు పరందామయ్య. దీంతో నందు ఏం మాట్లాడడు.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. లక్కీని పడుకోబెట్టి.. ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది లాస్య. ఇంతలో తన రూమ్ లోకి నందు వస్తాడు. నందు.. లైట్ ఆఫ్ చేయి అంటుంది. చీకటిగా ఉంది అంటాడు. నీకెందుకు మేము చీకట్లో ఉంటే అంటుంది లాస్య. ఏమైంది అంటే.. తనపై చిరాకు పడుతుంది.
సెల్ఫీ కోసం దివ్య ఉండి పొమ్మంటే.. బాగుండదని దిగాను అంటాడు నందు. తర్వాత తనకు సారీ చెబుతాడు. అసలు మా వంక అయినా చూశావా.. నీ ఫ్యామిలీ కనిపించే సరికి.. నువ్వు వాళ్ల చెంత చేరావు అని అంటుంది లాస్య. నువ్వు రా లాస్య.. వచ్చి నా పక్కన నిలుచో అని నువ్వు ఎందుకు నన్ను అనలేదు అని లాస్య నిలదీస్తుంది.
మరోవైపు అంకితతో ఎలాగైనా చెక్ మీద సైన్ చేయించుకోవాలని అనుకుంటాడు అభి. ఇంతలో అంకిత వస్తుంది. నువ్వు చెక్ ఇస్తే వాళ్లకు ఇచ్చి వస్తాను అంటాడు అభి. దీంతో ఇప్పటికే చెక్ రాసి పెట్టాను. తెచ్చి ఇస్తా ఆగు అంటుంది. ఇదిగో చెక్ అంటుంది అంకిత.
ఇప్పుడే కాదు.. ఎప్పుడూ మీ వాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉండు అంటుంది అంకిత. ఇంతలో గాయత్రి వస్తుంది. మీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటుంది గాయత్రి. మీరు కూడా అంకిత మనసును అర్థం చేసుకోవాలి అని అంటాడు అభి.
తీరా.. అభి చెక్ చూస్తే అందులో 5 లక్షలే రాసి ఉంటుంది. దీంతో డబ్బు తప్పు రాశావు అంటాడు అభి. దీంతో ఆల్బమ్ కోసం కావాల్సింది 5 లక్షలే కదా అంటుంది. దీంతో ఆల్బమ్ ఏంటి.. అంటాడు అభి. నేను సాయం కావాల్సింది ప్రేమ్ కోసం కాదు.. డాడీకి అంటాడు అభి.
దీంతో నీ మైండ్ సెట్ ఇంకా మారలేదు అంటుంది అంకిత. గాయత్రి కూడా చిరాకు పడుతుంది. నా ఆస్తి నా ఇష్టం అంటుంది అంకిత. దీంతో ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నేను తీసుకుంటాను అంటుంది గాయత్రి. చేతికి డబ్బు రాగానే మారిపోయింది. ఐ హేట్ యు అంకిత అంటుంది గాయత్రి.
దీంతో నేను నీ దగ్గర ఉండను. నా దారి నేను చూసుకుంటాను అంటుంది అంకిత. అంకిత ఇప్పుడు నేను ఏమన్నాను. డాడీ బిజినెస్ కోసం హెల్ప్ చేయమన్నాను అంతే కదా అంటాడు అభి. దీంతో నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి.. అది జరిగే పని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత.
కట్ చేస్తే తెల్లవారుతుంది. తులసి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక మహిళ.. కొందరు పిల్లలను తీసుకొచ్చి వాళ్లకు మ్యూజిక్ నేర్పించాలని అడుగుతుంది. ఆ తర్వాత అంకిత.. తులసి ఇంటికి వస్తుంది. తనను చూసి తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.