#image_title
Intinti Gruhalakshmi 17 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 17 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1077 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నావు. నిన్ను ఎందుకు మేము అపార్థం చేసుకుంటాం. అందులోనూ చేతుల్లో డబ్బులు లేవు అని రత్నప్రభ.. లాస్యతో చెబుతుంది. దీంతో నాకు తెలుసు. తులసిని ఒంటరిని చేసి అటాక్ చేయాలి. అదే సేఫ్ గేమ్ అంటుంది లాస్య. జరిగిందేంటో తులసి తెలుసుకునే లోపే తన ఇంట్లో ఆమె వాళ్ల శవాలే కనిపిస్తాయి. ఇవాళ రాత్రే ముహూర్తం పెట్టాను అని రత్నప్రభతో చెబుతుంది. తులసి వాళ్లు రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు ముసలివాళ్లు శవాలుగా మారిపోతున్నారు. తులసి గిలగిలా కొట్టుకుంటేనే నా మనసు సంతోషంతో ఎగిరి పడుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటుంది లాస్య. మరోవైపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ రాత్రి కాగానే తిని పండుకుంటారు. కానీ.. పరందామయ్యకు మాత్రం నిద్ర రాదు. నాకు నిద్ర రావట్లేదు అంటాడు పరందామయ్య. కళ్లు మూసుకొని పడుకోండి.. నిద్ర అదే వస్తుంది అంటుంది అనసూయ.
మరోవైపు రౌడీలు.. తులసి ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లో ఉన్న మెయిన్ స్విచ్ ను ఆపేసి కరెంట్ కట్ చేస్తారు. మెల్లగా పరందామయ్య రూమ్ లోకి వెళ్తారు. చప్పుడు కావడంతో ఇద్దరూ లేస్తారు. ఏదో చప్పుడు అవుతోంది. ఎవరో పరుగెడుతున్నారు అని అంటుంది అనసూయ. దీంతో మన ఇంటికి ఎవరు వస్తారు అని అంటాడు పరందామయ్య. ఇక్కడ ఏం కనబడటం లేదు అంటాడు పరందామయ్య. మరోవైపు తులసి, నందు, హనీ ముగ్గురు కలిసి మష్ రూమ్ బిర్యానీ తింటూ ఉంటారు కానీ.. తులసి మాత్రం ఆ డమ్మీ పిస్టల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. నందు.. తులసిని చూసి ఏంటి తులసి అలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. తన ప్లేట్ లాగుతాడు. అయినా కూడా తులసి ఈ లోకంలో ఉండదు. హనీ నవ్వడంతో అప్పుడు తులసి తన ప్లేట్ ఎక్కడ అని చూస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు ఆంటి అని అడుగుతుంది హనీ. ఏం లేదు అంటుంది తులసి. కానీ.. ఏదో ఉంది. ఏంటి ప్రాబ్లమ్ అని అడుగుతాడు నందు. ప్రాబ్లమ్ ఏం లేదు అంటుంది తులసి.
అన్నీ బాగుంటే నువ్వు ఇలా ఉండవు. ఎక్కడో తేడా కొడుతోంది అంటాడు నందు. ఏం లేదు అంటుంది. మరోవైపు ముసలివాళ్లు ఇద్దరూ గదిలో పడుకొని ఉన్నారు. లేపేయమంటారా? ముసలివాళ్ల శవాల ఫోటోలు మీకు వెంటనే పంపిస్తాను అంటాడు రౌడీ. దీంతో ఎందుకు అంత ఆత్రం. నేను చెప్పే వరకు ఆ ముసలివాళ్ల జోలికి వెళ్లకు అని అంటుంది లాస్య.
హనీ ఐస్ క్రీమ్ తిందామా అంటాడు నందు. దీంతో ఓకే అంకుల్ అంటుంది హనీ. మరోవైపు తులసికి ఫోన్ చేస్తుంది. లాస్య ఫోన్ చేయడంతో వెంటనే ఎత్తుతుంది. మొదటి సారి తులసి గొంతులో కంగారు వినిపిస్తుంది. ఇదే నాకు కావాల్సింది. నేను కాల్ చేసిన ప్రతి సారి ఆలస్యం చేయకుండా బుద్ధి మంతురాలిలా రెస్పాన్స్ ఇస్తున్నావు. కారణం.. నా మీద ప్రేమ కాదు. నీలోని భయం. సారీ.. మీ మానాన మీరు ఎంజాయ్ చేస్తుంటే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను.. అంటుంది లాస్య.
అయినా రాత్రి పూట ముసలివాళ్లను ఇద్దరినీ ఒంటరిగా ఇంట్లో వదిలేసి మీరేంటి జాలీగా బయట తిరగడానికి వచ్చారు. తప్పు కదా తులసి. ఇదేనా మీ ఫ్యామిలీని కాపాడుకునే పద్ధతి. అవతల వాళ్లు ప్రమాదంలో ఉన్నారు అక్క అంటుంది లాస్య.
ఇంతలో తులసి… పరందామయ్యకు ఫోన్ చేస్తుంది. హలో అంటుంది అనసూయ. నేను తులసిని అంటుంది. ఎక్కడున్నారు అంటే రెస్టారెంట్ లో ఉన్నాం అంటుంది అనసూయ. కరెంట్ పోయింది. చాలా సేపు అయింది. ఇల్లంతా చిమ్మ చీకటి అంటుంది అనసూయ. మీరేం కంగారు పడకండి.. కరెంట్ వచ్చేస్తుంది అంటుంది తులసి. దీంతో ఇంట్లో ఎవరో దూరినట్టున్నారు. భయమేస్తుంది అంటుంది అనసూయ.
దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మీరు గది దాటి బయటికి రావద్దు. వీలైతే గది తలుపులు వేసుకోండి అంటుంది తులసి. మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తాం అంటుంది తులసి. సెల్ లైట్ లో బయటికి వస్తారు పరందామయ్య, అనసూయ. ఇంతలో వాళ్ల డోర్ కొడుతూ ఉంటారు. వద్దండి.. డోర్ తీయకండి అంటుంది అనసూయ. ఏంకాదు పదా.. డోర్ తీద్దాం అంటాడు పరందామయ్య.
ఎవరు అని అడిగితే.. నేను రాములమ్మను అంటుంది. తలుపు తీయండి బాబు అంటుంది రాములమ్మ. దీంతో రాములమ్మ వస్తుంది. డోర్ తీస్తాడు పరందామయ్య. అంతటా కరెంట్ ఉంది. ఒక్క మనింట్లోనే పోయింది ఏంటి అని అడుగుతుంది రాములమ్మ.
మరోసారి లాస్య.. తులసికి ఫోన్ చేస్తుంది. నీ వాళ్లను హత్య చేయిస్తున్నా. రౌడీలు మీ ఇంట్లోకి వచ్చారు. ముసలివాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని చెబుతుంది. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ఇంట్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. దీంతో దొంగలు కావచ్చు అంటాడు పరందామయ్య. మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. కరెంట్ కూడా వస్తుంది. దొంగలను తరిమేస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.