Home » Entertainment » Intinti Gruhalakshmi 18 June 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 18 June Today Episode : తులసిపై లాస్య మాస్టర్ ప్లాన్.. లోన్ విషయంలో తులసిని బుక్ చేసేందుకు పన్నాగం.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Updated on: June 18, 2022, 9:41 am
Advertisement

Intinti Gruhalakshmi 18 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 662 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది తులసి. చాలామంది పిల్లలకు తులసి మ్యూజిక్ నేర్పిస్తుండటంతో దివ్య కూడా సంతోషిస్తుంది. కాకపోతే పిల్లలు ఎక్కువ మంది అవుతున్నారు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కూర్చోబెట్టడానికి ప్లేస్ ఉండటం లేదు అంటుంది తులసి. మరోవైపు ప్రేమ్ ఫోన్ లో తన ఫ్యామిలీ ఫోటోను చూస్తుంటాడు. అందులో తులసిని చూస్తూ ఉంటాడు. శృతి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. పెళ్లయిన మగాళ్లు మొబైల్ లో పెళ్లాల ఫోటోలు చూస్తూ కూర్చోవాలి కానీ.. అమ్మ ఫోటో చూడటం కాదు అంటుంది శృతి. దీంతో నాకు మా అమ్మ తర్వాతనే ఎవరైనా అని అంటాడు ప్రేమ్. మా అమ్మే నిన్ను ఇచ్చి పెళ్లి చేసింది అంటాడు ప్రేమ్. అదే కదా.. నిన్ను కాకుండా ఎవరైనా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను చేసుకున్నా అమెరికాలో ఏంచక్కా ఎంజాయ్ చేసేదాన్ని అని అంటుంది శృతి.

Advertisement

intinti gruhalakshmi 18 june 2022 full episode

తర్వాత ప్రేమ్ కూడా పెళ్లాన్ని సెంట్ వాసనతో పోల్చుతాడు. తర్వాత ఇద్దరూ కాసేపు ఏకాంతంగా ఉంటారు. ఇంతలో తన ఫ్రెండ్ వస్తాడు. నీ ఆల్బమ్ కు నేను ఒక స్పాన్సర్ ను ఒప్పించాను అంటాడు. దీంతో ప్రేమ్, శృతి చాలా సంతోషిస్తారు. కాకపోతే ఒక కండిషన్ అంటాడు. ముందు ఒక సంవత్సరం పాటు వాళ్ల కంపెనీలో గిటార్ ప్లేయర్ గా వర్క్ చేయమన్నారు అంటాడు. అలా అయితే నాకు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది కదా అంటాడు ప్రేమ్. అయితే.. మా ఫ్రెండ్ వందన తన ఇల్లు అమ్మకానికి పెట్టింది. ఆ ఇల్లు అమ్ముడుపోగానే 5 లక్షలు ఇస్తానన్నది అని చెబుతుంది శృతి. అలా అయితే వెంటనే ఆల్బమ్ పనులు మొదలు పెట్టాలి అని అంటాడు ప్రేమ్.

Advertisement

Intinti Gruhalakshmi 18 June Today Episode : పెద్ద షెడ్డు వేసి మ్యూజిక్ స్కూల్ పెడుదామని తులసికి సలహా ఇచ్చిన పరందామయ్య

మరోవైపు తులసి.. పిల్లల కోసం పెద్ద ప్లేస్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తుంటుంది. ప్రస్తుతం ఉన్న ప్లేస్ కొలతలు తీసుకుంటూ ఉంటుంది. పిల్లలకు ఎండ తగలకుండా షెల్టర్ ఏర్పాటు చేయాలి అని తులసి పరందామయ్యతో అంటుంది. అది సరే కానీ.. ఎంత మందికి షెల్టర్ వేస్తావు అంటాడు పరందామయ్య.

పది నుంచి 15 మందికి అంటాడు. ఒకవేళ పిల్లలు పెరిగితే ఎలా అంటాడు పరందామయ్య. దీంతో ఎంతమంది ఉంటారు మామయ్య. నాకు 15 మంది కంటే ఎక్కువ ఎక్కడ వస్తారు అంటుంది. దీంతో వచ్చే నెల 50 మంది వస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు పరందామయ్య.

Advertisement

అంతమంది ఎక్కడ వస్తారు అంటుంది తులసి. దీంతో పెద్ద షెడ్డు వేసి మ్యూజిక్ స్కూల్ పెడదాం అంటాడు పరందామయ్య. బ్యాంక్ లోన్ తీసుకుందాం అంటాడు పరందామయ్య. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన దేవుడు దారి చూపిస్తాడు అంటాడు పరందామయ్య.

నాకు తెలిసిన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన్ను అడిగి చెబుతాను అంటాడు పరందామయ్య. మరోవైపు లాస్యను కలవడానికి భాగ్య తన ఇంటికి వెళ్తుంది. ఇంతలో భాస్కర్ తనకు ఫోన్ చేస్తాడు. బ్యాంకులో లోన్ అరేంజ్ చేసే బ్రోకర్ ను అంటాడు తను.

తులసి మేడమ్ గారు.. ఎప్పుడైనా లోన్ కోసం కాంటాక్ట్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయమన్నారు కదా. నాకు డబ్బు ఇచ్చారు కదా. తను మళ్లీ నాకు ఈరోజు ఫోన్ చేశారు. మ్యూజిక్ స్కూల్ కోసం లోన్ కావాలని అడిగారు అంటాడు. లోన్ ఇవ్వడం కుదరదు అని చెప్తాను అంటాడు.

కానీ.. వద్దు తనకు లోన్ శాంక్షన్ అయ్యేలా చూడు. తనకు లోన్ రావాలి అంటుంది లాస్య. దీంతో భాగ్య షాక్ అవుతుంది. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి తులసికి లోన్ వచ్చేలా చేస్తాను. బ్రోకర్ ను అడ్డు పెట్టుకొని తులసి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ను తీసుకొని లోన్ అమౌంట్ తులసి అకౌంట్ లో పడగానే నేను ఆ బ్లాంక్ చెక్ తో నా అకౌంట్ లో వేసుకుంటాను అని తన ప్లాన్ ను భాగ్యకు చెబుతుంది.

Advertisement

మరోవైపు అంకిత.. తన ఇంటిని వదిలి తులసి ఇంటికి వెళ్లడం కోసం బయలుదేరుతుంది. అభి ఎంత బతిమిలాడినా వినదు. గాయత్రి చెప్పినా కూడా వినదు. నీ ఆలోచన, నీ నిందలు తప్పు అని చెప్పడానికే నేను ఆంటి ఇంటికి వెళ్తున్నా అని గాయత్రితో చెబుతుంది అంకిత. కట్ చేస్తే తులసి ఇంట్లో అడుగు పెడుతుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి