Home » Entertainment » Intinti Gruhalakshmi 18 October 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 18 Oct Today Episode : అంగరంగవైభవంగా ప్రేమ్, శృతి పెళ్లి.. తమ 2 కోట్ల అప్పు కడితేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పిన నందు, లాస్య

Authored By
Varun G
The Telugu News | Updated on: October 18, 2021, 11:24 am
Advertisement

Intinti Gruhalakshmi 18 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి ఈరోజు 18 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్షరను ఇబ్బంది పెట్టినందుకు ప్రేమ్ సారీ చెబుతాడు. తులసి చేసిన పని వల్ల నా కూతురు పెళ్లి ఆగిపోయింది. అయినా నాకు కోపం లేదు ఎందుకంటే తులసిలో ఉన్న నిజాయితీ నాకు బాగా నచ్చింది. కొడుకు ప్రేమను గెలిపించుకోవాలన్న తన ఆరాటంలో అమ్మ ప్రేమ కనిపించింది.. అని జీకే చెబుతాడు. అక్షరను తన కోడలుగా చేసుకుంటే.. ఆస్తి వస్తుందని తెలిసి కూడా ప్రేమకే మొగ్గు చూపడం నాకు నచ్చింది.. అని జీకే చెబుతాడు.

Advertisement

Advertisement

intinti gruhalakshmi 18 october 2021 full episode

Advertisement


ఇంతలో తులసి మళ్లీ ఇంటికి వెళ్లి శృతిని ఒప్పించేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ప్రేమ్ తన ప్రేమను నీ మాటకు కట్టుబడి త్యాగం చేశాడు.. అంటుంది తులసి. అక్షరను పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఏడవని క్షణం లేదు. వాడు నీకోసం పిచ్చివాడు అవుతున్నాడు. ఇప్పటి వరకు వాడిని ధైర్యం చెబుతూ వాడిని కాపాడుకుంటానని చెప్పుకుంటూ వస్తున్నాను. వాడి మనసు తెలిసిన తల్లిగా చెబుతున్నాను.. నువ్వు కాదంటే వాడు మనకు దక్కడు శృతి అంటుంది తులసి. నీ త్యాగం వల్ల ప్రేమ్ తో పాటు అక్షర జీవితం కూడా నాశనం అవబోతోంది అని చెబుతుంది తులసి. దీంతో ప్రేమ్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది శృతి. వెంటనే శృతిని తీసుకొని తులసి పెళ్లి మండపానికి బయలుదేరుతుంది.

Advertisement


నందు గొప్పగా బతకాలనుకోవడం తప్పు కాదు కానీ.. దాని కోసం అడ్డదారులు వెతుక్కోవడం తప్పు. ఉన్నదారిలో ఉన్న అడ్డంకులను తొలగించడం కోసం నీ కొడుకు ప్రేమనే పక్కన పెడతారా? అని నందు పై సీరియస్ అవుతాడు జీకే. దీంతో లాస్య.. వెంటనే సీరియస్ అవుతుంది. ప్రేమ్, శృతి పెళ్లి జరగదు అని తేల్చి చెబుతుంది లాస్య. ఖచ్చితంగా జరుగుతుంది.. జరిగి తీరుతుంది అని చెబుతాడు జీకే. ఇంతలో శృతిని తీసుకొస్తుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 18 Oct Today Episode : శృతిని కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చిన తులసి

ఎందుకొచ్చావ్ అని శృతిని అడుగుతాడు నందు. తీసుకొచ్చింది నేను అని అంటుంది తులసి. నాకు తెలియకుండా తప్పు చేయబోయాను. ప్రేమ్ పక్కన నీ స్థానాన్ని ఆక్రమించబోయాను సారీ.. అని శృతికి చెబుతుంది అక్షర. ధర్మం గెలుస్తుంది.. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తా.. అని అంటుంది అక్షర. ప్రేమ్, శృతి చేతులు పట్టుకొని వాళ్లను కళ్యాణ మండపం మీదికి తీసుకెళ్తుంది అక్షర. తులసిని పెళ్లి కూతురును చేస్తుంది. వాళ్ల పెళ్లి జరుగుతుండగా.. నందు అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. ఆగండి.. కొడుకు పెళ్లి జరుగుతుంటే వాడికి అక్షింతలు వేయకుండా వెళ్తున్నారేంటి అంటుంది తులసి.

intinti gruhalakshmi 18 october 2021 full episode


ఇంతలో లాస్య మాట్లాడుతుంది. ప్రేమ్, అక్షర పెళ్లి జరిగితే.. 2 కోట్ల అప్పు తీరుతుంది అని అనుకున్నాం కానీ.. ఇలా జరుగుతుంది అనుకోలేదు. 2 కోట్ల అప్పు తీర్చుతావా? అప్పుడు ఇక్కడే ఉంటాం. కొడుకు అక్షింతలు కూడా వేస్తాం.. అని లాస్య చెబుతుంది. 2 కోట్ల అప్పు తీర్చే బాధ్యత నువ్వు తీసుకుంటావా? అని నిలదీస్తుంది లాస్య. దీంతో సరే.. ఆ రెండు కోట్ల అప్పు కట్టే బాధ్యత నేను తీసుకుంటాను.. నా కొడుకు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది. ఇంతలో ప్రేమ్ అమ్మా.. అనగానే ప్రేమ్.. నువ్వేమీ మాట్లాడకు అంటుంది తులసి. దీంతో అంగరంగ వైభవంగా ప్రేమ్, శృతి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి