Home » Entertainment » Intinti Gruhalakshmi 19 January 2023 Thursday Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 19 Jan Today Episode : బర్త్ డే పార్టీలో దివ్య ఎంజాయ్.. తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం చేయబోయిన ఫ్రెండ్.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By
Varun G
The Telugu News | Updated on: January 19, 2023 9:44 am
Advertisement

Intinti Gruhalakshmi 19 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జనవరి 2023, గురువారం ఎపిసోడ్ 846 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏమైందిరా… ఏంటి ఇలా ఉన్నావు. ఒంట్లో బాగోలేదా అని నందును అడుగుతుంది అనసూయ. రా.. అలా కూర్చుందువురా అని చెబుతుంది. ఇంతలో తులసి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా కావాలేమో కనుక్కో అంటే వద్దు అంటాడు. అదేంటి డాడ్.. మీరు వచ్చారు. కారు సౌండ్ వినిపించలేదు అని అడుగుతాడు అభి. దీంతో కారు లేదు. 4 నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు. అందుకే కారును బ్యాంక్ వాళ్లు తీసుకెళ్లారు అని చెబుతాడు నందు. దీంతో వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తా అని చెప్పాల్సింది అంటాడు అభి. దీంతో ఇంట్లో వాళ్లే నన్ను నమ్మడం లేదు. బ్యాంక్ వాళ్లు ఏం నమ్ముతారు అని అంటాడు నందు.

Advertisement

intinti gruhalakshmi 19 january 2023 thursday full episode

నమ్మకం అనేది నిస్వార్థమైన ప్రేమతో వస్తుంది అంటూ తులసి నందుతో అంటుంది. దీంతో నాది స్వార్థమైన ప్రేమ అంటావా? అంటాడు నందు. నేను అలా అనను కానీ.. నిస్వార్థంగా ప్రేమిస్తే ఖచ్చితంగా మనకు అవసరాలకు ఆ ప్రేమ ఆదుకుంటుంది. జీవితంలో ఓటమి అనేది ఒక భాగం అంతేకానీ.. అదే జీవితం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. మరోవైపు నందు కాళ్లు విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. వెళ్లి రూమ్ లో బెడ్ మీద కూర్చొంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. వెళ్లి కాళ్లు పడుతున్నట్టు యాక్షన్ చేస్తుంది. నందు.. ఎవరైనా లక్షన్నర మనకు అప్పు ఇచ్చేవాళ్లు ఉన్నారా అని అడుగుతుంది. దీంతో అనుకున్నా.. నా పర్సులో వంద రూపాయలు లేవు అంటాడు.

Advertisement

ఇంటర్వ్యూకే ఆటోకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్లి వచ్చాను అని అంటాడు. దీంతో కారు ఉంది కదా అంటుంది. దీంతో ఈఎంఐ కట్టలేదని కారును లాక్కెళ్లారు బ్యాంక్ వాళ్లు అంటుంది. దీంతో మరి ఇప్పుడు ఎలా అంటుంది లాస్య. అయినా నీకు లక్షన్నర ఎందుకు అంటే.. దివ్యకు కొత్త లాప్ టాప్ కావాలట అంటుంది.

దీంతో నిన్ను అడిగిందా అంటే.. లేదు అంటుంది. మరి నీకెందుకు అంటే.. నేను కొనిస్తా అని మాటిచ్చా అంటుంది. దీంతో ఇప్పటికిప్పుడు లక్షన్నర కావాలంటే నిన్ను అమ్మకం పెట్టాలి అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. మరోవైపు శృతికి పాలు తీసుకొచ్చి ఇస్తుంది తులసి.

Advertisement

ఫోన్ ఎక్కువగా వాడకూడదు లోపల నా లక్ష్మీదేవికి డిస్టర్బ్ అవుతుంది అంటుంది తులసి. ఇంతలో అంకిత వస్తుంది. ఆడపిల్ల అని మీరు ఫిక్స్ అయ్యారా అంటుంది అంకిత. దీంతో అవును.. ఆడపిల్ల దేంట్లో తక్కువ కాదు అంటుంది. ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు అని చెబుతుంది.

Intinti Gruhalakshmi 19 Jan Today Episode : దివ్యకు తన లాప్ టాప్ తెచ్చి ఇచ్చిన లాస్య

మరోవైపు దివ్య దగ్గరికి వచ్చి కొత్త లాప్ టాప్ తెచ్చి ఇస్తుంది లాస్య. ఇలా మాటిచ్చారో లేదో అప్పుడే కొత్త లాప్ టాప్ కొనేశారా అంటే.. కొత్తది కొంటాను కానీ.. దానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు నా లాప్ టాప్ వాడుకో అంటుంది.

అయ్యో వద్దు ఆంటి అంటుంది. మీకు అవసరం కదా అంటుంది. దీంతో ఒకప్పుడు అవసరం ఉండేది. ఇప్పుడేముంది.. ఉద్యోగమా.. సద్యోగమా అంటుంది. ఏదైనా నీకు కొత్త లాప్ టాప్ కొనిస్తాను. అప్పటి వరకు ఇది వాడుకో అంటుంది లాస్య. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను దగ్గరికి తీసుకోవాలని నా మనసులో ఉండేది.

కానీ.. మీ అమ్మకు నా మీద ఉన్న కోపం దగ్గర కానివ్వలేదు. నువ్వు కూడా మా అమ్మతో పాటు నన్ను ధ్వేషించేదానివి అంటుంది లాస్య. దీంతో నాకు తెలియలేదు ఆంటి అంటుంది. నాకు తెలియక మిమ్మల్ని హర్ట్ చేశాను. సారీ ఆంటి అంటుంది దివ్య. నేను ఇప్పటి నుంచి ఎవరు మీ గురించి ఏం చెప్పినా వినను.. నమ్మను అంటుంది.

Advertisement

నాకు ఏం కావాలన్నా మీరు చెప్పినట్టే వింటాను.. అంటుంది దివ్య. అలా చేస్తే మీ అమ్మకు కోపం వస్తుందేమో అంటుంది. దీంతో రానివ్వండి. నాకు కావాల్సింది ఇవ్వకపోతే నేను ఎలా ఉంటాను అంటుంది. మా అమ్మకు నేనంటే ఇష్టమే కానీ.. స్వేచ్ఛ ఇవ్వదు. పంజరంలో పెట్టి చూసుకుంటుంది అంటుంది దివ్య.

అలాంటి ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను చూసుకుంటాను అంటుంది లాస్య. దీంతో ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్ డే. ఇంట్లో పార్టీ ఇస్తుంది అంటుంది. దీంతో వెళ్లు అంటుంది లాస్య. అమ్మను అడిగితే పంపించదు అంటుంది. దీంతో స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి వెళ్లు అని సలహా ఇస్తుంది లాస్య.

దీంతో అబద్ధామా.. మామ్ కు తెలిసిపోతే అంటుంది. ఎవరు చెబుతారు. ఇలా వెళ్లిపోయి అలా వచ్చేయ్. ఎంజాయ్ అంటుంది. నువ్వు మీ అమ్మ దగ్గర అబద్ధం చెప్పు. నేను నీ పని అయ్యేలా చూస్తాను అంటుంది. దీంతో థాంక్యూ ఆంటి అంటుంది. దివ్య పూర్తిగా నా వైపు వచ్చేసింది అని మనసులో అనుకుంటుంది లాస్య.

దివ్య వేసుకున్న డ్రెస్ చూసి షాక్ అవుతుంది తులసి. స్పెషల్ క్లాస్ అంటే ముందే చెబుతారు కదా.. అయినా ఇప్పుడు చెప్పడం ఏంటి అంటుంది తులసి. దీంతో లాస్య వచ్చి స్పెషల్ క్లాసే కదా… దానికి పంపించడానికి కూడా ఏంటి ఇబ్బంది అనడంతో దివ్యను పంపిస్తుంది తులసి.

Advertisement

దీంతో పార్టీకి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది దివ్య. కానీ.. కూల్ డ్రింక్ లో తనకు మత్తు మందు ట్యాబ్లెట్స్ కలిపి ఇస్తాడు తన ఫ్రెండ్. ఆ తర్వాత తనకు కళ్లు తిరుగుతూ ఉండటంతో తనను ఎక్కడికో తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి