
intinti gruhalakshmi 19 march 2022 full episode
Intinti Gruhalakshmi 19 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 584 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత సంవత్సరం ప్రేమ్ కు బర్త్ డే వేడుకలు ఎలా జరిపారో గుర్తు చేసుకుంటాడు ప్రేమ్. ఇంటి సభ్యులు అందరూ కలిసి ప్రేమ్ బర్త్ డే కోసం సర్ ప్రైజ్ చేస్తారు. అవన్నీ ప్రేమ్ కు గుర్తొస్తాయి. తులసి ప్రేమ్ బర్త్ డే కోసం ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తుంటారు. ఇంతలో తులసి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందు వచ్చి ఏమైంది తులసి.. ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని అంటాడు. రేపు ఏంటో గుర్తుందా అని అడుగుతుంది. ప్రేమ్ బర్త్ డే అంటాడు నందు.
intinti gruhalakshmi 19 march 2022 full episode
ప్రేమ్ చిన్నప్పుడు చేసిన విషయాల గురించి అన్నీ గుర్తుకు తెస్తాడు నందు. మరోవైపు ప్రేమ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసి షాక్ అవుతారు. ఇల్లంతా బొసిపోయి ఉంటుంది. అసలు ఎవ్వరూ తన బర్త్ డే గురించి పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తారు. శృతి కూడా నిద్రపోతున్నట్టు నటిస్తుంది. దీంతో ప్రేమ్ కు చిరాకు వేస్తుంది. చివరకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నన్ను పట్టించుకోలేదంటే నేను వేస్ట్ క్యాండిడేట్ అని అందరూ ఫిక్స్ అయినట్టున్నారు అనుకొని వెళ్లి సోఫా మీద పడుకుంటాడు ప్రేమ్.
ఇంటి సభ్యులంతా దాచుకొని 12 అయ్యే సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకో రెండు నిమిషాల్లో 12 అవుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా వచ్చి నాకు సర్ ప్రైజ్ ఇస్తారేమో.. నేను వాళ్లకు సర్ ప్రైజ్ ఇస్తా అని అనుకుంటాడు ప్రేమ్. 12 అయినా కూడా ఎవ్వరూ రారు. దీంతో ప్రేమ్ చాలా బాధపడతాడు.
అందరూ మరిచిపోయినట్టున్నారు. అమ్మ కూడా మరిచిపోయిందా అని అనుకుంటాడు ప్రేమ్. పోనీ నేనే వెళ్లి అమ్మ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే.. వద్దులే అమ్మ ప్రేమ గురించి ఎలా తెలుసుకోవాలి. అందరూ మరిచిపోయినా నాకు నేనే బర్త్ డే విషెస్ చెప్పుకుంటా అని చెప్పి హ్యాపీ బర్త్ డే అని చెప్పుకొని నిద్రపోతాడు ప్రేమ్.
ఇంతలో తులసి అతడి దగ్గరికి వెళ్లి అతడి తల మీద చేయి వేయబోయి మళ్లీ ఆగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న అంటుంది. నువ్వు అన్నది నిజంరా. నేను ఊపిరి తీసుకోవడం అయినా మరిచిపోతానేమో కానీ నీ పుట్టిన రోజును ఎప్పటికీ మరిచిపోను. నన్ను క్షమించరా. ఇంట్లో వాళ్లు అందరూ నన్ను కట్టేశారు. అర్ధరాత్రి నిన్ను దీవించడానికి వెళ్లొద్దు అన్నారు.. చెబుతుంది తులసి.
ఏమీ అనుకోకు. కొద్ది గంటలు ఆగితే అందరితో పాటు నేను కూడా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తెల్లారగానే.. గుడ్ మార్నింగ్ అమ్మ అంటాడు ప్రేమ్. ఈరోజు ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. ఏముంది. ఈరోజు శనివారం.. అంటుంది తులసి.
దీంతో ప్రేమ్ కు చిరాకు వేస్తుంది. ఆ తర్వాత తాతయ్య, నానమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్లూ పట్టించుకోరు. అభి, అంకిత కూడా అలాగే చేస్తారు. దీంతో నా బర్త్ డేను అందరూ మరిచిపోయారు అని అనుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత శృతి దగ్గరికి వెళ్తాడు. శృతి కూడా ఏం తెలియనట్టుగానే నటిస్తుంది.
ప్రేమ్ అలా చిరాకు పడుతుంటే అందరూ తెగ సంతోషిస్తారు. ఇంతలో హాల్ లోకి వెళ్తాడు ప్రేమ్. అప్పుడే పవర్ కట్ చేస్తారు. తర్వాత నెమ్మదిగా.. ఒక్కో లైట్ వెలిగిస్తారు. ఇల్లంతా డెకరేట్ చేసి ఉంటుంది. పక్కనే కేక్ కూడా ఉంటుంది. ఇన్ని అరేంజ్ మెంట్స్ చూసి షాక్ అవుతాడు ప్రేమ్.
అందరూ వచ్చి అప్పుడు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతారు. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. నీ బర్త్ డేను మరిచిపోయామని ఫీల్ అయ్యావు కదా అని అడుగుతారు అందరూ. అదేం లేదు అంటాడు ప్రేమ్. తన నాన్న నందు కూడా బర్త్ డే శుభాకాంక్షలు చెబుతాడు.
సారీ ప్రేమ్ పొద్దున నుంచి నీకు బర్త్ డే విషెస్ చెప్పలేకపోయాను.. అంటుంది శృతి. ఆ తర్వాత బర్త్ డే కేకు కట్ చేస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత బర్త్ డే సందర్భంగా తులసి.. ప్రేమ్ కు గిటార్ బహుమతిగా ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.