
intinti gruhalakshmi 19 may 2022 full episode
Intinti Gruhalakshmi 19 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 మే 2022, గురువారం ఎపిసోడ్ 636 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నోర్మూసుకుంటావా అని లక్కీపై విరుచుకుపడతాడు నందు. దీంతో ఇప్పుడు వాడి మీద అరిచి ఏంటి లాభం అంటుంది లాస్య. తులసి చెప్పిందనే ఈ జాబ్ లో జాయిన్ అయ్యావు కదా అంటుంది లాస్య. ఎవరికో అన్యాయం చేసి ఉంటారు అందుకే ఇలా జరిగింది అంటూ లక్కీ అనడంతో లక్కీ మీద కోప్పడతాడు నందు. ఇంతలో తన ఫ్రెండ్ శేఖర్ వస్తాడు. తన డబ్బులు కావాలంటాడు. 20 వేలు వెంటనే ఇవ్వాలంటాడు. అప్పు తిరిగి ఇవ్వడానికి ఇంకా రెండు నెలల టైమ్ ఉంది కదా అంటాడు నందు. దీంతో మా ఆవిడకు ఆరోగ్యం బాగాలేదు అంటాడు శేఖర్. ఒక గంటలో నా డబ్బులు మొత్తం నాకు కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శేఖర్. దీంతో ఏం చేయాలో అర్థం కాదు నందుకు. నా బ్యాంక్ అకౌంట్స్ జీరో అంటాడు నందు. కనీసం ఈసారి అయినా మంచి సాఫ్ట్ వేర్ జాబ్ చూసుకో నందు బాగుపడతావు అని అంటుంది లాస్య.
intinti gruhalakshmi 19 may 2022 full episode
ఇప్పుడు తులసే నాకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నట్టుంది. ఎంతో కొంత సంపాదిస్తున్నట్టుంది అని అనుకుంటాడు నందు. తులసి ఆంటిని ఏడిపించారు కదా.. మీకు ఇలాగే జరుగుతుంది. బ్యాడ్ బాయ్ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు లక్కీ. మరోవైపు తులసి ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. బంతిని తన మీదికి విసురుతారు. దీంతో వాళ్ల దగ్గరికి వచ్చిన తులసి.. వాళ్లను కోపంగా చూస్తుంది. సారీ ఆంటి అంటారు. దీంతో నేను కూడా మీతో కలిసి ఆడుతాడు. నన్ను మీ జట్టులోకి తీసుకోండి అంటుంది తులసి. వాళ్లతో కలిసి సరదాగా ఆడుతుంది తులసి. కాసేపు వాళ్లతో ఫుట్ బాల్ ఆడుతుంది తులసి.
మరోవైపు నానమ్మ కిచెన్ అనే యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేస్తుంది అనసూయ. ఇంతలో తులసి వచ్చి మీరెందుకు శ్రమ పడుతున్నారు అని అంటుంది తులసి. దీంతో నేను నాకోసం వండటం లేదు.. జనం కోసం వండుతున్నాను అంటుంది అనసూయ. సోషల్ మీడియాలో కొత్త చానెల్ ఓపెన్ చేసింది నానమ్మ అని చెబుతుంది దివ్య. పరందామయ్య షాక్ అవుతాడు.
ఇందులో చిత్రవిచిత్రమైన వంటలు చేసి జనాలకు నేర్పిస్తా అంటుంది అనసూయ. నేను కూడా ఈ చానెల్ ద్వారా డబ్బులు సంపాదిస్తా.. అంటుంది అనసూయ. ఇంతకీ ఏం వండబోతున్నావు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో కాకరకాయ హల్వా అంటుంది అనసూయ.
ఇంతలో తులసికి ఒక డౌట్ వస్తుంది. తనకు సంగీతం గురించి డౌట్స్ తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో చూసుకోవచ్చా అని దివ్యను అడుగుతుంది. దీంతో దివ్య తెలుసుకోవచ్చు అని చెబుతుంది. మరోవైపు ఇంట్లో కూడా సంగీత సాధన చేస్తుంది తులసి.
మరోవైపు ప్రేమ్.. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎవడ్రా అక్కడ మన స్టూడియోకు లిరిక్ రైటర్ ప్రేమ్ గారు వచ్చారు.. ఎవరైనా కాఫీ పట్టుకురండి అంటూ ఆటపట్టిస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో మీకు దండం పెడతాను సార్..నా నెల జీతం ఇప్పించండి సార్ అంటాడు ప్రేమ్.
దీంతో నీకు ఉద్యోగమే లేదు.. జీతం ఏంటి అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్ అంటాడు ప్రేమ్. తెలియక తప్పు చేశాను అన్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్ వినడు. పొరపాటున కూడా నా స్టూడియో వైపు చూడకు అంటాడు.
కనీసం నేను పనిచేసిన దానికైనా డబ్బు ఇవ్వండి సార్ అంటే.. అది అప్పుడే ఇచ్చాను కదా అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో కోపంతో అతడి కాలర్ పట్టుకుంటాడు ప్రేమ్. నా కాలరే పట్టుకుంటావా.. నీ అంతు చూస్తా.. ఇండస్ట్రీలో నీకు ఎక్కడా పని దొరక్కుండా చూస్తా అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ్ ను తరిమేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్.
మరోవైపు ఇంట్లో సరుకులు నిండుకుంటాయి. దీంతో సరుకులు తేవడానికి కిరాణ కొట్టుకు వెళ్తుంది తులసి. అప్పుడే అదే సమయంలో ప్రేమ్ కూడా అక్కడి నుంచి వెళ్తుంటాడు. తులసిని చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. తను డబ్బులు లేక తక్కువ సామాన్లు తీసుకోవడం చూస్తాడు ప్రేమ్.
కిరాణ వ్యక్తి.. తులసితో గొడవ పడటం చూసి.. ప్రేమ్ వచ్చి మా అమ్మను అంత మాట అంటావా అంటూ అతడితో గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
This website uses cookies.