Home » Entertainment » Intinti Gruhalakshmi 2 February 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 2 Feb Today Episode : తులసి ఇంట్లో ప్రళయం.. భాగ్య చెప్పిన ప్లాన్ ను అమలు చేసిన లాస్య.. తన బుట్టలో పడిపోయిన అంకిత.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: February 2, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 2 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఫిబ్రవరి 2, 2022 ఎపిసోడ్ 545 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, శృతి ఇద్దరూ దూరంగా ఉండటం చూసి.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అని అడుగుతుంది తులసి. దీంతో గొడవ కాదు ఆంటి.. చిన్న అపార్థం అంటుంది శృతి. అటువంటి అపార్థాలు మరోసారి రాకుండా చూసుకో అమ్మ. దెబ్బతిన్నదానిలా చెబుతున్నాను అంటుంది తులసి. ఒక్కసారి ఈ ఇంట్లో అందరి జీవితాలు ఇలా మారిపోయాయి ఏంటి అని అనుకుంటుంది తులసి. ఇంతలో అభి ఇంటికి వస్తాడు. ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతుంది. హాస్పిటల్ లో ఆపరేషన్ ఉంటే వెళ్లా అని అంటాడు. మరి ఆపరేషన్ చేస్తే అంత హుషారుగా ఉన్నావు ఏంటి.. అలసిపోవాలి కదా అంటుంది.

Advertisement

intinti gruhalakshmi 2 february 2022 full episode

మాధవి వచ్చిపోయింది అని చెబుతుంది తులసి. అవునా.. ఎందుకు వచ్చింది అని టెన్షన్ పడతాడు. ఊరికే నన్ను కలిసిపోవడానికి వచ్చింది అని అంటుంది. అంతేనా సరే.. నేను రేపు మాట్లాడుతాను అని చెప్పి తన రూమ్ కు వెళ్తాడు అభి. మరోవైపు లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. నందు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతుంది. ఇంతలో భాగ్య వస్తుంది. పేరుకు మాత్రమే నీకు ఇక్కడ కోడలు హోదా ఉందా.. నాకు ముందే ఈ విషయం చెప్పాల్సింది అని అంటుంది భాగ్య. ఈ ఇంట్లో ధర్మయుద్ధం కలిసి రాదు. వెన్నుపోటు రాజకీయం చేయాల్సిందే. వాళ్లను విడగొట్టి చెడగొట్టు అని సలహా ఇస్తుంది భాగ్య.

Advertisement

ఎవరైనా బాధలో ఉంటే వెళ్లి వాళ్లను ఓదార్చు. అప్పుడు వాళ్లు నీ కీలుబొమ్మలా అవుతారు.. అంటుంది. కట్ చేస్తే అంకిత వంట పనులు చేస్తూ ఉంటుంది. నువ్వు వంట పని చేయొద్దని చెప్పా కదా.. అంటే నేను వంట నేర్చుకోవద్దా ఆంటి అని అడుగుతుంది.

ఓవైపు ఉద్యోగం.. మరోవైపు ఇల్లును ఎలా మెయిన్ టెన్ చేయాలో అంకితకు చెబుతుంది తులసి. ఆత్మాభిమానం పోగొట్టుకోవడం అంటే బతికున్న శవంతో సమానం అని అనిపించింది.. అంటుంది తులసి. నా గతం అంకుల్ రూపంలో ప్రతి రోజు నా కళ్ల ముందే తిరుగుతుంది అంటుంది.

Advertisement

Intinti Gruhalakshmi 2 Feb Today Episode : శృతికి జ్వరం వచ్చినా పట్టించుకోని ప్రేమ్

శృతి ఎక్కడుంది అని అడుగుతుంది తులసి. రాత్రి తలనొప్పిగా ఉందని చెప్పింది. ఇంకా లేవలేదేమో ఆంటి అని చెబుతుంది అంకిత. నిజంగానే శృతికి బాగా తలనొప్పి ఉంటుంది. బెడ్ లో పడుకొని ఉంటుంది. నేను లేవకున్నా కూడా ప్రేమ్ నన్ను అడగడు ఏంటి అని అనుకుంటుంది శృతి.

మరోవైపు ప్రేమ్ కూడా అదే అనుకుంటాడు. ఇంతసేపు ఎందుకు మాట్లాడలేదు. కనీసం లేవలేదు కూడా ఏంటి అని అనుకుంటాడు ప్రేమ్. ఏంటి ఇంత సేపు పడుకున్నావు ఏమైంది అని అడుగుతాడు ప్రేమ్. జ్వరం వచ్చింది. రాత్రంతా తలనొప్పి అని చెబుతుంది శృతి.

ఒక్క నిమిషం అని చెప్పి వెళ్లి ట్యాబ్లెట్స్ తీసుకచ్చి వేసుకో అంటాడు ప్రేమ్. అంకితను ముందు బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది లాస్య. వయసుకు మించిన బాధ్యత మోస్తున్నావు అంకిత అంటుంది. అభి హాస్పిటల్ కు వెళ్లేటప్పుడే నీకు కిచెన్ లో పని ఉండేది. ఇప్పుడు జాబ్ చేస్తూ కిచెన్ పని చేస్తున్నావు. నీకు భారంగా అనిపించడం లేదా అంటుంది లాస్య.

మరోవైపు అభిని ఒక దొంగను చూసినట్టు చూస్తుంది తులసి. అభి.. నిన్న హాస్పిటల్ లో సర్జరీలో ఉన్నావు కదా. ఆ సంగతి నీ హాస్పిటల్ వాళ్లకు తెలియదా అని అడుగుతుంది. నిన్నేరా అడిగేది అంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది మామ్.. నువ్వు మరీను అంటాడు అభి.

Advertisement

మరి.. నువ్వు హాస్పిటల్ కు రాలేదు అని మీ వాళ్లు ఎంక్వయిరీ చేస్తూ ఫోన్ చేశారు అని చెబుతుంది తులసి. ఈ మాట రాత్రే నన్ను ఎందుకు అడగలేదు అని అనుకుంటాడు అభి. మామ్.. అది వేరే హాస్పిటల్ లో ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తుంటే చెప్పకుండా వెళ్లాను అంటాడు అభి.

రాత్రికి రాత్రే ఎదగాలనుకోవడం తప్పు. అలా ఎదగాలంటే దారితప్పితే కానీ జరగదు.. అంటుంది తులసి. ఇంతలో నందు వచ్చి బెటర్ మెంట్ కోసం వేరే కంపెనీని వెళ్లడం తప్పేం కాదు కదా తులసి అని అంటాడు నందు. నందు ప్రశ్నకు సమాధానం చెప్పు అంటుంది లాస్య. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి