Intinti Gruhalakshmi 2 July Today Episode : తులసి ముందు అడ్డంగా బుక్ అయిన లాస్య, భాగ్య.. ఇద్దరినీ తులసి అరెస్ట్ చేయిస్తుందా? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 2 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జులై 2022, శనివారం ఎపిసోడ్ 674 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భాగ్య, లాస్య నాటకాన్ని బయటపెట్టేందుకు తులసి, దివ్య, అంకిత ముగ్గురు భలే ప్లాన్ వేస్తారు. భాగ్యను తెగ ఆటపట్టిస్తారు. తనకు ఫోన్ వచ్చినట్టు నటిస్తుంది తులసి. లోపలికి వెళ్లి ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా నటిస్తుంది. బయటి నుంచి వచ్చి చాటుగా ఫోన్ లో తులసి ఏం మాట్లాడుతుందో అని వింటుంది. ఆ బ్యాంక్ బ్రోకర్ రంజిత్ గాడు ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? ఎక్కడున్నాడు.. అడ్రస్ ఏంటి.. అని అడుగుతుంది. దీంతో ఏదో అడ్రస్ చెప్పినట్టుగా తను ఆ అడ్రస్ ను బయటికి చెబుతుంది. దీంతో ఆ అడ్రస్ ను నోట్ చేసుకుంటుంది భాగ్య. ఫోన్ కట్ చేసిన తర్వాత ఆంటి.. ఆ రంజిత్ గాడు దొరికాక వాడి వెనుక ఎవరు ఉన్నారో వాళ్ల సంగతి తేలుస్తా అని భాగ్యకు వినపడేలా మాట్లాడుతుంది తులసి.

intinti gruhalakshmi 2 july 2022 full episode

అమ్మో.. వెంటనే ఈ వార్త లాస్య చెవిన వేయాలి అని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతుంది భాగ్య. కట్ చేస్తే తులసి ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో.. అని టెన్షన్ పడుతూ ఉంటుంది లాస్య. ఇంతలో భాగ్య కాల్ చేస్తుంది. హలో భాగ్య.. ఏమైపోయావు అని అడుగుతుంది. నీకేంటి నువ్వు అక్కడ బాగానే ఉన్నావు.. అంటుంది భాగ్య. ముందు అక్కడ ఏం జరుగుతోందో చెప్పు అని అడుగుతుంది లాస్య. దీంతో ఇంకాసేపట్లో నీ చేతులకు బేడీలు వేయడానికి పోలీసులు వచ్చినా వస్తారు అని చెబుతుంది. ఆ రంజిత్ గాడి అడ్రస్ తులసికి తెలిసిపోయింది అని అంటుంది. దీంతో లాస్య టెన్షన్ పడుతుంది. తులసి అక్క మనుషులు ఆ రంజిత్ గాడి చొక్కా పట్టుకొని ఇక్కడికి లాక్కొస్తున్నారట. వాడిని నాలుగు పీకితే వాడు ముందు మన గురించి చెబుతాడు. ఆ తర్వాత మనకు చిప్పకూడే గతి అంటుంది భాగ్య.

దీంతో అర్జెంట్ గా మనం ఒక పని చేయాలి అని అంటుంది లాస్య. ఆ రంజిత్ గాడు ఎక్కడున్నాడో వాడి అడ్రస్ నీకు తెలుసు కదా. తులసి మనుషుల కంటే ముందు మనం వెళ్లి వాడిని తప్పిద్దాం అంటుంది లాస్య. దీంతో దానికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అంటుంది భాగ్య.

దీంతో వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమని నేనే చెప్పాను అంటుంది లాస్య. సరే.. పదా వెళ్దాం అంటుంది. మరోవైపు లాస్య టెన్షన్ పడటం చూసి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు నందు. దీంతో ఆఫీసు టెన్షన్ అంటుంది లాస్య. దీంతో రిజైన్ చేయి అంటాడు నందు.

నువ్వు రెడీగా.. ఈవెనింగ్ సరదాగా బయటికెళ్లి వద్దాం. ఎంజాయ్ చేసి వద్దాం అంటాడు. దీంతో సరే అన్నట్టుగా తల ఊపుతుంది లాస్య. మరోవైపు తమ ప్లాన్ వర్కవుట్ అవుతున్నందుకు తులసి, అంకిత, దివ్య సంతోషిస్తారు. ఇంత తెలివి ఇన్నాళ్లు ఎక్కడ దాచుకున్నావు మామ్ అంటుంది దివ్య.

Intinti Gruhalakshmi 2 July Today Episode : ప్రేమ్ ను అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్

దీంతో అప్పటికీ ఇప్పటికీ మీ అమ్మ ఒకేలా ఉంది. ఒకేలా అందరినీ అభిమానిస్తోంది అంటుంది తులసి. నా దారి మారలేదు కానీ.. నడిచే పద్ధతి.. ఆలోచించే విధానం మారింది అంటుంది తులసి. మనకంటే ముందే వాడిని పట్టుకోవాలన్న ఆరాటంలో కంగారుగా రోడ్డున పడతారు అని చెబుతుంది తులసి.

ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ కళ్లతో మీరే చూద్దురు కానీ.. రెడీ అయిపోండి అని అంటుంది తులసి. మరోవైపు మ్యూజిక్ కాంపిటిషన్ పాంప్లెట్ ను పేపర్ లో చూస్తుంది తులసి. ఆ కాంపిటిషన్ లో గెలిస్తే 5 లక్షలు ఇస్తామని అందులో ఉంటుంది. దీంతో ఈ విషయం వెంటనే శృతికి చెప్పాలి అని అనుకుంటుంది.

ఈరోజు న్యూస్ పేపర్ లో పాంప్లెట్ ఉంది చూడు అని చెబుతుంది శృతికి. అందులో గెలిస్తే 5 లక్షలు బహుమతి. ఎవరి మీదా ఆధారపడకుండా వాడంతట వాడే ఆల్బమ్ చేసుకోవచ్చు. వాడిని పాల్గొనమని చెప్పు అని అంటుంది తులసి. దీంతో సరే అంటుంది శృతి.

మరోవైపు ప్రేమ్.. ఆఫీసులో దీనంగా కూర్చొని ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చూసి పిలిచినా పలకడు. ఏం బాబు ఎక్కడున్నావు అని అడుగుతాడు. నా బతుకు గిటారు తీగ తెగిపోయింది సార్ అంటాడు ప్రేమ్. చాన్స్ చాన్స్ అంటూ నాకు ఊపిరి తీసుకునే చాన్స్ ఇవ్వకుండా ఇన్నాళ్లు నా వెంట పడ్డావు కదా.. ఇప్పడు ఇస్తాను తీసుకో అంటాడు మ్యూజిక్ డైరెక్టర్.

మెయిన్ గిటార్ ప్లేయర్ వచ్చేంత వరకు గిటార్ ప్లే చేయాలి అంటాడు. రఫ్ ట్రాక్ మీద గిటార్ ప్లే చేయాలి అంటాడు. దీంతో సరే అంటాడు. ఏదో ప్లే చేస్తుంటాడు కానీ.. అది ముప్పి లహరికి నచ్చదు. సరిగ్గా ప్లే చేయి అంటాడు. దీంతో వద్దు ఆపు అంటాడు. వెళ్లు నీకు ప్లే చేయడం చేతకాదు.. వెళ్లి కుర్చీలు తూడ్చుకో అంటాడు మ్యూజిక్ డైరెక్టర్.

మరోవైపు హడావుడిగా లాస్య, భాగ్య.. తులసి చెప్పిన అడ్రస్ కు వెళ్తుంటారు. వాళ్ల వెనుకనే ఆటోలో తులసి, దివ్య, అంకిత వెళ్తూ ఉంటారు. మధ్యలో వాళ్ల స్కూటీ ఆగిపోతుంది. దీంతో స్కూటీ ఆపి దాన్ని స్టార్ట్ చేస్తుంటుంది లాస్య. కానీ.. అది స్టార్ట్ కాదు.

దీంతో పరిగెత్తుకుంటూ వెళ్దాం పదా అంటుంది. దీంతో ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. వాళ్ల వెనుకే ఆటో వస్తుంటుంది. లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ తులసి, అంకిత, దివ్య.. లాస్య, భాగ్యకు కనిపిస్తారు. నీ రంజిత్ మా దగ్గరే ఉన్నాడు. అన్నీ చెప్పేశాడు. 24 గంటల్లో నా 20 లక్షలు నా అకౌంట్ లో పడిపోవాలి అని తులసి లాస్యకు వార్నింగ్ ఇస్తుంది. లేదంటే.. నీ నందుకు అన్ని విషయాలు చెప్పేస్తా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

54 minutes ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

4 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

5 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

9 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

11 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

23 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago