
intinti gruhalakshmi 2 june 2022 full episode
Intinti Gruhalakshmi 2 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 648 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడు నా పెద్ద కొడుకు అభి.. డాక్టర్ అని అందరికీ పరిచయం చేస్తాడు నందు. కష్టం విలువ తెలిసిన వాడు.. పెద్దలంటే గౌరవం భక్తి అని చెబుతాడు నందు. అభి నాకొడుకు అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను అంటాడు నందు. ఆ తర్వాత అదేంటి నాన్న తమ్ముడిని పరిచయం చేయవా అని అంటాడు అభి. దీంతో వాడు నా రెండో కొడుకు. ఎందుకు పుట్టాడో తెలియదు అంటాడు నందు. ఏం చేస్తున్నాడో తెలియదు అంటాడు నందు. ఇలాంటి వాడికి తండ్రి అని చెప్పుకోవడానికే సిగ్గు పడుతున్నా అంటాడు నందు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
intinti gruhalakshmi 2 june 2022 full episode
ఆ తర్వాత ప్రేమ్ ఆగు.. ఎక్కడికి అని అంటుంది శృతి. దీంతో దూరంగా మనుషులు లేని చోటుకు అంటాడు ప్రేమ్. నువ్వు ఈ ఫంక్షన్ లో నుంచి వెళ్లిపోతే అంకిత బాధపడుతుంది అంటుంది శృతి. అంకిత కేక్ కట్ చేసేటప్పుడు మనం కొన్న డ్రెస్సే వేయిస్తా అని గాయత్రి నాకు మాటిచ్చింది అంటుంది లాస్య. దీంతో నందు మాత్రం ఏమో నాకు నమ్మకం లేదు అంటాడు నందు. మరోవైపు తను ఏ డ్రెస్ వేసుకుంటుందో అని దివ్య కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అంకిత ఏ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఏంటి.. మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి అంటుంది తులసి. మరోవైపు అంకిత.. తులసి తీసుకొచ్చిన డ్రెస్ నే వేసుకుంటుంది. దీంతో గాయత్రి, లాస్యకు కోపం వస్తుంది.
ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చి ఈ జ్యూస్ తాగమ్మా అంటూ తనకు తాగించబోయి.. జ్యూస్ ను చీర మీద కావాలని పోస్తుంది గాయత్రి. అయ్యో.. చీర మీద జ్యూస్ పడిందే అంటుంది గాయత్రి. ఏంటమ్మా ఇది అంటుంది అంకిత. దీంతో సారీ అమ్మ.. గ్లాస్ చేజారిపోయింది. చూసుకోలేదు అంటుంది గాయత్రి.
మామ్.. నేను ఇక కేక్ కట్ చేయను. నా మూడ్ పాడయిపోయింది అంటుంది అంకిత. దీంతో ఇంత మందిని పిలిచి.. ఇంత గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాక.. కేక్ కట్ చేయకపోతే ఎలా. ఇప్పుడు ఏమైంది. వెళ్లి 5 నిమిషాలలో లాస్య ఇచ్చిన చీర కట్టుకొనిరా.. కేక్ కట్ చేద్దువు కానీ అంటుంది గాయత్రి.
నాకు ఈ సారీ చేంజ్ చేసుకోవాలని లేదు అంటుంది అంకిత. దీంతో చేసుకోకు అంటుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏం కాదు.. దీని మీద ఏం పడినా బట్ట చెడిపోదు. జస్ట్ తుడిచేస్తే చాలు అంటుంది తులసి. చూడండి అని జ్యూస్ పడ్డ ప్రాంతంలో తూడుస్తుంది తులసి. దీంతో మరక పోతుంది.
ఇలాంటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయనే.. ముందు చూపుతో ప్రత్యేకంగా ఈ వెరైటీ చీర తయారు చేశాను. నువ్వు శారీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంకిత. పదా.. కేక్ కట్ చేద్దాం అంటుంది తులసి. దీంతో థాంక్యూ ఆంటి.. అంటుంది అంకిత.
ఆ తర్వాత అంకిత కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి.. లాస్యకు పెట్టకుండా.. తులసికి పెడుతుంది అంకిత. దీంతో గాయత్రికి కోపం వచ్చి.. ఇది పద్ధతి కాదు అంటుంది గాయత్రి. దీంతో నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినట్టు చేయకుండా.. మీకు నచ్చినట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు అంటుంది అంకిత.
వాళ్లను పార్టీ జరపమని నేను అన్నానా లేదే.. పైగా వద్దు అంటూ మీరే గొడవ పెట్టుకొని మరీ ఈ పార్టీ అరేంజ్ చేశారు.. అని మాటలు మాట్లాడి ఆ తర్వాత వెళ్లి లాస్యకు కేక్ తినిపిస్తుంది అంకిత. తర్వాత అంకిత కోరిక మేరకు తులసి పాట పాడుతుంది.
ఆ తర్వాత అంకిత విషయంలో లాస్యకు చాలా కోపం వస్తుంది. ఫంక్షన్ అయిపోయాక.. గాయత్రితో మాట్లాడుతారు నందు, లాస్య. అభి, గాయత్రి ముందు లాస్య దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇదంతా మీ అమ్మ వల్లనే. ఇదంతా మీ అమ్మే చేసింది.. అంటుంది గాయత్రి.
మరోవైపు తులసి ఆ మాటలు విని.. మీ అమ్మ అలాంటిది కాదు అని చెప్పొచ్చు కదా అభి అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.