Home » Entertainment » Intinti Gruhalakshmi 2 September 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 2 Sep Today Episode : అభిపై అంకిత సీరియస్.. నందును బతిమిలాడిన తులసి.. లాస్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 2, 2022, 9:05 am
Advertisement

Intinti Gruhalakshmi 2 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 2 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 727 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు తులసి విషయంలో ఏం జరిగినా నా మీద ఎందుకు రుద్దుతున్నారు. నా వైపు ఎందుకు చూస్తున్నారు అంటూ లాస్యతో అంటాడు నందు. తులసితో నాకు ఎఫ్పుడో విడాకులు అయ్యాయి. అయినా ఇంకా నేను తులసి గురించి ఎందుకు ఆలోచించాలి. తులసి విషయంలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ మండిపడతాడు నందు. ఇక నుంచి నేను తులసి విషయంలో కలుగజేసుకోను అంటాడు నందు. దీంతో అసలు.. అభిని రెచ్చగొట్టింది నేనే అని అభికి తెలిస్తే నన్ను ఏం చేస్తాడో అని మనసులో అనుకుంటుంది. నువ్వు తులసి విషయంలో పట్టించుకోకుండా ఉండాలంటే మీ అమ్మానాన్నలను కూడా వదిలేయాలి. అలా చేస్తావా అంటుంది లాస్య. దీంతో నో అలా ఎలా కుదురుతుంది. మా అమ్మానాన్నను ఎలా వదిలేస్తాను అంటాడు నందు. కదా.. అందుకే నువ్వు తులసి విషయంలోనూ పట్టించుకోకుండా ఉండలేవు అంటుంది లాస్య.

Advertisement

intinti gruhalakshmi 2 september 2022 full episode

మనం సామ్రాట్ కంపెనీలో తిరిగి జాయిన్ అవుదాం అంటుంది లాస్య. అలా అయితేనే వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనం చూడగలం అంటుంది లాస్య. అంటే ఇప్పుడు వెళ్లి సామ్రాట్ కాళ్లు పట్టుకోమంటావా అంటాడు నందు. అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక పని చేయి అంటుంది లాస్య. ఏదో ప్లాన్ చేస్తుంది. మరోవైపు మన ఇంటి పరిస్థితి ఏంటి.. ఇప్పుడు ఏం చేయాలి అని అనసూయ పరందామయ్యను అడుగుతుంది. ఇంతలో తులసి వస్తుంది. నీ డౌట్స్ ఏంటో నువ్వే అడుగు అంటాడు పరందామయ్య. అత్తయ్య మనం రాసే కథ అయితే ఎలాగైనా రాసుకోవచ్చు. ముగింపు మన చేతుల్లో ఉంటుంది. కానీ.. మన జీవితాలు దేవుడు రాస్తున్న కథలు.. అంతా ఆయన ఇష్టం అంటుంది తులసి. మనం కేవలం నిమిత్తమాత్రులం. కథలో పాత్రలం మాత్రమే. జరిగిన గొడవ తలుచుకుంటే నాకూ బాధగానే ఉంది. అలా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపించింది కానీ.. జరిగిపోయింది అంటుంది తులసి.

Advertisement

దీంతో జరిగిపోయిన దాని గురించి కాదమ్మా నా ఆరాటం. ఇక నుంచి నువ్వు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది అనసూయ. దీంతో చేసిన తప్పుకు శిక్ష అనుభవించబోతున్నాను అంటుంది తులసి. నా దృష్టిలో నమ్మకం కోల్పోవడం అంటే ప్రాణాలు కోల్పోవడం. సామ్రాట్ గారు నమ్మింది తులసిని కాదు.. తులసి నిజాయితీని, మంచితనాన్ని.

మీ అబ్బాయి నా మాజీ భర్త అనే నిజాన్ని సామ్రాట్ గారి దగ్గర దాచి పెద్ద తప్పు చేశాను. నిజం తెలియగానే సామ్రాట్ గారు నా వైపు చూసిన చూపు చాలు. ఆయన దృష్టిలో నేను ఎంతగా పడిపోయానో అని తెలియడానికి. నేను స్వేచ్ఛగా ఎదగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కాబోలు అని అంటుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 2 Sep Today Episode : నందుకు ఫోన్ చేసిన అనసూయ

నిజం ఏంటో.. తప్పేంటో నువ్వు వెళ్లి సామ్రాట్ కు చెప్పు. అప్పుడు ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు అంటాడు పరందామయ్య. ఇంతలో అభి వచ్చి దాన్ని స్వార్థం అంటారు అంటాడు అభి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు.. నేను బాగుంటే చాలు అనుకోవడం స్వార్థమే అవుతుంది తాతయ్య అంటాడు అభి.

ఇంతలో అంకిత వచ్చి చప్పట్లు కొడుతుంది. అంకితను చూసి అభి షాక్ అవుతాడు. స్వార్థం గురించి డెఫినేషన్ నువ్వు బాగా చెప్పావు. కానీ.. నువ్వు ఆంటిని వేలెత్తి చూపించడమే అసహ్యంగా ఉంది అంటుంది అంకిత. తన గురించి ఆలోచించుకోకుండా తన జీవితాన్ని మనందరి కోసం త్యాగం చేసింది అంటుంది అనసూయ.

కానీ.. ఆంటి దాన్ని త్యాగం అనుకోలేదు. బాధ్యత అనుకుంది అంటుంది అంకిత. మరోవైపు అనసూయ.. నందుకు ఫోన్ చేస్తుంది. ఎందుకు కాల్ చేశావమ్మా అంటాడు నందు. ఈ అమ్మ మీద అమ్మ మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఒక పని చేయాలి అంటుంది అనసూయ.

నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అంటుంది అనసూయ. తులసి మాజీ భర్తవి అన్న నిజం సామ్రాట్ నుంచి దాచమని తులసిని బతిమిలాడుకున్నది నువ్వు అంటుంది అనసూయ. ఆవేశంలో ఆ నిజాన్ని సామ్రాట్ ముందు బయటపెట్టుకున్నది నువ్వు. నువ్వు చేసిన పొరపాటుకు తులసి ఆయన ముందు దోషిగా తలదించుకోవాల్సి వస్తోంది.

Advertisement

వెంటనే సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఆ నిజాన్ని దాచాలని చెప్పింది నేనే అని చెప్పు అంటుంది అనసూయ. దీంతో నేను ఇప్పుడు వెళ్లి సామ్రాట్ ముందు దోషిగా నిలబడాలని అనుకోవడం లేదు అంటాడు నందు. మరోవైపు అభిపై అంకిత సీరియస్ అవుతుంది.

ఆంటీ నిన్ను ఎన్నిసార్లు కాపాడిందో తెలుసు కదా. నువ్వు కానీ.. నేను కానీ ఆంటీని పోషించడం లేదు. ఆంటి ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అంకిత. ఆంటీ మీద పర్సనల్ అటాక్ చేశావు కాబట్టే నీ గురించి మాట్లాడాల్సి వస్తోంది అభి అంటుంది అంకిత.

మరోవైపు సామ్రాట్, తులసి ఇద్దరూ ఆరోజు జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత తులసి కూడా నందు దగ్గరికి వెళ్లి నందును బతిమిలాడుతుంది. మన విషయం సామ్రాట్ గారికి తెలియకుండా ఉంచాలని మీరే బతిమిలాడారని చెప్పాలంటూ నందును కోరుతుంది. దీంతో హనీకి యాక్సిడెంట్ చేసింది నేనే అని ఆ విషయం నువ్వు దాచాలని చెప్పావని సామ్రాట్ గారికి చెబుతాను అని బెదిరిస్తాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి