intinti gruhalakshmi 20 april 2022 full episode
Intinti Gruhalakshmi 20 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 611 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ నాన్నకు కాల్ చేసి మాట్లాడుతాను. చెప్పమ్మా. పేరెంట్స్ మీటింగ్ కు రమ్మంటావా అంటుంది తులసి. దీంతో వద్దు మామ్ అంటుంది. నీకు నీ ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో.. నాకూ నీ ఆత్మాభిమానం అంతే ముఖ్యం మామ్. అందరూ నీవైపు తలెత్తి చూసేలా చేస్తున్నావు. అలాంటిది ఎందుకు మామ్.. ఒక్కసారిగా ఇదివరకు తులసిలా మారిపోతున్నావు. ఎందుకు డాడీకి సారీ చెప్పేందుకు రెడీ అయ్యావు అంటుంది దివ్య. నాకు రాజీ పడే తులసి కంటే.. ఆత్మాభిమానం కోసం నిలబడే తులసి అంటేనే ఇష్టం. నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం. డాడీ మీటింగ్ కు రాకూడదనే నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడంతో నాకు సగం భారం తగ్గింది అంటుంది దివ్య. దీంతో తులసి సంతోషిస్తుంది.
intinti gruhalakshmi 20 april 2022 full episode
పేరెంట్స్ మీటింగ్ కు నువ్వు ఒక్కదానివే వస్తావని ఇప్పటికే నేను మా ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి చెప్పాను. ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు అని చెబుతుంది దివ్య. కట్ చేస్తే.. లిరిక్స్ పేపర్ ను పట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు ప్రేమ్. ఆ పాటను చదివి.. ఇలాంటి చెత్త లిరిక్ నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.. ఎప్పుడూ చదవలేదు అని చెప్పి ఆ పేపర్ ను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. నీ స్థాయి పాట రాయడం కాదు.. కాఫీ తీసుకురావడం.. పో కాఫీ తీసుకురాపో అంటాడు. ప్రేమ్ వెళ్లిపోగానే చెత్త బుట్టలో ఉన్న పేపర్ ను తీసి ప్రేమ్ గాడు పాట బాగానే రాశాడు. దీన్ని మనమే కాపీ కొట్టేసి పేరు కొట్టేయాలి అని అనుకుంటాడు మప్పిల హరి.
కట్ చేస్తే అభి ఎక్కడ ఉన్నాడు.. వాడి కోసం పాలు తెచ్చాను అని అంకితను అడుగుతుంది తులసి. దీంతో పైన ఉన్నాడు ఆంటి అంటుంది అంకిత. దీంతో సర్లే.. నేను వెళ్లి ఇస్తాను అంటుంది. ఇంతలో అభి.. ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. మా అత్తయ్య గారు ఈ మధ్య చాలా మారిపోయారు అని ఫోన్ లో మాట్లాడుతుండటం తులసి వింటుంది.
నేను ఒప్పుకుంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. ఆంటి ప్రపోజల్ ను ఒప్పుకోవడానికి నేను ఫిక్స్ అయ్యాను. కానీ.. నేనే ఈ మాటను దాచుకున్నాను. పైకి ఎవ్వరికీ చెప్పలేదు అంటాడు. తనే మాకోసం సొంత ఇల్లు తీసుకుంది. హాస్పిటల్ కూడా కట్టిస్తానంది కానీ.. మామ్ గురించి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అంటాడు అభి.
దీంతో ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మీ అమ్మ గురించి కాదు.. నీ ఫ్యూచర్ గురించి అంటాడు తన ఫ్రెండ్. దీంతో అవును.. నా స్వార్థం నేను చూసుకోవడంలో తప్పేం లేదు. మామ్ కాదనడానికి కారణం లేదు కదా. మామ్ నాకోసం చాలా చేసింది. ఎమోషనల్ గా లాక్ అయిపోతున్నాను. లేకపోతే ఎప్పుడో నేను అత్తింటికి చేరేవాడిని. మామ్ నా బాధ అర్థం చేసుకొని ఈ జైలు నుంచి రిలీజ్ చేస్తే బాగుండు అని అనుకొని వెనక్కి తిరిగి అక్కడ ఉన్న తులసిని చూసి షాక్ అవుతాడు అభి.
నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు. ఖాళీ కడుపుతో సరిగ్గా నిద్రపట్టదు. అందుకే పాలు తీసుకొచ్చాను. తాగు నాన్నా అంటుంది. తీసుకో అంటుంది తులసి. తాగా వేడి సరిపోయిందో లేదో చెప్పు. లేదంటే మళ్లీ వెచ్చబెట్టి తీసుకొస్తాను అంటుంది తులసి.
దీంతో పాలు మొత్తం తాగేస్తాడు ప్రేమ్. గ్లాస్ తులసికి ఇస్తాడు. అదేంటి మామ్ మౌనంగా ఉన్నావు. ఏదైనా మాట్లాడు అంటాడు అభి. నా మౌనమేమీ ఆయుధం కాదు.. నిన్ను ఇబ్బంది పెట్టడానికి అంటుంది తులసి. నేను ఫోన్ లో మా ఫ్రెండ్ తో మాట్లాడింది విన్నావా అని అడుగుతాడు ప్రేమ్. దీంతో వినలేదురా అంటుంది తులసి.
మరోవైపు ప్రేమ్.. తనకు జరిగిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చెట్టు కొమ్మ మీద చేయి పెట్టి అది గుచ్చుకొని రక్తం వస్తున్నా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తనను అలా చూసి శృతి షాక్ అవుతుంది. ఏంటి ప్రేమ్ ఇది. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది శృతి.
తనను ఓదార్చుతుంది. నువ్వు గాయం చేసుకోవడం వల్ల లాభం ఏంటి. లక్ష్యాన్ని దూరం చేసుకోవడం తప్ప. ఇంకెప్పుడు ఇలా చేయనని మాటివ్వు అంటుంది శృతి. దీంతో సరే అని మాటిస్తాడు ప్రేమ్. సరే పదా.. ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేద్దాం అంటుంది శృతి.
మరోవైపు గాయత్రికి ఫోన్ చేస్తుంది తులసి. శ్రీరామనవమికి ఇంటికి తనను ఆహ్వానిస్తుంది తులసి. కానీ..గాయత్రికి అర్థం కాదు. తనకు ఫోన్ లో ఇంకేదో చెబుతుంది కానీ.. అది వినిపించదు. గాయత్రి చాలా సంతోషిస్తుంది. నీ మాటలు నమ్మమంటావా అంటుంది గాయత్రి.
దీంతో నాకు ఇచ్చిన మాట తప్పే అలవాటు కూడా లేదు.. అంటుంది తులసి. నీ మాట ప్రకారం రేపు వస్తాను. మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటుంది గాయత్రి. ఆ తర్వాత ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.