
intinti gruhalakshmi 20 december 2021 episode
Intinti Gruhalakshmi 20 Dec Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 20 డిసెంబర్ 2021, సోమవారం 506 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు, లాస్య.. శుభలేఖను చూస్తూ ఉంటుంది తులసి. ఇంతలో నందు వస్తాడు. ఆ శుభలేఖను తీసుకొని చించబోతాడు. కానీ.. వద్దని వారిస్తుంది తులసి. తులసికి సారీ చెబుతాడు నందు. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం అండి. అంతా అయిపోయింది. నన్ను మోసం చేసినట్టుగా లాస్యను మోసం చేయకండి అంటుంది తులసి. ఏది ఏమైనా.. నందు మాత్రం చాలా బాధపడతాడు. నీకు సర్జరీ చేయాలన్న విషయం నాకెందుకు చెప్పలేదు అంటాడు నందు. మీకు చెప్పే అవకాశం రాలేదు. లాస్యను చూసి నాకు చెప్పాలనిపించలేదు అంటుంది తులసి.
intinti gruhalakshmi 20 december 2021 episode
ఎప్పుడు సర్జరీ అని అడుగుతాడు నందు. దీంతో రెండు రోజుల్లో ఉంది. మీరు పెళ్లి పీటలు ఎక్కే రోజే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉంటాను అంటుంది తులసి. దీంతో నందు షాక్ అవుతాడు. అయితే నేను పెళ్లిన పోస్ట్ పోన్ చేసుకుంటా. నువ్వు నా పెళ్లికి వచ్చినా రాకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. నీకు ఆపరేషన్ అయ్యే సమయంలో నేను నీ పక్కన ఖచ్చితంగా ఉండాలి అంటాడు నందు. దీంతో మీరు అక్కడ ఉండి చేసేదేం ఉండదు అంటుంది తులసి. కానీ.. నందు మాత్రం వినడు. పెళ్లిని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఒరిగేదేం ఉండదు అంటాడు నందు. పెళ్లిని పోస్ట్ పోన్ ఎలా చేయాలని అలోచిస్తుంటాడు నందు. కానీ.. లాస్య దీనికి ఒప్పుకుంటుందో లేదో అని తెగ టెన్షన్ పడతాడు.
మరోవైపు తన తల్లి.. తులసికి ఫోన్ చేస్తుంది. దీంతో నాకు క్యాన్సర్ అనే విషయం చెప్పనందుకు సారీ చెబుతుంది తులసి. నేను వస్తాను అని అంటుంది తులసి తల్లి. వద్దు అంటుంది. రెండు రోజుల్లో మీ అల్లుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటుంది. దీంతో ఏంటి తులసి నువ్వు చెప్పేది అతడు మనిషేనా అంటుంది తులసి తల్లి.
లాస్య, నందు.. ఇద్దరూ కారులో పెళ్లి పనుల కోసం బయటికి వెళ్తారు. కొన్ని పనులు ముగిశాక.. ఇక ఇంటికి వెళ్దాం అంటాడు నందు. ఎందుకు ఇప్పుడు వెళ్లి తులసిని చూసేయాలా అంటుంది లాస్య. పెళ్లి పనులు పూర్తి కాకుండానే ఇంటికి వెళ్లడం ఏంటి అంటుంది లాస్య. ఎక్కువగా ఆలోచించకు నేను చెప్పిన చోటుకు తీసుకెళ్లు అంటుంది లాస్య.
మరోవైపు తులసి తల్లి.. తులసి కోసం దేవుడి దగ్గర పూజలు చేయించిన అక్షింతలు పంపిస్తుంది. వాటిని అంకిత ఇస్తుంది. తనకు వచ్చే ఓపిన ఉంటే ఈపాటికి నా పక్కన ఉండేది అంటుంది తులసి. ఆ అక్షింతలను మొక్కి తన అమ్మ గురించి బాధపడుతుంది తులసి. నువ్వు మా నోరు నొక్కినట్టే.. మీ అమ్మ నోరు కూడా నొక్కావు కదా అని తులసితో అంటుంది అనసూయ.
ఇంతలో నందును తీసుకొని లాస్య.. ఇంటికి వస్తుంది. అందరినీ పిలుస్తుంది. అందరూ త్వరగా హాల్ లోకి రండి అంటుంది. అప్పుడు వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు స్వీట్లు ఇవ్వలేదు కదా.. ఇప్పుడు తెచ్చాను తీసుకోండి అంటుంది. కానీ.. ఎవ్వరూ తినరు. ఒక తులసి మాత్రమే తింటుంది.
లాస్య ఇంతలా రెచ్చిపోవడానికి కారణం తులసే అని తెలుసుకొని అనసూయ తెగ బాధపడుతుంది. తనకు కోపం వస్తుంది కానీ ఏం చేయలేదు. బయట కూర్చొని తెగ బాధపడుతుంటుంది అనసూయ. రోలులో ఏదో నూరుతూ తెగ బాధపడుతుండగా తులసి చూసి నవ్వుకుంటుంది.
అనసూయ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది తులసి. ఏదో కోపంలో ఉన్నట్టున్నారు అంటుంది. మరోవైపు లాస్య, నందు పెళ్లి పనులు జరుగుతుంటాయి. మండపం కూడా సెట్ చేసేస్తారు. రేపు పెళ్లి అయితే ఇవాళే మండపం ఎందుకు వేశారు అంటుంది భాగ్య. పెళ్లి రేపే కానీ.. మా ఇద్దరి జాతకాల్లో ఏదో దోషం ఉందట. అందుకే మండపంలో దీపం వెలిగించమన్నారు పూజారి గారు అంటుంది లాస్య.
అత్తయ్య మండపంలో దీపం వెలిగిద్దాం రండి అంటుంది లాస్య. నాకోసం కాకపోయినా.. మీ అబ్బాయి జీవితం కోసమయినా మీరు దీపం ముట్టించండి అంటుంది లాస్య. అయినా కూడా వినకుండా అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనసూయతో పాటు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. నేను కూడా వెళ్లొస్తాను అంటాడు నందు. దీంతో లాస్య షాక్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.