intinti gruhalakshmi 20 november 2021 full episode
Intinti Gruhalakshmi 20 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 482 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు వెళ్లి ఇద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయేమో అనుకున్నాం కానీ.. లాస్యను పెళ్లి చేసుకుంటా అని అంకుల్ చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది అంటుంది శృతి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని అందరూ అనుకుంటారు. ఇంతలో తులసి వస్తుంది. ఏంటి.. మీ అందరి ముఖాల్లో ఏదో బాధ కనిపిస్తోంది అంటుంది. మీకు బాధగా అనిపించడం లేదా అని తులసిని అడుగుతారు అందరూ.
intinti gruhalakshmi 20 november 2021 full episode
ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ మనం ఉండలేం. జరగని విషయాల గురించి తలుచుకొని ఏంటి లాభం. మనకు దక్కిందే ప్రాప్తం అని సంతోషపడాలి అని అందరితో అంటుంది తులసి. అమ్మ.. అలా అని నాన్న చేసే తప్పును పట్టించుకోకుండా ఉంటే జీవితంలో మరో తప్పు చేసిన దానివి అవుతావు.. అని ప్రేమ్ అంటాడు. నేను దగ్గరవ్వాలన్న తాపత్రయం.. ఆయన దగ్గర అవుతారన్న ఆశ కూడా నాకు లేదు. మేమిద్దరం ఏనాటికీ కలవం అని చెబుతుంది. అయినా మమ్మల్ని కలపడానికి మీరంతా ఎందుకు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటుంది తులసి.
ఎందుకంటే.. ఈ ఇంటి కోడలి స్థానంలో నువ్వు తప్ప ఇంకొకరు రాకూడదు. ఇంకొకరిని ఊహించుకోలేం అని అంటుంది అనసూయ. దీంతో తులసి షాక్ అవుతుంది. ఇదే నాజీవితం.. మరిచిపోతున్న బాధను గుర్తు చేయకండి అని చెబుతుంది తులసి.
ఇంతలో లాస్య.. తన కొడుకు ఇంటికి తీసుకొస్తుంది. ఇదే నీ ఇల్లు. ఇప్పటి నుంచి ఈయనే నీ నాన్న అని నందును చూపిస్తుంది. ఇక నుంచి నువ్వు ఈయన్నే నాన్న అని పిలవాలి.. అంటుంది. వెంటనే తులసి ఆంటిని కలిసి వస్తాను అంటాడు లక్కీ. లక్కీ బాగున్నావా.. అని హత్తుకుంటుంది తులసి.
ఎన్నిరోజులు అయిందిరా నిన్ను చూసి. ఈ ఆంటిని మరిచిపోయావా అంటుంది. లేదు ఆంటి.. మమ్మీ తీసుకురమ్మంటే తీసుకురాలేదు అంటుంది. రాత్రికి నాకు బోలెడు కథలు చెప్పాలి అంటాడు లక్కీ. సరే.. అంటుంది తులసి. నందును పిలిచి.. కొడుకును చూపిస్తుంది.
లక్కీ నీకు డాడీ కావాలి.. డాడీ కావాలి అన్నావు కదా.. నీకు డాడీని చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు నుంచి ఈయనే మీ డాడీ అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి మమ్మీ.. ఈయన అంకుల్ కదా.. సడెన్ గా డాడీ ఎలా అయ్యారు.. అంటాడు లక్కీ. సరే.. అని డాడీ అని పిలుస్తాడు.
దీంతో నందుకు చిరాకు వస్తుంది. ఎవడ్రా నీకు డాడీ. ఇంకోసారి అలా పిలుస్తే నాలుక కోస్తాను అంటాడు నందు. ఏమైంది నందు.. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటుంది లాస్య. ఒక్కసారిగా పిలుపు మారేసరికి నాకు ఇబ్బందిగా అనిపించింది.. అంటాడు నందు.
తులసి కూడా అడుగుతుంది. లాస్యను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నప్పుడే తన బంధాలు.. మీ బంధాలుగా మారిపోయాయి.. అంటుంది. లాస్యను ప్రేమించినప్పుడు ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీకు తెలియదా అంటుంది తులసి.
తర్వాత లక్కీ.. నేను ఇక్కడ ఉండను.. హాస్టల్ కే వెళ్లిపోతాను అంటాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. నాకు భయంగా ఉంది. నిన్నటి వరకు డాడీ ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు వద్దు అనిపిస్తోంది అంటాడు లక్కీ. తొందరలోనే నేను, మీ డాడీ పెళ్లి చేసుకోబోతున్నాం. ఇక నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు అని లక్కీకి చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.