Home » Entertainment » Intinti Gruhalakshmi 20 September 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 20 Sep Today Episode : తులసి ఫ్యామిలీ సామ్రాట్ ఇంటికి షిఫ్ట్ అవుతుందా? దానికి అభి ఒప్పుకుంటాడా? తులసి ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 20, 2022 8:14 am
Advertisement

Intinti Gruhalakshmi 20 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 742 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీని చూసి సామ్రాట్ బాధపడటంతో నందు చలించిపోతాడు. అసలు నేను ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాను. ఎందుకు ఇలా తయారయ్యాను.. అని తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏంటి అని అనుకుంటాడు. ఇంతలో లాస్య వచ్చి ఏమైంది. ఏం ఆలోచిస్తున్నావు. నిన్న రాత్రి లేట్ గా వచ్చావు ఏంటి. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది లాస్య. దీంతో మందు తాగాలనిపించింది అందుకే వెళ్లాను అంటాడు నందు. దీంతో మందు తాగాక ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది లాస్య. దీంతో నేను ఎక్కడికీ వెళ్లలేదు అంటాడు నందు. ఎక్కడికీ వెళ్లలేదా.. ఇదేంటి అని ప్యాంట్ తీసుకొని దానికి అంటిన దాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది లాస్య. దీంతో నందు షాక్ అవుతాడు. సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేశాక.. చేతులకు అంటిన గ్రీజును తన ఫ్యాంట్ కు రాసుకుంటాడు. దాన్ని కనిపెడుతుంది లాస్య. సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేశావు కదా అని అడుగుతుంది లాస్య.

Advertisement

intinti gruhalakshmi 20 september 2022 full episode

దీంతో నందు అవును అంటాడు. అసలు ఎందుకు ఇలాంటి పని చేశావు. ఇది కూడా హత్యా ప్రయత్నమే కదా అంటుంది లాస్య. దీంతో ఇలాంటి పని ఇంకెప్పుడూ చేయను మాటిస్తున్నాను అంటాడు నందు. ఈ ప్లాన్ ఇంకెవరికైనా తెలుసా అని అడుగుతుంది లాస్య. దీంతో మెకానిక్ సురేశ్ కు దాని గురించి చెప్పాను అని అంటాడు నందు. దీంతో ఈ విషయం వాడి ద్వారా సామ్రాట్ కు చేరితే సామ్రాట్ నిన్ను బతకనివ్వడు. ముందు వాడి నోరు మూయించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు హనీ ఇంట్లో తినమంటే అస్సలు తినదు. పని మనిషి తినిపించినా తినదు. నాకు వంట నచ్చలేదు తినను అని చెప్పి గుడ్ నైట్ నాన్న నేను వెళ్లి పడుకుంటాను అని సామ్రాట్ కు చెబుతుంది.

Advertisement

సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో బాబాయి వస్తాడు. సామ్రాట్ అంటాడు. డాక్టర్లు ప్రాబ్లమ్ లేదని చెప్పారు కదా. హనీకి నార్మల్ అవుతుందిలే అంటాడు బాబాయి. అనుకోకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావు అంటాడు బాబాయి. దీంతో నేను ఆలోచించేది దాని గురించి కాదు. జరిగింది మేజర్ యాక్సిడెంట్ అంటాడు. ఒకవేళ నా ప్రాణానికి ఏదైనా జరిగి ఉంటే.. అప్పుడు హనీ పరిస్థితి ఏంటి బాబాయి. ఒక అనాథలా బతకాల్సిందే కదా. నాన్న అనే పిలుపుకు కూడా అది శాశ్వతంగా దూరం అవ్వాల్సి వచ్చేది కదా. అలాంటి పరిస్థితిలో హనీని ఊహించుకుంటే.. అసలు ఆ ఆలోచనే భయంకరంగా ఉంది బాబాయి అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 20 Sep Today Episode : బాబాయితో హనీ గురించి మాట్లాడిన సామ్రాట్

హనీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని అనుకున్నా కానీ.. నువ్వు హెచ్చరించినా పట్టించుకునేవాడిని కాదు. ఆ యాక్సిడెంట్ నా మెండితనాన్ని ముక్కలు చేసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అసలు జీవితమే శాశ్వతం కాదు.. అనిపిస్తోంది బాబాయి అంటాడు సామ్రాట్.

Advertisement

హనీ కోరుకునే ఆప్యాయత దొరకడం లేదు అంటాడు బాబాయి. తండ్రి ప్రేమ ఎప్పటికీ తల్లి ప్రేమ కాదు బాబాయి అని అంటాడు సాట్రామ్. మరోవైపు హనీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తులసి. అందరికీ చెప్పి బాధపడుతుంది. హుషారుగా ఎగురుతూ తిరగాల్సిన పిల్ల.. మంచానికి అతుక్కుపోయింది. గుర్తొస్తే బాధగా ఉంది మామయ్య అంటుంది తులసి.

పక్కన తల్లి ఉంటే ఆ ధైర్యం వేరు. కానీ.. అన్నీ ఉన్న అనాథ హనీ అని బాధపడుతుంది తులసి. హనీ కోలుకునే వరకు తనను తెచ్చుకొని మనింట్లో ఉంచుకుందాం అంటాడు పరందామయ్య. అందరూ పరందామయ్య చెప్పిన దానికి ఓకే అంటారు. ఈ ఆలోచన బాగా ఉంది కానీ.. సామ్రాట్ గారు ఒప్పుకుంటారా అని అంటుంది తులసి.

ఆయనకు హనీ బాగా అలవాటు. హనీ లేకపోతే ఆయన బెంగపెట్టుకుంటారేమో అంటుంది తులసి. అభి వద్దు అంటాడు. నీ అనుమానం ఏంట్రా అంటుంది తులసి. దీంతో హనీ గొలుసు కనిపించకపోతేనే మన ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేశారు. పొరపాటున ఇక్కడ హనీకి ఏదైనా అయితే ఇంకేమన్నా ఉందా అంటాడు అభి.

దీంతో మనం ఇప్పుడు ఆలోచించాల్సింది సామ్రాట్ గురించి కాదు.. హనీ గురించి అంటుంది తులసి. దీంతో కరెక్ట్ గా చెప్పావమ్మా అంటుంది అనసూయ. కట్ చేస్తే తెల్లవారుతుంది. తులసి ఫ్యామిలీ సరదాగా గడుపుతుంది. తులసి అందరి కోసం పాయసం చేస్తుంది.

Advertisement

దీంతో నాకు ఇంకా ఎక్కువ పాయసం కావాలని అంటుంది అనసూయ. దీంతో నేనేం చేస్తాను అంటాడు పరందామయ్య. దీంతో తులసి వాళ్లను కిచెన్ లో నుంచి వెళ్లేలా ప్లాన్ వేసి.. ఇద్దరూ కిచెన్ లోకి వెళ్లి పాయసం పెట్టుకొని తింటారు. ఇద్దరూ పాయసం తినడం తులసి, కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు.

మా ఇంట్లో అందరికీ హనీ అంటే ఇష్టం. బాగా అలవాటు అందుకే కొద్ది రోజులు తనను మా ఇంట్లో ఉంచుకుందామనుకుంటున్నాం అని సామ్రాట్ తో చెబుతుంది తులసి. దీంతో హనీ నన్ను వదిలి ఉంటుంది కానీ.. నేను హనీని వదిలి ఉండలేను. అందుకే మీరే కొన్ని రోజులు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి