Intinti Gruhalakshmi 21 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్వరూ మండపంలో దీపం వెలిగించడానికి రాకపోయేసరికి.. లాస్య ఒక్కతే వెళ్లి మండపంలో దీపం వెలిగిస్తుంది. దీంతో నిన్ను చూసి బాధ పడాలో.. జాలి పడాలో నాకు అర్థం కావడం లేదు లాస్య అంటుంది భాగ్య. ఇప్పుడెందుకు అంత డౌట్ వచ్చింది అంటుంది లాస్య. బావ గారిని చూస్తుంటే నాకు ఎందుకో కాస్త అనుమానం కలుగుతోంది. ఆయన ఎందుకో కన్ఫ్యూజన్ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆయన పాత బంధం ఇంకా విడిపోలేదేమో అని అంటుంది. నందు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నా.. నేను మాత్రం చాలా క్లారిటీతో ఉన్నాను. పాత లెక్కలన్నీ వెంటనే సెట్ చేస్తాను.. అంటుంది లాస్య. మరోవైపు రాత్రి అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది లాస్య. ఈరోజుకు నేను భాగ్యతో పడుకుంటాను అని చెప్పి లాస్య వెళ్లిపోతుంది.
నందుకు మాత్రం ఏం అర్థం కాదు. ఏం చేయాలో తెలియదు. పిచ్చెక్కుతుంది. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అనసూయ చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మరోవైపు నందు, లాస్య పెళ్లి అవుతోందని అందరూ టెన్షన్ పడుతుంటారు. బాధలో ఉంటారు. ఇంకా నందు నిద్రలేవలేదు ఏంటి అని అందరూ అనుకుంటారు. తులసి ఎక్కడికిపోయింది అని అనుకుంటారు. తను పూల కోసం గార్డెన్ కు వెళ్లింది అంటారు. ఇంతలో అత్తయ్య అత్తయ్య అంటూ లాస్య పిలుస్తుంది. త్వరగా అందరూ రండి లేట్ అయిపోతుంది అంటుంది. ఏమైంది అని అందరూ బయటికి వెళ్తారు. రండి.. రండి.. వచ్చి నాకు మంగళస్నానం చేయించండి అంటుంది లాస్య. ఎలా ఉంది అత్తయ్య నా మంగళస్నానం డెకరేషన్ అంటుంది. ఏడ్చినట్టు ఉంది అని మనసులో అనుకుంటుంది అనసూయ.
అదేంటి అత్తయ్య ఎవ్వరూ ఇంకా రెడీ కాలేదు. నాకు నలుగు పెట్టి మంగళస్నానం చేయించండి. రండి.. రండి.. నాకు త్వరగా మంగళస్నానం చేయించండి అంటుంది లాస్య. ఇంతలో తులసి పువ్వులు తెంపుకొని ఇంట్లోకి వెళ్తుంటుంది. తులసిని పిలిచి.. ఈ శారీలో ఎలా ఉన్నా అంటుంది లాస్య.
చాలా బాగున్నావు అంటుంది. సరే.. అని వెళ్లిపోబోతుంటుంది. ఇంతలో లాస్యకు మంగళస్నానం చేయించుదాం రండి అని అంటుంది భాగ్య. నాకు అంత ఆసక్తి లేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది తులసి. దానితోనే నలుగు పెట్టించుకో అని చెప్పి.. అనసూయ, అంకిత, శృతి అందరూ వెళ్లిపోతారు.
నీకు కనీసం మంగళస్నానం చేయించడానికి కూడా ఏం రోగం వీళ్లకు.. అని భాగ్య అంటుంది. దీంతో లాస్య ఒక్కతే తనకు తానే మంగళస్నానం చేయించుకుంటుంది. నా పెళ్లి నేనే చేసుకుంటాను. నా నలుగు నేనే పెట్టుకుంటాను. ఏది జరగడం ఆగదు.. అంటుంది లాస్య.
శభాష్ లాస్య.. నీ పెళ్లి ఆపడం ఎవరి తరం కాదు అంటుంది భాగ్య. తర్వాత నందు దగ్గరికి వెళ్లిపోతుంది లాస్య. నందు.. నువ్వు మంగళస్నానానికి రాలేదు ఏంటి అంటుంది అని అడుగుతుంది. సరే.. రాకున్నా ఏం లేదు అందుకే నేను వచ్చాను అంటుంది. ఎలాగూ జీవితాంతం నీతో బతకాలి కదా. అందుకే నా నలుగు నేనే పెట్టుకున్నాను అంటుంది లాస్య.
కానీ.. నేను నీకు నలుగు పెడతాను. అది కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా నలుగు పెడతాను అని.. తన చెంపలకు ఉన్న నలుగును చెంపలతోనే నలుగు పెడుతుంది. ఏంటి లాస్య ఇదంతా మనకు ఏమన్నా మొదటిసారి పెళ్లి జరుగుతోందనుకుంటున్నావా? అంటాడు నందు.
మనిద్దరికి కలిపి ఈ పెళ్లి మొదటిసారే కదా అంటుంది లాస్య. ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా నేను విన్నాను. ఇక నుంచి నేను ఏం చెప్పినా నువ్వు వినాల్సిందే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెడీ అవ్వు పెళ్లి కొడకా అంటుంది లాస్య. 4 గంటలకే ముహూర్తం. గుర్తుంది కదా.. అంటూ చెప్పి వెళ్లిపోతుంది.
తర్వాత అనసూయ.. లాస్యపై చిరాకు పడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ ముందు లాస్య ఒక్కతే నలుగు పెట్టుకుందని చెబుతుంది. మరోవైపు పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. లాస్య పెళ్లి కూతురులా రెడీ అయి వస్తుంది. కానీ.. నందు మాత్రం ఇంకా రాడు. దీంతో లాస్యకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
కట్ చేస్తే.. నందు ఇంట్లో ఉండడు. నందుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. నందు అంటూ ఇంట్లోకి వెళ్తే.. అనసూయ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక లాస్య పిచ్చిది అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
This website uses cookies.