Home » Entertainment » Intinti Gruhalakshmi 21 March 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 21 March Today Episode : ప్రేమ్ ఆటో నడపబోతున్నాడని తెలుసుకొని శృతి షాక్.. ప్రేమ్ విషయంలో దివ్య షాకింగ్ నిర్ణయం.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: March 21, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 21 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 585 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ సంతోషంగా ప్రేమ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రేమ్.. ఆంటి నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చారో అడగవా అని అంటుంది అంకిత. దీంతో ఏం గిఫ్ట్ తెచ్చావ్ మామ్ అంటాడు ప్రేమ్. తొందరెందుకు అంటుంది తులసి. ఇంతలో అభి వెళ్లి ఆ గిఫ్ట్ తెచ్చి తులసికి ఇస్తాడు. తులసి ఆ గిఫ్ట్ ను ప్రేమ్ కు ఇస్తుంది. అది గిటార్. ఇది అమ్మ ఇచ్చే గిఫ్ట్ కాదు. అమ్మ మనసు. దీనికి బదులుగా నువ్వు ఒక మాట ఇవ్వాలి ప్రేమ్ అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 21 march 2022 full episode

ఈ గిటార్ ఇప్పటి నుంచి నీ జీవితం కావాలి అంటుంది. నువ్వు గొప్ప గాయకుడివి కావాలి. పేరు సంపాదించాలి అంటుంది తులసి. దీంతో సరే అమ్మ అంటాడు. ప్రేమ్.. ఆంటి నీకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు బదులుగా నువ్వు ఒక పాట పాడాలి అంటుంది శృతి. కుటుంబ సభ్యులు కూడా అందరు అడగడంతో.. పెదవే పలికిన మాటల్లోనా అంటూ పాట పాడుతాడు ప్రేమ్. దీంతో అందరూ సంతోషిస్తారు. ఎప్పుడూ మీ అమ్మ గురించే పాడుతావా.. ఈరోజు ఫ్యామిలీ పార్టీరా.. సెలబ్రేట్ పార్టీ అంటాడు పరందామయ్య.. ఇదంతా గత సంవత్సరం జరిగిన బర్త్ డే. ఆ వేడుకలను ప్రేమ్ గుర్తు తెచ్చుకుంటాడు.

Advertisement

లాస్ట్ ఇయర్ అందరి మధ్య జరుపుకున్నావు. ఈసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఇంతే చేయగలిగాను అంటుంది శృతి. బాధపడకు ప్రేమ్ అంటుంది శృతి. అమ్మ నా పక్కన లేకపోయినా.. అమ్మలా చూసుకోవడానికి నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అది చాలు అంటాడు ప్రేమ్.

నువ్వే నాకు అన్నీ అంటాడు ప్రేమ్. మరోవైపు ఆటోలో ప్రేమ్, శృతి.. గుడికి వెళ్తారు. ఇంత దూరం వచ్చి ఈ గుడిలో ఎందుకు పూజ చేయించడం అని అడుగుతుంది శృతి. దీంతో ప్రతి సంవత్సరం నా బర్త్ డే రోజు అమ్మ ఈ గుడిలో పూజ చేస్తుంది అని చెబుతాడు ప్రేమ్.

Advertisement

అప్పటికే తులసి.. ఆ గుడిలో ప్రేమ్ కోసం పూజ చేస్తూ ఉంటుంది కానీ.. ప్రేమ్ తనను చూడడు. వద్దు ప్రేమ్.. మనం వెనక్కి వెళ్లిపోదాం. ఎందుకంటే.. ఒకవేళ ఈసారి మీ అమ్మ ఇక్కడికి రాకపోతే నువ్వు బాధపడతావు అంటుంది శృతి. దీంతో సరే.. శృతి మనం వెనక్కి వెళ్లిపోదాం అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi 21 March Today Episode : గుడిలో ప్రేమ్ కు అర్చన చేయించిన తులసి

అమ్మ రాకపోతే ప్రేమ లేదని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అన్నావు కదా.. ఒకవేళ అమ్మ ఉంటే జీవితాంతం ప్రేమ్ ఉందని సంతోషంగా కూడా ఉండొచ్చు కదా. అందుకే లోపలికి వెళ్లి ఒకసారి చూద్దాం అంటాడు. లోపలికి వెళ్తారు. వాళ్లను తులసి చూస్తుంది.

ప్రేమ్ కంటపడకూడదని అనుకుంటుంది తులసి. దీంతో అక్కడి నుంచి వెళ్లి దాచుకుంటుంది. అమ్మ ఇంకా రాలేదనుకుంటా అని అనుకుంటాడు ప్రేమ్. వెళ్లి పంతులును అడుగుతాడు. దీంతో ఎవ్వరూ రాలేదు బాబు అంటాడు పంతులు.

దీంతో అమ్మ వచ్చేదాక వెయిట్ చేద్దాం పదా అంటాడు ప్రేమ్. అమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అమ్మ కనుక రాకపోతే జీవితంలో నేను ఇక పుట్టిన రోజులు చేసుకోను అని అంటాడు ప్రేమ్. ఆంటి వచ్చినా నీ వైపు చూడరు కావచ్చు అంటుంది శృతి.

Advertisement

ప్రేమ్ కంట పడకుండా.. తులసి అక్కడే దాక్కొని ఉంటుంది. దీంతో ఆంటి వస్తారో రారో.. మనం అయితే గుడిలో దండం పెట్టుకొని వెళ్దాం పదా అంటుంది శృతి. దీంతో సరే పదా అని గుడిలోపలికి వెళ్తారు ప్రేమ్, శృతి. ఇంతలో తులసి బయటికి వచ్చి అక్కడి నుంచి ఆటోలో వెళ్తుంటుంది.

ఆటోలో వెళ్తున్న తులసిని ప్రేమ్ చూస్తాడు. చాలా సంతోషిస్తాడు. కట్ చేస్తే ప్రేమ్ అన్నయ్యను అమ్మ పూర్తిగా వదిలేసింది అని అంకితతో అంటుంది దివ్య. అన్నయ్యను పిలిచి.. బర్త్ డే సెలబ్రేషన్స్ అయినా చేద్దాం అంటుంది దివ్య. అది కుదరదు దివ్య అంటుంది అంకిత.

ఇంతలో గుడి నుంచి వస్తారు ప్రేమ్, శృతి. వాళ్ల ఇంటి వద్ద బాబురావు, ఆయన భార్య ఇద్దరూ వెయిట్ చేస్తుంటారు. రాగానే.. ఏమైంది అని అడుగుతారు. ప్రేమ్ బర్త్ డే అని తెలుసుకొని అతడికి సర్ ప్రైజ్ ఇస్తారు. రాములమ్మ కూడా వస్తుంది.

ఆ తర్వాత ప్రేమ్.. ఆటో నడపాలని నిశ్చయించుకున్నాడని బాబురావుకు తెలిసి తన ఆటోనే ఇస్తాడు. ఈ విషయం తెలిసి శృతి చాలా బాధపడుతుంది. తనకు తెలియకుండా.. ఆటో నడపడానికి ప్రేమ్ ఎలా నిర్ణయించుకున్నాడని అనుకొని బాధపడుతుంది. నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు ఎందుకు ప్రేమ్ అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి