
intinti gruhalakshmi 21 september 2022 full episode
Intinti Gruhalakshmi 21 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 743 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ చాలా దీనంగా కూర్చొని ఉంటుంది. దీంతో ఏమైందమ్మా అలా కూర్చున్నావు అని సామ్రాట్ అడుగుతాడు. దీంతో బోర్ కొడుతోంది అంటుంది హనీ. ఇంట్లో కూర్చొని కార్టూన్ నెట్ వర్క్ చూసుకో అంటాడు బాబాయి. ఎంత సేపు చూడాలి బోర్ కొడుతోంది అంటుంది హనీ. ఇంతలో నందు, లాస్య వస్తారు. మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము పెద్ద బొమ్మను తీసుకొచ్చాం అని చెప్పి లక్కీని చూపిస్తారు. దీంతో లక్కీ చాలా సంతోషిస్తుంది. లక్కీతో కలిసి ఆడుకుంటా అంటుంది హనీ. అయితే.. ఉదయం నుంచి హనీ ఏం తినలేదు అని అంటాడు బాబాయి. దీంతో నేను తినిపిస్తా అంటుంది లాస్య.
intinti gruhalakshmi 21 september 2022 full episode
ఇంతలో ఆటోలో తులసి వస్తుంది. బాక్స్ తీసుకొని వస్తుంది. అనుకున్నా ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది లాస్య. ఆ చేతుల్లో బాక్స్ ఏంటి అని అడుగుతాడు బాబాయి. దీంతో హనీ కోసం బాక్స్ తీసుకొచ్చా అంటుంది. నీకెందుకమ్మా శ్రమ అంటాడు బాబాయి. దీంతో మాకోసం వండిన దాంట్లోనే కొంచెం హనీకి తీసుకొచ్చా. ఇందులో శ్రమ ఏముంది అని అంటుంది తులసి. ఆ తర్వాత హనీకి వెళ్లి తినిపిస్తుంది. ఆ తర్వాత లాస్య, నందు వెళ్లిపోతారు. మరోవైపు సామ్రాట్, తులసి ఇద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. హనీ, లక్కీ ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు.
ఇంతలో హనీని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తా అంటుంది తులసి. దీంతో హనీ మీతో ఉంటుంది కానీ.. నేను హనీ లేకుండా ఉండలేను అంటాడు సామ్రాట్. మీరు ఒకపని చేయండి. మీరే మీ ఫ్యామిలీతో కలిసి అందరూ వచ్చి ఇక్కడ ఉండండి.. కొన్ని రోజులు ఇక్కడే ఉంటే హనీ కూడా నార్మల్ అవుతుంది అని చెబుతాడు సామ్రాట్.
ఈ విషయంపై నేను వెంటనే నా నిర్ణయం చెప్పలేను. దీనిపై మా ఫ్యామిలీతో మాట్లాడాలి.. వాళ్ల నిర్ణయం తీసుకున్నాక చెబుతా అంటుంది తులసి. దీంతో సరే అంటాడు సామ్రాట్. మరోవైపు లాస్య, నందు ఇద్దరూ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు.
తులసి ఎప్పుడు చూసినా సామ్రాట్ ఇంట్లోనే ఉంటోంది. ఇంటి దగ్గర్నుంచే ఇద్దరూ ఆఫీసు పని చేస్తున్నట్టున్నారు అంటాడు నందు. మరోవైపు నువ్వు కావాలనే లక్కీని నీకు దూరం చేసుకొని తులసికి దగ్గర చేస్తున్నావు అంటాడు నందు.
ఇంటికి వెళ్లాక అందరికీ సామ్రాట్ చెప్పిన విషయం చెబుతుంది తులసి. దీంతో అభి నేను ఒప్పుకోను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. సామ్రాట్ గారికి కావాల్సినంత డబ్బు ఉంది. పాపకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోగలడు అంటాడు అభి.
మనమే హనీని ఇక్కడికి తీసుకొద్దాం అంటున్నా కదా. ఇంకేంటి అంటాడు అభి. దీంతో నువ్వు ఏ పనీ సక్రమంగా చేయనీయవు అంటుంది అనసూయ. పాపం సామ్రాట్ గారు పాపను వదిలి ఉండలేక అక్కడికి వచ్చి ఉండమంటున్నారు అంటాడు పరందామయ్య.
నీ ఆఫీసుకే కాదు.. మన ఇంటికి కూడా ఆయనే బాస్ అయ్యాడు అంటాడు అభి. దీంతో అమ్మను ఒక్కదాన్నే పంపిద్దాం అంటాడు ప్రేమ్. దీంతో అలా ఎలా కుదురుతుంది అంటాడు అభి. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే ఇంటికి తిరిగి వచ్చేద్దాం అంటుంది తులసి.
రాత్రి కాగానే మందు తాగుతూ ఉంటాడు సామ్రాట్. దీంతో బాబాయి అక్కడికి వస్తాడు. దొరికిన అదృష్టానికి సంతోషించాలి అంటాడు. దీంతో కావాలని నువ్వు దురదృష్టాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతున్నావు అంటాడు బాబాయి.
కట్ చేస్తే తెల్లవారగానే తులసి ఫ్యామిలీ అంతా సామ్రాట్ ఇంటికి వస్తారు. ఈ విషయం తెలిసి నందు అక్కడికి వచ్చి నా వాళ్లను అందరినీ తీసుకొని అర్జెంట్ గా ఇంటికి వెళ్లిపో. ఈ ఇంటికి నువ్వు సేవ చేయడానికి వచ్చినట్టుగా లేదు.. ఈ ఇంటి మనిషిగా వచ్చినట్టు ఉంది అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.